కారు పార్కింగ్‌‌లో ఈ తప్పు చేస్తున్నారా?

Car Parking Tips: కారు కొనడం తేలికే.. కానీ దానిని సరిగ్గా చూసుకోవడం చాలా కష్టం. కారు ఉంటే ఆ విషయం చాలా బాగా తెలుస్తుంది. కారులో పెట్రోల్ ఉందా, టైర్లలో గాలి ఉందా, ఏమైనా డెంట్లు పడ్డాయా.. లేదా ఏ పార్ట్ అయినా పాడైందా, ఇవన్నీ చూడటంతో పాటు మీ కారును సరైన చోట పార్క్ చేశారా లేదా అని కూడా చూసుకోవాలి. చాలా మంది తమ కార్లను ఎక్కువ కాలం బయటే వదిలేస్తారు. దీని వల్ల కారుకు చాలా నష్టం జరుగుతుంది. ఈ నష్టాలను చాలా మంది పట్టించుకోరు, కానీ దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. కారును ఎక్కువకాలం బయట ఉంచడం వల్ల కలిగే నష్టాలు, వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం.

కారు రంగు, మెరుపు పాడవుతుంది..
నిపుణుల ప్రకారం.. మీ కారు ఎక్కువ కాలం ఎండలో ఉంటే.. కారు రంగుకు అత్యధిక నష్టం జరుగుతుంది. సూర్యరశ్మి కారు రంగుకు ప్రధాన శత్రువు అని తెలిసిందే. నిరంతరం ఎండలో ఉంచడం వల్ల కారు పెయింట్ రంగు తగ్గి, దాని మెరుపు పోతుంది. కాలక్రమేణా, పెయింట్ పగుళ్లు కూడా రావచ్చు.

Are You Making This Mistake While Parking Your Car

కారు టైర్లు, బ్యాటరీపై దుష్ప్రభావం
ఎక్కువ కాలం ఒకే చోట నిలిపి ఉంచడం వల్ల టైర్లలో గాలి తగ్గుతుంది. వాటికి పగుళ్లు ఏర్పడవచ్చు. ఎండ వేడి వల్ల టైర్ల రబ్బర్ కూడా గట్టిపడి, రోడ్డుపై పట్టు కోల్పోతుంది. దీనితో పాటు కారు ఎక్కువ కాలం నడపకపోతే, దాని బ్యాటరీ నెమ్మదిగా డిశ్చార్జ్ అయి, పాడైపోయే అవకాశం ఉంది.

ఇంటీరియర్, ఇంజిన్‌కు భారీ నష్టం
కారు ఎక్కువ కాలం వర్షాల్లో, ఎండల్లో పార్కింగ్ చేస్తే లోపలి భాగం ఎక్కువగా ప్రభావికమవుతుంది. ఎండ వేడి వల్ల డ్యాష్ బోర్డ్, సీట్లు, స్టీరింగ్ వీల్ పాడైపోతాయి. డ్యాష్ బోర్డుపై పగుళ్లు రావచ్చు. సీట్ల రంగు తేలిపోవచ్చు. కారు లోపల ఒక రకమైన దుర్వాసన కూడా రావచ్చు. కారు ఎక్కువ కాలం ఆగి ఉంటే, దాని ఇంజిన్, ఇతర మెకానికల్ భాగాలకు తుప్పు పట్టే అవకాశం పెరుగుతుంది. ఇంజిన్ ఆయిల్ గడ్డ కట్టవచ్చు. దీనివల్ల కారును తిరిగి స్టార్ట్ చేయడం కష్టమవుతుంది.

ఈ నష్టాలను ఎలా నివారించాలంటే?
కారుపై ఎప్పుడూ కవర్ వాడండి: మీకు గ్యారేజ్ లేకపోతే ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల కవర్‌ను ఉపయోగించండి. ఇది కారును ఎండ, దుమ్ము, వర్షం, పక్షుల రెట్టల నుంచి రక్షిస్తుంది.

నీడలో పార్క్ చేయండి: వీలైనంతవరకు మీ కారును చెట్టు కింద లేదా ఏదైనా నీడలో పార్క్ చేయండి.

సమయానుగుణంగా నడపండి: మీరు కారును ఎక్కువగా ఉపయోగించకపోయినా.. నెలలో కనీసం ఒకసారైనా దాన్ని నడపండి. దీనివల్ల బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఇంజిన్ భాగాలు సక్రమంగా పనిచేస్తాయి.

టైర్లను చూసుకోండి: కారు పార్క్ చేసి ఉన్నప్పుడు సమయానుగుణంగా టైర్ల గాలిని తనిఖీ చేస్తూ ఉండండి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ కారును ఎక్కువ కాలం సురక్షితంగా, మంచి స్థితిలో ఉంచుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+