చైనా.. ది గ్రేట్ మూన్ మిషన్: చరిత్ర గతిని తిప్పేలా: పేలోడ్స్

ప్రపంచ అంతరిక్ష యవనికపై మరో మహత్తర ఘట్టానికి చైనా సిద్ధమవుతోంది. చంద్రుడి రహస్యాలను ఛేదించడానికి రూపొందించిన చాంగ్ ఈ- 7 (Chang'e-7) రోబోటిక్ అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 24 నుంచి 31వ తేదీ మధ్య కాలంలో ఎప్పుడైనా ఈ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండ్ కాబోతోందీ స్పేస్ క్రాఫ్ట్. అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయనుంది.

చంద్రుడి దక్షిణ ధృవం క్శాశ్వతంగా చీకటితో నిండి ఉంటుందనే విషయం తెలిసిందే. వెలుగు అనేదే ప్రసరించదక్కడ. ఈ సంక్లిష్ట వాతావరణం, అక్కడి క్రేటర్ లల్లో దాగున్న ఐస్ వాటర్ జాడలను కనుగొనడమే ఈ ప్రయోగం పరమావధి. చైనా చేపడుతున్న మూన్ మిషన్ లల్లో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనది కూడా.

Chang e 7 Launch Soon With China s Moon Mission to Hunt Ice Water at the South Pole of the Lunar

భవిష్యత్తులో చందమామపై మానవ నివాస స్థావరాలను నిర్మించాలనే అంతర్జాతీయ రోదసీ సంస్థల ఆకాంక్షలకు నీరే జీవనాధారం. ఈ నేపథ్యంలోనే చైనా తన చాంగే 7 వ్యోమనౌక ద్వారా జలవనరుల లభ్యతపై కచ్చితమైన అంచనాలు వేయాలని భావిస్తోంది. గతంలో జరిగిన విభిన్న అంతరిక్ష ప్రయోగాలు చంద్రుడిపై నీరు ఉన్నట్లు గుర్తించినప్పటికీ.. ఈసారి చైనా మరింత లోతుగా అధ్యయనం చేయబోతోంది. ఆ నీటిని వాడుకోగలమా లేదా అనే విషయాలను నిర్ధారించనుంది.

చంద్రుడిపై నూతనంగా అతి భారీ గొయ్యి : గాల్లోకి ఎగిరిన ధూళి కణాల్లో..
చంద్రుడిపై నూతనంగా అతి భారీ గొయ్యి : గాల్లోకి ఎగిరిన ధూళి కణాల్లో..

చాంగే 7 మిషన్ ప్రధానంగా నాలుగు భాగాల సమ్మేళనం. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్, హాపర్.. ఇందులో ఉంటాయి. ఆర్బిటర్ నిరంతరం చందమామ కక్ష్యలో తిరుగుతూ దాని ఉపరితలం మొత్తాన్ని మ్యాపింగ్ చేయడంతో పాటు అక్కడ జరిగే పరిణామాలను ఫొటోల రూపంలో భూమికి పంపుతుంటుంది. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, చంద్రుడి ఉపరితలంపై ఉండే ల్యాండర్, రోవర్‌లకు మధ్య ఇది డేటా రిలే వ్యవహరిస్తుంది.

చంద్రుడిపై హ్యూజ్ క్రాష్- ఇక ఉండేది 5 రోజులు మాత్రమే..!!
చంద్రుడిపై హ్యూజ్ క్రాష్- ఇక ఉండేది 5 రోజులు మాత్రమే..!!

ఇక ల్యాండర్.. తన విధుల్లో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో ఉండే 21 కిలోమీటర్ల వెడల్పు గల షాకిల్టన్ క్రేటర్ అంచున ల్యాండ్ కానుంది. ఈ ల్యాండర్ మోసుకెళ్లే పరికరాల్లో అత్యంత వినూత్నమైనది 6- లెగ్డ్ హాపర్.. అనే చిన్న రోబోటిక్ పరికరం. సూర్యరశ్మి ఆధారంగా ఇది పని చేస్తుంది. సాధారణ రోవర్ లా నేలపై నడవడమే కాకుండా, ఒక చోట నుంచి మరో చోటుకి సులువుగా గెంతగలదు కూడా.

Chang e 7 Launch Soon With China s Moon Mission to Hunt Ice Water at the South Pole of the Lunar

దక్షిణ ధృవంలోని లోతైన చీకటి క్రేటర్ లల్లో ఈ హాపర్ ప్రవేశిస్తుంది. అత్యంత కఠిన వాతావరణంలో కూడా నీటి మంచు జాడల గురించి శోధిస్తుంది. అంతరిక్ష చరిత్రలో ఇలాంటి హాపింగ్‌ పరికరాన్ని స్పేస్ రీసెర్చ్ సంస్థ.. చంద్రుడిపై ఉపయోగించడం ఇదే మొదటిసారి. చంద్రుడి ధృవంలో కోట్ల సంవత్సరాల నుంచి గడ్డకట్టుకుపోయిన ఐస్ వాటర్ ద్వారా సౌర వ్యవస్థ ప్రాథమిక దశల గురించి విలువైన సమాచారాన్ని సేకరించాలని చైనా భావిస్తోంది.

చంద్రుడి అవతలి రహస్యాల ఛేదన దిశగా నాసా- నిప్పులు చిమ్ముతూ జాబిల్లి వైపు
చంద్రుడి అవతలి రహస్యాల ఛేదన దిశగా నాసా- నిప్పులు చిమ్ముతూ జాబిల్లి వైపు

ప్రాచీన కాలంలో చంద్రుడిపై సంభవించిన అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూమి-చంద్రుడిపై తోకచుక్కలు, గ్రహశకలాల ద్వారా వచ్చి చేరిన నీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడి మంచులో భద్రంగా ఉంటాయని చైనా గట్టిగా నమ్ముతోంది. దీనివల్ల భూమిపై సముద్రాలు ఎలా ఏర్పడ్డాయనే చిక్కుముడి సైతం వీడుతుందని భావిస్తోంది. చంద్రుడిపై తగినంత పరిమాణంలో లభించే ఈ నీటిని భవిష్యత్తు మానవ యాత్రలకు ఉపయోగించుకోవచ్చు.

నీటి అణువుల నుంచి హైడ్రోజన్‌ను ప్రత్యేకంగా వేరు చేసి అత్యంత శక్తివంతమైన రాకెట్ ఇంధనంగా అభివృద్ధి చేయడానికి వీలవుతుంది. అందులోని ఆక్సిజన్‌ను వేరు పరిచి వ్యోమగాముల శ్వాస అవసరాలకు వాడుకోవచ్చు. ఇవన్నీ సాధ్యమైతే భవిష్యత్తులో అంగారక గ్రహానికి పంపే సుదూర వ్యోమనౌకలకు చంద్రుడే ఒక ప్రధాన రీఫ్యూయలింగ్ స్టేషన్‌గా మారే అవకాశాలు లేకపోలేదని చైనా శాస్త్రవేత్తలు అంచనా వేస్తోన్నారు.

చంద్రుడి దక్షిణ ధృవాన్ని అన్వేషించేందుకు అగ్రదేశాలు తీవ్రంగా శ్రమిస్తోన్న విషయం తెలిసిందే. 2023లో రష్యా పంపిన లూనా-25 వ్యోమనౌక సాంకేతిక లోపంతో చంద్రుడిపై కూలిపోగా.. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 అక్కడ ల్యాండ్ అయింది. చంద్రుడి దక్షిణ వైపు విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొదటి దేశంగా భారత రికార్డు నెలకొల్పింది. చంద్రయాన్-3 సేకరించిన మట్టి ఉష్ణోగ్రతల ఆధారాలు.. అక్కడ నీరు మంచు రూపంలో ఉందనే విషయాన్ని నిరూపించాయి కూడా.

చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో అడుగుపెట్టడం, అక్కడ మనుగడ సాగించడం అనేది సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన వ్యవహారం. ఇక్కడి ఉపరితలం అంతా అతి పెద్ద క్రేటర్లతో నిండివుంటుంది. లోతైన లోయలు, ఎత్తైన కొండల వంటి కఠిన భౌగోళిక ఆకృతులు అన్ని చోట్లా కనిపిస్తాయి. అక్కడి చీకటి ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ కన్నా దిగువకు పడిపోతాయి. అత్యంత శీతల వాతావరణంలో ల్యాండర్లు సుదీర్ఘ కాలం పాటు పనిచేసేలా చైనా చాంగే 7 ను రూపొందించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+