2025లో తొలి అంతరిక్ష అద్భుతం:జనవరి 3-4వ తేదీల్లో ఉల్కాపాతం..మిస్ అవ్వొద్దు..!!
2025లోకి ప్రవేశించాం.ఈ కొత్త ఏడాదిలో అంతరిక్షంలో తొలి ఉల్కాపాతం సంభవించనుంది. ఈ ఉల్కాపాతాన్ని చూసేందుకు ప్రపంచం అంతా సిద్ధంగా ఉంది. ఈ ఉల్కాపాతం పేరు క్వాడ్రాంటిడ్స్ (Quadrantids).ఇది ఏటా జనవరి నెలలో సంభవిస్తుంది. ఈ ఉల్కాపాతం ఒక వర్షంలా కురుస్తుంది. అయితే దీన్ని స్పష్టంగా వీక్షించే అదృష్టం ఎక్కువగా ఉత్తర అమెరికా వాసులకు ఉంది. ప్రత్యేకించి మిస్సిస్సిపి రాష్ట్రంలో ఉన్న వారు దీన్ని మరింత దగ్గరగా స్పష్టంగా వీక్షించొచ్చని అంతరిక్ష నిపుణులు చెబుతున్నారు.
క్వాడ్రాంటిడ్స్ ఉల్కాపాతం అంటే ఏంటి..?
ప్రతి ఏటా జనవరి ప్రాంరంభంలో క్వాడ్రాంటిడ్ ఉల్కాపాతం సంభవిస్తుంది. ఇది తీవ్రమైన ఉల్కాపాతాలలో ఒకటిగా పరిగణిస్తారు. క్వాడ్రాంటిడ్స్ (Quadrantids) అనే పేరు క్వాడ్రాన్స్ మురలిస్ నుంచి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ పేరు వాడుకలో లేదు. ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త జేజేలాలాండ్ ఈ పేరును తొలిసారిగా 1975లో పెట్టారు. ఉల్కాపాతాన్ని 1830లో బెల్జియంకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త అడాల్ఫ్ క్యూటెలెట్ తొలిసారిగా గమనించారు. క్వాడ్రాంటిడ్స్ 2003EH1 అనే గ్రహశకలం నుంచి ఇది ఉద్భవించినట్లు పేర్కొన్నారు.1490-91 మధ్య అంతరించిపోయిన తోకచుక్క నుంచి విచ్చిన్నమైన భాగమని చెప్తున్నారు. ఇది తీవ్రంగా మారినప్పుడు గంటకు 60 నుంచి 120 వరకు ఉల్కలు విడుదలవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇది స్పష్టంగా కనిపించాలంటే అ ప్రక్రియ జరుగుతున్న ప్రదేశం, సమయంపై ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఎక్కడ కనిపిస్తుంది..?
ఈ ఏడాది తొలి ఉల్కాపాతం ఉత్తర అమెరికాలోని పాశ్చాత్య ప్రాంతాల్లో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జనవరి 3వతేదీ అర్థరాత్రి దాటి జనవరి 4వ తేదీ తెల్లారుజామున కనిపిస్తుందని వెల్లడించారు. ఈ ఉల్కలు చాలా ప్రకాశవంతంగా ఉంటూ వేగంగా భూమిని ఢీకొంటాయని తెలుస్తోంది. ఇక నింగిలో చంద్రుడు కనిపించకపోతే... ఈ ఉల్కాపాతం మరింత అందంగా కనిపిస్తుందని ఈ ఏడాదిలో ఇదే బెస్ట్ ఉల్కాపాతంగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు అభివర్ణించారు.
Look for shooting stars tonight! 🌠
— NASA JPL (@NASAJPL) January 3, 2025
The #Quadrantid meteor shower peaks in the early morning hours of Jan. 3. So stay warm, let your eyes adjust to the dark, and have fun stargazing!
Skywatching tips: https://t.co/X1kucmQWGi pic.twitter.com/9ubmInFdlq
అమెరికా దేశంలో స్పష్టంగా కనిపిస్తుండగా ఇతర దేశాల్లో కూడా ఉల్కాపాతం దర్శనమిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. కెనడా, ఉత్తర ఐరోపాలోని కొన్ని ప్రదేశాలు, రష్యా, చైనా, జపాన్, కొరియా దేశాల్లో ఉల్కాపాతంను చూడొచ్చు.అయితే ఉల్కాపాతం స్పష్టంగా కనిపించకపోవచ్చని చెప్తున్నారు. ఈ ఉల్కాపాతాన్ని వీక్షించే మంచి సమయం జనవరి 4వ తేదీ తెల్లారుజామున అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గత సారి క్వాడ్రాంటిడ్స్ ఉల్కాపాతం 2023 డిసెంబర్ 28వ తేదీన ప్రారంభమై 2024 జనవరి 12 వరకు దర్శనమిచ్చింది. ఇక జనవరి 3-4వ తేదీల మధ్య దీని తీవ్రత ఎక్కువగా ఉండటంతో గంటకు 120 ఉల్కలను వీక్షించినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.
భారతదేశంలో ఈ ఉల్కాపాతం కనిపించకపోయినప్పటికీ పలు ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ అంతరిక్ష అద్భుతాన్ని వీక్షించేందుకు జనవరి 3-4వ తేదీల్లో మేల్కొని ఉండండి. ఈ అద్భుతాన్ని మిస్ అవకండి.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications