దారి తప్పి భూమి వైపు దూసుకొస్తోన్న ఖగోళ వింత వస్తువు: 19న ఏం జరగబోతోంది?
మన సౌర వ్యవస్థలోకి ఇటీవల ప్రవేశించిన ఓ తోకచుక్క అంతరిక్ష పరిశోధకులకు సవాల్ విసురుతోంది. దాని కదలికలు ఆశ్చర్యానికి గురి చేస్తోన్నాయి. ఎటు తిరిగి ఎటు వస్తుందో.. అనే ఆందోళన వారిలో నెలకొంది. దీని ప్రభావం భూమిపై ఉండకపోవచ్చనడానికి గ్యారంటీ ఇవ్వట్లేదు. దీనికి 3ఐ/అట్లాస్ (3I/ATLAS)గా పేరు పెట్టారు. ఇదొక ఇంటర్ స్టెల్లార్ తోకచుక్క. ఈ ఏడాది జులైలో దీన్ని గుర్తించారు. ఇలాంటి తోకచుక్కను గుర్తించడం ఇది మూడోసారి మాత్రమే.
జూలై 1వ తేదీన చిలీలో గల నాసా ATLAS టెలిస్కోప్ గుర్తించింది. ఈ ఆబ్జెక్ట్.. ఈ నెల 19వ తేదీన భూమికి అత్యంత దగ్గరగా రానుంది. సుమారు 270 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి దూసుకెళ్లనుందీ తోకచుక్క. మన సౌర వ్యవస్థ వెలుపల, మరో నక్షత్ర మండలం నుండి వచ్చింది. ఇది గంటకు సుమారు 2,10,000 కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తోంది. ఈ వేగం వల్ల సూర్యుని గురుత్వాకర్షణకు సైతం అది చిక్కట్లేదు.

భూమికి దగ్గర పడుతున్న కొద్దీ ఈ తోకచుక్క ఆకుపచ్చరంగులో మారుతోండటం ప్రాధాన్యతనుె సంతరించుకుంది. థాయ్ లాండ్ రేయాంగ్‌లోని 0.26 మీటర్ల టెలిస్కోప్ నుండి 13న తాజా ఫొటో దీని రంగును బయటపెట్టింది. అధికారికంగా ఇది ఒక తోకచుక్కగా నిర్ధారించినప్పటికీ భిన్న వాదనలు వ్యక్తమౌతున్నాయి. ఇంటర్ స్టెల్లార్ కామెట్ అనే వాదనను హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ లోబ్ కొట్టిపారేస్తోన్నారు. దీన్ని గ్రహాంతరవాసులు పంపి ఉండొచ్చనే వాదనకు తెర తీశారు.
ఈ ఆబ్జెక్ట్ కక్ష్య, పరిమాణం, కదలికలు వంటి అంశాలు సహజంగా ఏర్పడినది కాదని ప్రొఫెసర్ లోబ్ తేల్చి చెబుతున్నారు. మనకంటే ఎంతో అభివృద్ధి చెందిన గ్రహాంతర నౌక లేదా ఓ ప్రోబ్ అయి ఉండవచ్చని పేర్కొన్నారు. సాధారణ తోకచుక్కలతో పోల్చుకుంటే ఈ ఇంటర్ స్టెల్లార్ చాలా భిన్నంగా ఉండటం లోబ్ వాదనలకు బలాన్ని చేకూరుస్తోంది. దీని కక్ష్య పరిధి.. ఇతర తోకచుక్కలతో పోల్చుకుంటే అధికంగా ఉంటోంది.
దాదాపు 20 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉండటం.. ఓ సాధారణ గ్రహశకలం కంటే పరిణామంలో చాలా పెద్దది. ఈ తోక చుక్క మార్గం గ్రహాల కక్ష్యలతో దాదాపుగా సరిపోలుతుంది. ఇది యాదృచ్చికంగా జరగడం చాలా అరుదు. ఇది సూర్యుని వైపు స్పేస్ మెటీరియల్ ను ఇంజెక్ట్ చేస్తోంది. ఓ సాధారణ తోకచుక్కలతో పోల్చుకుంటే ఇది పూర్తి విరుద్ధం. ఈ తోకచుక్క అతి భారీ పరిమాణంలో ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఓముయామువా, బోరిసోవ్ కంటే చాలా భారీగా కనిపిస్తోంది. అంతే వేగంతో పరిభ్రమిస్తోంది. ఇది మార్స్, వీనస్, జూపిటర్ గ్రహాలకు అతి దగ్గరగా.. ఎవరో ట్యూన్ చేసినట్లుగా ప్రయాణించింది. ఈ తోకచుక్క ప్రయాణిస్తోన్నప్పుడు వెలువడే వాయు మేఘాల్లో నికెల్ ఎక్కువగా ఉండటాన్ని సైంటిస్టులు గుర్తించారు. ఇది సాధారణ తోకచుక్కల్లో అస్సలు కనిపించదు. ఇందులో నాలుగు శాతం మాత్రమే నీటిని గుర్తించారు. ఇతర తోకచుక్కలు ప్రధానంగా నీటితో కూడి ఉంటాయి. 1977లో కనుగొన్న రేడియో సిగ్నల్స్ ను పోలిన సంకేతాలు ఇందులో నుంచి వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications