రూ.25000 లోపు బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ ఇవే..!
నేటి ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఒక వ్యసనం లాగా మారిపోయింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరలోనే ఫోన్లను అందించేందుకు కంపెనీలు సైతం పోటీ పడుతున్నాయి. అయితే వాటిని కేవలం కాలింగ్ కి మాత్రమే కాకుండా ఫోటోగ్రఫీకి కూడా బాగా వినియోగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, రీల్స్ యుగంలో ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఫోటోలు, వీడియోలు తీయాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే రూ.25,000 లోపు బడ్జెట్ లోపు లభిస్తున్న బెస్ట్ కెమెరా ఉన్న ఫోన్స్ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్స్..
రెడ్‌మీ నోట్ 14 ప్రో..
రెడ్‌మీ నోట్ 14 ప్రో ఈ విభాగంలో ముందంజలో ఉంది. ఇందులో 50MP సోనీ IMX సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ఏ లైట్ కండిషన్‌లోనైనా ఇది తేటగా, స్పష్టంగా ఫోటోలు అందిస్తుంది. దీనిలోని AI Image Enhancement ఫీచర్ రంగుల డైనమిక్స్‌ను బలోపేతం చేస్తుంది. సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరా సూపర్ క్లారిటీని అందిస్తుంది. వీడియోల విషయంలో ఇది 4K రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే EIS స్టెబిలైజేషన్‌తో కదలికల ఫుటేజ్ కూడా క్లియర్‌గా కనిపిస్తుంది.

పోకో ఎక్స్7 ప్రో..
పోకో ఎక్స్7 ప్రో 50MP + 8MP డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లోని IMX882 ప్రైమరీ సెన్సార్ తక్కువ కాంతిలో కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఫ్రంట్‌లో 16MP లెన్స్ ఉండటంతో సెల్ఫీలు, వ్లాగ్‌లు తీయడానికి ఇది ఉత్తమ ఎంపిక. 5000mAh బ్యాటరీ, 67W టర్బో చార్జింగ్‌తో ఈ ఫోన్ ఫోటోగ్రఫీతో పాటు లాంగ్ యూజ్‌కి కూడా సరిపోతుంది. 4K వీడియో రికార్డింగ్‌తో పాటు, పోర్ట్రైట్ మోడ్‌లో బోకే ఎఫెక్ట్స్ కూడా ఆకర్షణీయంగా ఉంటాయి.
నథింగ్ ఫోన్ 3a..
డిజైన్, కెమెరా రెండింటినీ ఇష్టపడే యూజర్లకు Nothing Phone 3a సరైన ఎంపిక. ఇది 50MP ప్రధాన కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ (2x ఆప్టికల్ జూమ్), 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్‌తో వస్తుంది. గ్లైఫ్ లైట్ ఎఫెక్ట్స్ ఫోటో షూట్ సమయంలో అదనపు లైట్‌ను అందిస్తాయి. ఫ్రంట్‌లో 32MP హై-రిజల్యూషన్ సెల్ఫీ కెమెరా ఉండటంతో వీడియో కాల్స్, రీల్స్ షూట్స్ సూపర్ క్వాలిటీగా ఉంటాయి. అంతేకాదు ఇందులో ఉన్న నేచురల్ స్కిన్ టోన్ ప్రాసెసింగ్ ఫీచర్ ఫోటోలను రియలిస్టిక్‌గా చూపిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం17..
శాంసంగ్ గెలాక్సీ ఎం17, 50MP OIS (Optical Image Stabilization) సెన్సార్‌తో వస్తుంది. తక్కువ కాంతి పరిస్థితుల్లోనూ స్పష్టమైన ఫోటోలు తీయగలిగే నైట్ మోడ్ ఈ ఫోన్ ప్రత్యేకత. వీడియో రికార్డింగ్ లోనూ EIS మరియు OIS రెండింటి కలయికతో స్మూత్ అవుట్‌పుట్ లభిస్తుంది. శాంసంగ్ యొక్క AI Scene Optimizer ఫీచర్ ఆటోమేటిక్‌గా లైట్, కాంట్రాస్ట్, స్యాచురేషన్‌ను సర్దుబాటు చేస్తుంది.
రియల్‌మీ 13 ప్రో ప్లస్..
ఈ ఫోన్‌లో 50MP సామ్‌సంగ్ HP3 సెన్సార్, 8MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. 50MP మోడ్‌లో తీసిన ఫోటోలు ప్రింట్ సైజ్‌లో కూడా నాణ్యత కోల్పోకుండా ఉంటాయి. ఫ్రంట్ కెమెరా 32MP ఉండటంతో ఇది సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు బాగా సరిపోతుంది. స్మార్ట్ AI కలర్ ట్యూనింగ్ ఫీచర్ రంగులను సహజంగా ఉంచి లైఫ్‌లైక్ ఫోటోలను ఇస్తుంది.
ఐకూ Z10 5G..
iQOO Z10 5G స్మార్ట్‌ఫోన్ 64MP OIS ప్రైమరీ కెమెరాతో వస్తుంది. దీనిలోని Vivo V-Series Image Processor ఫోటోలు, వీడియోలను మరింత బాగా చూపిస్తుంది. 16MP ఫ్రంట్ కెమెరా AI ఫిల్టర్లు, బ్యూటీ మోడ్‌లతో యువతను ఆకట్టుకుంటోంది. 5000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ దీన్ని లాంగ్ షూట్స్‌కి అనుకూలంగా చేస్తుంది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications