రూ.430 కోట్లు విలువైన స్మార్ట్ ఫోన్.. ఏదో తెలుసా !!

ప్రపంచంలో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం అయితే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ వంటి స్మార్ట్‌ఫోన్‌లపై క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. లక్షల మంది వినియోగదారులు ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లను పొందేందుకు పోటీపడుతుంటారు. కానీ ఈ అన్నింటికంటే ఖరీదైన ఒక ఫోన్ ఉందని మీకు తెలుసా? దాని ధరతో ఒక్కటి కాదు, ఏకంగా మూడు ప్రైవేట్ జెట్‌లు కొనుగోలు చేయవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. దాని గురించి మీకోసం ప్రత్యేకంగా.....

ఫాల్కన్ సూపర్‌నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ ఎడిషన్..

అంతర్జాతీయ నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్‌గా 'ఫాల్కన్ సూపర్‌నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ ఎడిషన్' గుర్తింపు పొందింది. ఈ ఫోన్ ధర అక్షరాలా నోరెళ్లబెట్టేలా ఉంది - 48.5 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.430 కోట్లు). ఇది సాధారణంగా ఒక స్మార్ట్‌ఫోన్ కాదు.. అద్భుతమైన కళాఖండం అని అభివర్ణిస్తున్నారు.

430-crores-smart-phone-falcon-supernova-iphone-6-pink-diamond-edition

ఈ ఫోన్‌ను తయారు చేసేందుకు 24 క్యారెట్ల బంగారం.. అరుదైన పింక్ డైమండ్స్ వాడారు. ఒక్కో వజ్రాన్ని, ఒక్కో బంగారు పొరను ప్రత్యేక నైపుణ్యంతో చేతిపనిగా అమర్చారు. దీనిని తయారు చేయడానికి డిజైనర్ల బృందం పది వారాల సమయం కష్టపడ్డారని చెబుతున్నారు.

ప్రైవేట్ జెట్‌ల కంటే ఎక్కువ ఖరీదు

ఒక సాధారణ ప్రైవేట్ జెట్ ధర సుమారు ₹100 నుండి ₹140 కోట్ల వరకు ఉంటుంది. అంటే, ఈ ఒక్క ఫోన్ ధరతో కనీసం మూడు ప్రైవేట్ జెట్‌లను కొనుగోలు చేయవచ్చు. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన గ్యాడ్జెట్‌గా పరిగణిస్తున్నారు.

అయితే ఈ ఫోన్‌లోని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మాత్రం సాధారణ ఐఫోన్ 6లాగే ఉన్నాయి. 4.7 అంగుళాల రెటినా HD డిస్‌ప్లే, ఆపిల్ A8 చిప్‌సెట్, 128GB స్టోరేజ్, 8MP రియర్ కెమెరా, 1.2MP ఫ్రంట్ కెమెరా వంటి స్పెక్స్ ఉన్నాయి. అంటే హార్డ్‌వేర్ పరంగా ఇది ప్రత్యేకం ఏమీ కాదు. కానీ, బంగారం, పింక్ డైమండ్స్ వల్లే ఈ ఫోన్ ధర ఆకాశాన్ని తాకిందని తెలుస్తోంది.

ఫాల్కన్ కంపెనీ ప్రత్యేక ఆర్డర్‌పై ఈ ఫోన్‌ను తయారు చేసింది. లిమిటెడ్ ఎడిషన్‌గా ఉండటంతో, ఇది కేవలం కొంతమంది అత్యంత ధనవంతులకే అందుబాటులో ఉంది. రిపోర్టుల ప్రకారం, కొన్ని అంతర్జాతీయ వ్యాపారవేత్తలు, రాయల్ ఫ్యామిలీ సభ్యులు తమ వద్ద ఈ ఫోన్ కలిగి ఉన్నారని చెబుతున్నారు. ఖరీదైన ఫోన్ల లిస్టులో గోల్డ్ విర్చు, బ్లాక్ డైమండ్ వర్షన్‌లు, గోల్డ్‌విష్ లక్స్‌రీ ఫోన్లు ఉన్నప్పటికీ, వాటిని దాటేసి ఫాల్కన్ సూపర్‌నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ ఎడిషన్నే టాప్‌లో నిలిచింది. ఇది ఒక టెక్నాలజీ గాడ్జెట్‌ కంటే ఎక్కువగా స్టేటస్ సింబల్గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+