బైక్ లవర్స్‌కు అలర్ట్: ఆ తప్పులను ఇప్పుడే ఆపేయండి!
బైక్ పెయింట్ ఎక్కువ కాలం కొత్తదానిలా మెరుస్తూ ఉండేలా ఉంచుకోవలం బైక్ లవర్స్‌కు పెద్ద సవాలే. షోరూం నుంచి వచ్చినప్పుడు మెరిసే బైక్ కొద్ది కాలంలోనే రంగు తగ్గిపోవడం మొదలవుతుంది. దీనికి ఎండ, ధూళి, వర్షం వంటి బయటి కారణాలతో పాటు మనం రోజూ చేసే కొన్ని సాధారణ తప్పులు తెలియకుండానే బైక్ పెయింట్ ను దెబ్బతీసి దాని మెరుపును వేగంగా పొగొడతాయి. మీ బైక్ రంగు ఎక్కువ కాలం నిలిచి ఉండాలంటే, ఈ రోజు నుంచే మీరు మానుకోవాల్సిన 4 ముఖ్యమైన అలవాట్లు, వాటిని సరిచేయడానికి సరైన పద్ధతులను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మీ బైక్ రంగు ఎక్కువ కాలం కొత్తదానిలా ఉండాలంటే, ఈ రోజు నుంచే ఈ పనులు చేయడం ఆపేయండి.
1. తప్పుడు సబ్బులతో కడగడం
చాలా మంది బైక్‌ను ఇంట్లో వాడే డిటర్జెంట్ లేదా గిన్నెలు కడిగే లిక్విడ్‌తో కడుగుతుంటారు. ఈ డిటర్జెంట్లలో ఉండే రసాయనాలు (కెమికల్స్) పెయింట్‌కు రక్షణగా ఉండే ఎగువ పొరను తొలగిస్తాయి. ఈ రక్షణ పొర తొలగిపోతే పెయింట్ తన మెరుపును కోల్పోయి, ఎండ వల్ల త్వరగా పాడైపోతుంది.

సరైన పద్ధతి: మీ బైక్‌ను కడగడానికి కారు లేదా మోటార్‌సైకిల్ వాష్ షాంపూ మాత్రమే ఉపయోగించాలి. అది అందుబాటులో లేకపోతే కనీసం తలస్నానానికి వాడే షాంపూ లేదా బట్టలు ఉతికే డిటర్జెంట్‌ను అయినా ఉపయోగించవచ్చు.
2. గట్టి లేదా పొడి గుడ్డతో తుడవడం
ధూళి పేరుకుపోయిన బైక్‌ను గట్టిగా మురికిగా ఉన్న గుడ్డతో రుద్దడం అతిపెద్ద తప్పు. ధూళిలోని చిన్న రేణువులు ఇసుకలా పనిచేసి రుద్దినప్పుడు పెయింట్‌పై చిన్న గీతలనుఏర్పరుస్తాయి. కాలక్రమేణా ఈ గీతలు పెయింట్ మెరుపును పూర్తిగా తగ్గిస్తాయి.
సరైన పద్ధతి: బైక్‌ను శుభ్రం చేయడానికి ఎల్లప్పుడూ శుభ్రమైన నీటిని ఉపయోగించాలి. తుడవడానికి మైక్రోఫైబర్ లేదా మృదువైన పత్తి గుడ్డను మాత్రమే ఉపయోగించాలి.
3. ట్యాంక్‌పై మురికి గుడ్డలు, కవర్లు ఉంచడం
చాలా మంది బైక్ ట్యాంక్‌పై ఏదైనా గుడ్డ, రుమాలు లేదా కవర్ ఉంచుతారు. ఈ గుడ్డ మురికిగా లేదా ధూళితో ఉన్నట్లయితే, బైక్ వైబ్రేషన్స్ లేదా గాలి కారణంగా అది పెయింట్‌పై నిరంతరం రాపిడికి గురవుతుంది. దీని వల్ల ట్యాంక్‌పై గుండ్రటి గుర్తులు లేదా గీతలు ఏర్పడతాయి. అలాగే మురికిగా ఉన్న కవర్‌ను బైక్‌పై వేయడం వల్ల కూడా పెయింట్‌కు నష్టం జరగవచ్చు.
4. ఎక్కువసేపు ఎండలో పార్క్ చేయడం
మీ బైక్‌ను ఎక్కువ కాలం పాటు తీవ్రమైన ఎండలో పార్క్ చేయడం వల్ల దాని రంగుపై చాలా చెడు ప్రభావం పడుతుంది. సూర్యరశ్మి కారణంగా బైక్ పెయింట్ రంగు త్వరగా వెలిసిపోతుంది.
సరైన పద్ధతి: వీలైనంత వరకు మీ మోటార్‌సైకిల్‌ను నీడలో లేదా బైక్ కవర్ వేసి పార్క్ చేయాలి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే, మీరు మీ మోటార్‌సైకిల్ పెయింట్‌ను ఎక్కువ కాలం పాటు కొత్తదానిలా, మెరిసేలా ఉంచుకోవచ్చు.












Click it and Unblock the Notifications