ఒకే వరుసలో.. షష్ఠ గ్రహాలు: కేర్ ఫుల్

Planetary Parade: ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కాబోతోందీ నెలలో. ఆరు గ్రహాల కూటమి కనువిందు చేయబోతోంది. అవన్నీ కూడా సమాంతర రేఖపై కనిపించనున్నాయి. ఇలాంటి అవకాశం రావడం అత్యంత అరుదు. ఈ ఏడాదికి ఇదే చివరిది కూడా. మళ్లీ 18 సంవత్సరాల తరువాత అంటే 2043లోనే ఇలాంటి గ్రహ కూటమి ఏర్పడుతుంది.

ఈ ఏడాది ఇప్పటికే ఒకట్రెండు సందర్భాల్లో గ్రహాల పరేడ్.. ఆంబరాన సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో శుక్రుడు (వీనస్), కుజుడు (మార్స్), గురు (జుపిటర్), శని, యురేనస్, నెప్ట్యూన్. ఆ తరువాత బుధ గ్రహం (మెర్క్యురి) కూడా వీటితో జతకట్టింది. బుధగ్రహం ఒకే వరసలోకి రావడం అప్పట్లో అదే తొలిసారి.

Attention to Stargazers 6-planet parade in from August 17

ఇప్పుడు తాజాగా ఈ నెలలో ఆరు గ్రహాలు పరేడ్ చేయనున్నాయి. వీటిలో నాలుగింటిని మనం నేరుగా చూడొచ్చు. ఈ నెల 17 ఆదివారం నుంచి దాదాపు ఒక వారం పాటు బుధుడు, శుక్రుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఆకాశంలో ఒకేసారి కనిపిస్తాయి. చీకటి కమ్మిన అంబరంలో తళుక్కుమని మెరుస్తూ దర్శనం ఇస్తాయి.

ఈ ఖగోళ దృశ్యాన్ని చూడాలంటే ఓ రెండు గంటలు ముందే నిద్ర మేల్కొవాల్సి ఉంటుంది. సూర్యోదయానికి సుమారు ఒక గంట ముందు తూర్పు వైపున ఆకాశంలో ఇవి కనిపిస్తాయి. వీటిని చూడటానికి 20వ తేదీ బెస్ట్ అక్యురేట్ టైమ్ గా చెబుతున్నారు స్టార్ గేజర్స్. 17వ తేదీన ఆరంభమైనప్పటికీ.. 20వ తేదీ నాటికి అవన్నీ కూడా సమాంతరంగా కనిపిస్తాయని అంచనా వేస్తోన్నారు.

ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు శుక్రుడు, బృహస్పతి, శని గ్రహాలను నేరుగా చూడొచ్చు. బుధుడు భూమికి పొరుగునే, అత్యంత ప్రకాశవంతమైన గ్రహం కావడం వల్ల స్పష్టంగా కనిపిస్తాడు. జుపిటర్, శని గ్రహాల మధ్య యురేనస్ కనిపిస్తుంది. శనికి దగ్గరగా చాలా మసకగా నెప్ట్యూన్ దర్శనం ఇస్తుంది.

భూమికి సుదూరంగా ఉండటం వల్ల యురేనస్, నెప్ట్యూన్ లను నేరుగా కంటితో చూడలేము. ఈ రెండు గ్యాస్ జెయింట్స్ ను చూడాలంటే ఓ మంచి టెలిస్కోప్ అవసరమౌతుంది. ఈ ఆరు గ్రహాలకు తోడు చంద్రవంక కూడా తోడు కావడం వల్ల ఈ ఖగోళ దృశ్యం మరింత అద్భుతంగా, చాలా అందంగా కనిపిస్తుంది.

ప్లానెటరీ పరేడ్ సంభవించే 17, 18 తేదీల్లో చంద్రవంక.. జుపిటర్, శుక్రుడుపైన ఉదయిస్తుంది. 20వ తేదీ తెల్లవారు జామున సన్నని పెన్సిల్ గీతలాగా చందమామ.. బృహస్పతి, శుక్రుడు చాలా దగ్గరగా ఉంటాడు. ఇది ఈ ప్లానెట్ పరేడ్ ను మరింత అందంగా మార్చుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+