Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1499కే వన్ ఇయర్ ప్లాన్

భారతదేశ ప్రభుత్వ టెలికాం సంస్థ... బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. రూ. 1499 ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, 24GB డేటాను అందిస్తుంది. ఈ ఆఫర్‌ అంతకు ముందు 336 రోజులకు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆఫర్లో మరో 29 రోజుల చెల్లుబాటును ఉచితంగా అందిస్తోంది. ఈ వ్యాలిడిటీతో కలిపి మొత్తం 365 రోజులకు ప్లాన్ వర్తించనుంది.

BSNL అందిస్తున్న ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు కూడా ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే.. బీఎస్‌ఎన్‌ఎల్‌ వెబ్‌సైట్, బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ఫ్‌కేర్ యాప్ నుంచి లేదా మరేదైనా ఇతర యాప్ ల ద్వారా రీఛార్జ్ చేసుకొని ఈ ప్లాన్ ప్రయోజనాలను పొందవచ్చు. లోకల్, ఎస్టీడీ, రోమింగ్ అన్ని కాల్స్‌ 365 రోజులు వాడుకోవచ్చు. 24GB డేటా ఈ డేటా పూర్తయిన తర్వాత అదనంగా డేటా వోచర్లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

bsnl-special-offer-for-customers-one-year-plan-for-rs-1499-only

అంతే కాకుండా ఈ ప్లాన్ తో Lystn Podcast, Zing Music, BSNL Tunes సహా పలు సేవలను ఉచితంగా పొందవచ్చు. అయితే ఈ BSNL 1499 ప్లాన్ రోజూ ఎక్కువ డేటా అవసరమైన వినియోగదారులకు మాత్రం సరిపోదనే వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి.. కాలింగ్ ముఖ్యమైన వారికి, ఇంకా ఎక్కువ డేటా అవసరం లేని వారికి ఇది బెస్ట్ ప్లాన్ అని చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+