Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెజాన్ అదిరిపోయే డీల్.. 55 అంగుళాల 4k స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ !!!

మారుతున్న కాలానుగుణంగా ప్రజల అభిరుచి కూడా మారుతూ వస్తోంది. ఈ క్రమంలోనే టీవీల నుంచి స్మార్ట్ టీవీలకు షిఫ్ట్ అయిపోతున్నారు. కాగా బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీ కొనాలని చూసేవారికి అమెజాన్ అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. 55 అంగుళాల షియోమీ FX Pro QLED 4K స్మార్ట్ ఫైర్ టీవీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గతంలో దీని ధర రూ.62,999 ఉండగా.. ఇప్పుడు దాదాపు 48 శాతం తగ్గింపుతో రూ.32,999కే లభిస్తోంది. దీంతో ఈ వ్యవహారం టెక్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కాగా మీడియం బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తూ Xiaomi FX Pro 55 అంగుళాల టీవీ మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గత నెలలోనే వెయ్యికి పైగా యూనిట్లు విక్రయమవ్వడం ఈ మోడల్‌కు ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ డిస్కౌంట్ అందించడం మంచి ఛాన్స్ అని అంటున్నారు. క్రెడిట్ కార్డు ద్వారా EMI ఆప్షన్‌ను ఎంచుకుంటే సుమారు రూ.1,486 వరకు వడ్డీ ఆదా లభించే అవకాశం కూడా ఉండడం మరో కలిసొచ్చే అంశం.

amazon-huge-offer-on-55-inch-xiaomi-fx-pro-qled-4k-smart-fire-tv

షియోమీ FX Pro QLED 4K స్మార్ట్ ఫైర్ టీవీ ఫీచర్స్..

  • Xiaomi FX Pro టీవీలో 55 అంగుళాల QLED డిస్‌ప్లే ఉంది. Ultra HD 4K (3840×2160 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో పాటు HDR10+ సపోర్ట్ ఉండటం వల్ల రంగులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.
  • 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ కారణంగా ఏ దిశ నుంచి చూసినా విజువల్స్ నాణ్యత తగ్గదు. సన్నని బెజెల్‌లతో రూపొందించిన బెజెల్-లెస్ డిజైన్ ఈ టీవీకి ప్రీమియం లుక్‌ను అందిస్తోంది.
  • ఈ స్మార్ట్ టీవీ Fire OS 8 పై పనిచేస్తుంది. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి ప్రముఖ OTT ప్లాట్‌ఫార్మ్‌లకు ప్రత్యేక వన్-క్లిక్ బటన్లు అందుబాటులో ఉన్నాయి.
  • అలెక్సా వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌తో వాయిస్ కమాండ్స్ ద్వారా ఛానెల్స్ మార్చడం, కంటెంట్ సెర్చ్ చేయడం చాలా సులభం.
  • బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్ ఫీచర్‌తో మొబైల్ లేదా ల్యాప్‌టాప్ నుంచి కంటెంట్‌ను టీవీకి నేరుగా స్ట్రీమ్ చేయవచ్చు.
  • 34 వాట్ల డ్యూయల్ స్పీకర్లు, డాల్బీ ఆడియో సపోర్ట్‌తో ఇంట్లోనే థియేటర్ అనుభూతిని అందిస్తుంది.
  • డాల్బీ, DTS, MP3, FLAC వంటి విభిన్న ఆడియో ఫార్మాట్‌లకు మద్దతు ఉండటం వల్ల ఆడియో క్లారిటీ మరింత మెరుగ్గా ఉంటుంది.
  • కనెక్టివిటీ విషయానికి వస్తే HDMI పోర్టులు, రెండు USB పోర్టులు, Wi-Fi, ఈథర్‌నెట్, బ్లూటూత్, 3.5mm ఆడియో జాక్ వంటి అన్ని అవసరమైన ఆప్షన్లు ఉన్నాయి.
  • 60Hz రిఫ్రెష్ రేట్, ఐ కంఫర్ట్ మోడ్, బ్లూటూత్ రిమోట్ వంటి అదనపు ఫీచర్లు రోజువారీ వినియోగాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.

ప్రీమియం QLED డిస్‌ప్లే, ఫైర్ టీవీ ఆధారిత స్మార్ట్ ఫీచర్లు, శక్తివంతమైన ఆడియో క్వాలిటీ.. ఇవన్నీ కలిపి రూ.32,999 ధరలో లభించడం Xiaomi FX Pro 55 అంగుళాల టీవీని నిజమైన 'వాల్యూ ఫర్ మనీ' ఎంపికగా నిలబెడుతోంది. కొత్తగా 4K స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా 'బిగ్ డీల్' అని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+