Chandrayan 3: ప్రపంచానికి భారత్ మరో గిఫ్ట్.. చంద్రయాన్ 3 కీలక ఆవిష్కరణ.. గతంలో నీటిజాడ, ఇప్పుడేమో..
Chandrayan Discovery: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ వాయు వేగంతో దూసుకుపోతోంది. సైకిల్, ఎడ్లబండిపై రాకెట్ భాగాలను మోసుకెళ్తుంటే చూసి నవ్విన సో కాల్డ్ అగ్ర రాజ్యాలకు సైతం సాధ్యంకాని ఎన్నింటినో సునాయాసంగా సాధించగలిగింది. ఓ బాలీవుడ్ సినిమా కంటే తక్కువ బడ్జెట్‌తోనే చంద్రయాన్, మంగళయాన్ వంటి ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసింది. కొంత కాలం పాటు మాత్రమే సేవలందిచే విధంగా రూపొందించిన ఉపగ్రహాలు ఏళ్ల తరబడి డేటాను భూమికి పంపుతూనే ఉన్నాయి. చంద్రుడిపై నీటిజాడను ప్రపంచానికి పరిచయం చేసిన భారత్.. తాజాగా మరో కొత్త విషయాన్ని ప్రకటించింది.
మూన్ మిషన్ చంద్రయాన్-3 అంతర్జాతీయ విపణిలో ఇండియాను సగర్వంగా నిలిపింది. కాగా దాని ల్యాండింగ్ సైట్‌కు సమీపంలో 160 కిలోమీటర్ల వెడల్పు గల బిలంను తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రజ్ఞాన్ రోవర్ నుంచి వచ్చిన డేటా ఆధారంగా ఈ విషయం కనుగొన్నట్లు అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీకి చెందిన రీసెర్చర్స్ సైన్స్ డైరెక్ట్ జర్నల్‌లో వివరించారు. చంద్రుని అతిపెద్ద మరియు పురాతన ఐట్‌కెన్ బేసిన్ నుంచి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని రోవర్ అన్వేషించినప్పుడు ఈ బిలం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.

చంద్రుని భౌగోళిక పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి బిలానికి సంబంధించిన ధూళి మరియు రాతి పొరలు ఎంతో ముఖ్యమైనవి. ఈ బిలం ఐట్‌కెన్ బేసిన్ ఏర్పడటానికి ముందే ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం పలు రకాల పదార్థాలు, మూలకాలతో నిండి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో చంద్రునిపై అన్వేషణ మిషన్లకు ఇదొక ఆసక్తి కారణంగా నిలవనుంది. శిథిలాల వల్ల బిలం అస్పష్టంగా ఉందని మరియు కాలక్రమేణా క్షీణించిందని నివేదిక హైలైట్ చేస్తోంది. చంద్రునిపై అత్యంత లోతులో కొన్ని పదార్థాలను కలిగి ఉన్న పురాతన ప్రాంతంలో చంద్రయాన్-3 రోవర్ దిగినట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి.
రోవర్ ఆప్టికల్ కెమెరాల ద్వారా అధిక-రిజల్యూషన్ చిత్రాలు ఈ పురాతన బిలం చిత్రాలతో పాటు ముఖ్యమైన వివరాలను ఆవిష్కరించాయి. చంద్రుని ప్రారంభ భౌగోళిక నిర్మాణాలలో ఒకదానిని అధ్యయనం చేసే అరుదైన అవకాశాన్ని అందించాయి. ఐట్‌కెన్ బేసిన్ మాత్రమే ఇప్పటివరకు దాదాపు 1,400 మీటర్ల శిథిలాలను అందించింది. ఇక సమీపంలోని చిన్న క్రేటర్‌ల ద్వారా అదనపు భౌగోళిక పదార్థాలను పరిశోధించవచ్చు. తద్వారా దాని భౌగోళిక చరిత్రపై కీలకమైన అంతర్దృష్టులను మానవజాతి అందుకోనుంది.












Click it and Unblock the Notifications