చందమామకు అవతలి వైపు అద్భుతం- సంపూర్ణ సూర్యగ్రహణం
విశ్వంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. మనిషి తన జీవితకాలంలో ఏనాడూ చూడని మహాద్భుత దృశ్యం అది. చందమామకు అవతలి వైపు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. దీన్ని ఆర్టెమిస్ 2 వ్యోమగాములు స్వయంగా వీక్షించారు. మనం రోజూ చూసే చంద్రుడికి ఇవతలి వైపు కంటే ఎంతో భిన్నంగా కనిపించిందా సూర్యగ్రహణం. ఇక్కడి కంటే సుదీర్ఘ గ్రహణ కాలం అది. గ్రహణం చీకటిలో ఆర్టెమిస్ 3 నౌక ప్రయాణం ప్రారంభమైందంటే అది ఎంత భిన్నమైనదో అర్థం చేసుకోవచ్చు.
ఆర్టెమిస్ 2 వ్యోమగాములు ప్రస్తుతం చంద్రుడికి వెనుకవైపు ఉన్నారు. వారు బయలుదేరిన ఓరియన్ స్పేస్ షిప్ ప్రస్తుతం చంద్రుడికి అవతలి వైపున పరిభ్రమిస్తోంది. అదే సమయంలో ఈ అత్యంత అరుదైన ఖగోళ దృశ్యానికి సాక్షీభూతంగా నిలిచింది. భూమిపై ఎవరూ, ఎప్పుడూ చూడలేని సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ఆ నలుగురు వ్యోమగాములు వీక్షించారు. ఒరియన్ అంతరిక్ష నౌక చంద్రుని వెనుకకు జారుకోవడంతో గ్రహణం చీకటిలో దాని ప్రారంభమైంది.

సూర్యుడిని చందమామ పూర్తిగా కప్పివేయడంతో పగటి పూట కూడా గాఢమైన చీకటి ఆవరించిందక్కడ. సూర్యగ్రహణం కావడం వల్ల సోలార్ డిస్క్ కు సంబంధించిన ప్రకాశవంతమైన వెలుగు అడ్డుపడని సందర్భం అది. దీంతో సూర్యుడి బాహ్య వాతావరణమైన సోలార్ కరోనాను స్పష్టంగా పరిశీలించగలిగారు ఆ వ్యోమగాములు. సౌర కరోనాపై అధ్యయనం శాస్త్రీయంగా ఎంతో కీలకం. సుదూర అంతరిక్ష ప్రయాణంలో వ్యోమగాములు సాధించిన ఓ అనుకోని ఘట్టంగా దీన్ని అభివర్ణించింది నాసా.
కరోనా అనేది సూర్యుడి ఉపరితలం కంటే ఇది అత్యంత వేడిగా ఉండటం ఒక మిస్టరీ. అలా ఎందుకు ఉందనే విషయాన్ని ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు సైంటిస్టులు. ఇప్పుడు అనుకోకుండా కరోనా తీవ్రత పసిగట్టే సందర్భంగా ఏర్పడింది. గ్రహణం సమయంలో చంద్రుడిని కవచంగా వాడుకుంటూ, వ్యోమగాములు కరోనా ప్రకాశవంతమైన, సూక్ష్మ పొరలు అంతరిక్షంలోకి వ్యాపించడాన్ని వీక్షించారు. వీటిని రికార్డు చేశారు. ఇది- భూమిపై సౌరగాలుల తీవ్రతపై ఓ అవగాహన కల్పిస్తుందని నాసా భావిస్తోంది.
సూర్యుడు.. చంద్రుడికి నేరుగా అడ్డుగా ఉండడంతో చంద్రుని ఉపరితలం అత్యంత చీకటిమయంగా కనిపించింది. కరోనా అంచుల నుండి వెలువడిన సూర్యకిరణాలు ప్రతిఫలించినప్పుడు చంద్రుడు కాస్త మసకబారిన కాంతితో మెరుస్తూ ఉండటాన్ని వ్యోమగాములు వీక్షిస్తున్నారు. ఇదీ ఓ అరుదైన సందర్భమే. ఈ దశ- చంద్రుని అవతలి వైపు సాధారణ సూర్యకాంతిలో మరుగున పడిపోయే సూక్ష్మ భౌగోళిక లక్షణాలను గుర్తించడానికి వీలు కలుగుతుందని నాసా అంచనా వేసింది.












Click it and Unblock the Notifications