Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

200mp కెమెరాతో ఉన్న బెస్ట్ ఫోన్స్ ఇవే..!

ప్రపంచంలో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతోంది. చిన్నా-పెద్దా అనే తేడా లేకుండా అందరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరల్లోనే మంచి ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేస్తున్నాయని పలు కంపెనీలు. ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కెమెరా నాణ్యతనే అత్యంత కీలక అంశంగా పరిగణిస్తున్నారు. సెల్ఫీలు, ట్రావెల్ ఫోటోలు, షార్ట్ వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్-ఇవన్నీ నిరంతర జీవితంలో భాగం కావడంతో.. మెగాపిక్సెల్ పరంగా శక్తివంతమైన కెమెరాలున్న ఫోన్‌లకు విపరీతమైన ఆదరణ పెరిగింది.

ఇప్పటికే 50MP కెమెరాతో ఫోన్‌లు రూ.10,000-50,000 రేంజ్‌లో విస్తారంగా లభ్యమవుతున్నా, అత్యుత్తమ ఫోటోగ్రఫీ కోరుకునే వారు 200MP కెమెరా ఫోన్‌ల వైపు ఆకర్షితులవుతున్నారు. 200MP కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం మార్కెట్లో పరిమితంగా ఉన్నప్పటికీ.. బ్రాండ్లు ఈ విభాగంపై స్పెషల్‌ ఫోకస్ పెట్టడం ప్రారంభించాయి. భారీ ఫోటో రిజల్యూషన్, మెరుగైన డిజిటల్ జూమ్‌, నైట్ మోడ్ సామర్థ్యం, మరింత వివరాలను సేకరించే వీలు వంటి కారణాలతో 200MP కెమెరా ఫోన్‌లు హై-ఎండ్ యూజర్లకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

best-mobiles-with-200-mp-camera-under-30000-rupees

Oppo Find X9 Pro..

తాజాగా భారత మార్కెట్లోకి వచ్చిన Oppo Find X9 Pro 200MP టెలిఫోటో కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్.. ప్రత్యేకంగా జూమ్ ఫోటోగ్రఫీకి అద్భుత ఫలితాలు ఇస్తుంది. దీని ధర ₹1,09,999 నుండి ప్రారంభమవుతూ, ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో అత్యుత్తమ స్పెసిఫికేషన్లతో వస్తుంది.

Vivo X300 సిరీస్..

వివో త్వరలో విడుదల చేయనున్న Vivo X300, X300 Pro మోడళ్లలో కూడా 200MP కెమెరాలు ఉంటాయని ఇప్పటికే కంపెనీ ధృవీకరించింది.

X300 Pro లో 200MP టెలిఫోటో లెన్స్

X300 స్టాండర్డ్ మోడల్‌లో 200MP ప్రధాన కెమెరా

ఈ రెండు మోడళ్లూ AI ఫోటోగ్రఫీ, నైట్ విజన్, స్పోర్ట్స్ మోడ్‌లలో కొత్త మెరుగుదలలను తీసుకురాబోతున్నాయి.

Samsung Galaxy S26 Ultra..

సామ్‌సంగ్ అభిమానుల కోసం వచ్చే ఏడాది ప్రత్యేకంగా రానున్న Samsung Galaxy S26 Ultra కూడా 200MP కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న Galaxy S25 Ultra ఇప్పటికే 200MP కెమెరాతో అత్యంత పాపులర్ ఫోన్‌గా నిలుస్తుండగా, దీని ధర ₹1,29,999. కొత్త సిరీస్‌లో మరింత మెరుగైన ప్రాసెసింగ్‌, రిచ్ డైనమిక్ రేంజ్‌, మెరుగైన స్టేబిలైజేషన్ వంటి ఫీచర్లను అందించనున్నట్లు సమాచారం.

Vivo V60e..

బడ్జెట్‌కు దగ్గరగా 200MP కెమెరా కావాలంటే Vivo V60e మంచి ఆప్షన్. ప్రారంభ ధర ₹31,999.

200MP + 8MP రియర్ కెమెరాలు

50MP సెల్ఫీ కెమెరా

పోర్ట్రెయిట్, సెల్ఫీ లవర్‌లకు బెస్ట్ ఛాయిస్

ఈ ధరకు 200MP కెమెరా అందించడం మార్కెట్లో వివోను ప్రత్యేకస్థానంలో నిలబెట్టింది.

Redmi Note 13 Pro 5G..

తక్కువ ధరలో 200MP కెమెరా ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులకు Redmi Note 13 Pro 5G అత్యంత సరసమైన ఎంపిక.

ధర: ₹23,999

ట్రిపుల్ రియర్ కెమెరాలు: 200MP + 8MP + 2MP

16MP ఫ్రంట్ కెమెరా

వైబ్రంట్ ఇమేజ్ అవుట్‌పుట్, మంచి నైట్ ఫోటోగ్రఫీ

రాబోయే నెలల్లో మరిన్ని 200MP ఫోన్‌లు..

మార్కెట్ డిమాండ్ పెరుగుతుండడంతో, ఇతర బ్రాండ్లు కూడా త్వరలో 200MP కెమెరా ఫోన్‌లను విడుదల చేయనున్నాయి. రియల్‌మీ, ఐకూ, మోటరోలా వంటి కంపెనీల కొత్త మోడళ్లు త్వరలో ప్రకటించబడే అవకాశముంది. అంతేకాదు, 200MP సెన్సార్‌లతో AI ఆధారిత ఫోటో ప్రాసెసింగ్ మరింత మెరుగుపడనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+