రెండు గ్రహాల చుట్టూ కొత్త చందమామలు- గజిబిజీ

ఈ అనంత విశ్వంలో మరో రెండు కొత్త చందమామలు వెలుగులోకి వచ్చాయి. బుధ, శుక్ర గ్రహాలకు తప్ప మిగిలిన అన్ని గ్రహాలకూ ఒకటికి మించిన చందమామలు ఉన్నాయి. తమ గ్రహాల చుట్టూ అవి పరిభ్రమిస్తోన్నాయి. మనకు ఉన్నది ఒకటే చందమామ. అత్యధికంగా 274 ఉపగ్రహాలతో శని.. మన సౌర వ్యవస్థలో అగ్రస్థానంలో ఉంది. 95 చంద్రులతో బృహస్పతి (జుపిటర్) రెండో స్థానంలో నిలిచింది. బృహస్పతికి చెందిన గనిమెడె (Ganymede) అతిపెద్ద చంద్రుడు. ఇది బుధగ్రహం కంటే పెద్దది.

దట్టమైన వాతావరణం కలిగిన ఏకైక చంద్రుడు టైటాన్. శని ఉపగ్రహం. సౌర కుటుంబంలో బుధుడు, శుక్ర గ్రహాలకు మాత్రం ఎటువంటి చంద్రులు లేవు. ఇప్పుడు తాజాగా బృహస్పతి, శని గ్రహాల చుట్టూ అనేక కొత్త చందమామలను శాస్త్రవేత్తలు గుర్తించారు. బృహస్పతి, శని గ్రహాల చుట్టూ కొత్తగా 15 చందమామలను కనుగొన్నారు. ఇందులో నాలుగు జుపిటర్ కు చెందినవి. మిగిలిన 11.. శనిగ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అలాగే సౌర వ్యవస్థలోని గ్రహాలు, మరగుజ్జు గ్రహాల చుట్టూ మనకు తెలిసిన చందమామల సంఖ్యను 442కి పెంచాయి.

Astronomers Uncover New Moons Discovered Around Jupiter and Saturn Boost Counts to 101 and 285

చిన్న గ్రహశకలాలు లేదా కైపర్ బెల్ట్ వస్తువుల చంద్రులను ఇందులో చేర్చలేదు. కొత్త ఉపగ్రహాలు సుమారు 3 కిలోమీటర్ల వ్యాసంతో ఉన్నవి. ఇవి బృహస్పతి, శనిల పెద్ద చంద్రుల కంటే విశాలమైన, అత్యంత మందమైన కాంతిలో (మాగ్నిట్యూడ్ 25-27) ఉన్న కక్ష్యల్లో సంచరిస్తున్నాయి. మన చంద్రుని కాంతి తీవ్రత -12.6 మాగ్నిట్యూడ్. ఈ కాంతి తీవ్రత కారణంగా ఇవి సాధారణ టెలిస్కోపులకు అందవు. అతి భారీ భూఆధారిత టెలిస్కోప్ ద్వారా వీటిని గుర్తించారు.

బృహస్పతి నాలుగు ఉపగ్రహాలను కార్నెగీ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ స్కాట్ షెప్పర్డ్, హవాయ్ యూనివర్శిటీకి చెందిన డేవిడ్ థోలెన్ కనుగొన్నారు. వీటిని గుర్తించడానికి చిలీలోని 6.5 మీటర్ల మెగెల్లన్-బాడే, హవాయిలోని మౌనా కీ పర్వతంపై ఎనిమిది మీటర్ల సుబారు టెలిస్కోపులను ఉపయోగించారు.

శని గ్రహానికి చెందిన 11 ఉపగ్రహాలను తైవాన్‌లోని అకాడెమియా సినికా ఇన్‌స్టిట్యూట్ ఎడ్వర్డ్ ఆష్టన్ నేతృత్వంలోని సైంటిస్టుల టీమ్ గుర్తించింది. మౌనా కీ పర్వతంపై 3.5 మీటర్ల కెనడా ఫ్రాన్స్ హవాయి టెలిస్కోప్‌ను ఈ టీమ్ వినియోగించింది. సౌర వ్యవస్థలో 200కు పైగా ఉపగ్రహాలను కనుగొన్న చరిత్ర షెప్పర్డ్, ఆష్టన్ కు ఉంది. 2030 ఆరంభంలో బృహస్పతి వ్యవస్థకు చేరుకోనున్న యూరోపా క్లిప్పర్, జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్ మిషన్లు ఈ సమతౌల్యాన్ని మార్చవచ్చు.

ప్రస్తుతం గ్రహాలవారీగా చందమామల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. భూమి- 1, అంగారకుడు- 2, బృహస్పతి- 101, శని- 285, యురేనస్- 28, నెప్ట్యూన్- 16. శుక్రుడు, బుధుడికి ఎటువంటి ఉపగ్రహాలు లేవు. డ్వార్ఫ్ గ్రహాలుగా గుర్తింపు పొందిన ప్లూటోకు అయిదు చందమామలు ఉన్నాయి. ఈరిస్, మాకెమాకెకు ఒక్కొక్కటి చొప్పున, హౌమియాకు రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. సెరెస్ డ్వార్ఫ్ ప్లానెట్ కూ చఉపగ్రహాలు లేవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+