Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

“ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్": సేల్ ఆఫర్స్‌లో టాప్ 10 స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇవే !!!

భారతదేశంలో వినియోగదారులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే షాపింగ్ ఆఫర్స్ మళ్లీ వచ్చేశాయి. ఒకవైపు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025.. మరోవైపు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 ప్రారంభం అయ్యాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈసారి ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్ విభాగంలో అద్భుతమైన డీల్‌లు ప్రకటించాయి. బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు అన్ని రేంజ్‌లలో ఆఫర్లు ఇస్తుండడం టెక్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి.

విద్యార్థులు, బడ్జెట్ కొనుగోలుదారులు, గాడ్జెట్ ప్రియులు అందరికీ తగిన ఆఫర్లు లభిస్తున్నాయి. ఎంట్రీ లెవల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు రూ. 7,000 నుండి ప్రారంభం. మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు రూ. 20,000-40,000 మధ్యలో.. ప్రీమియం ఫోన్‌లు ఐఫోన్‌లు, శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌లు 40%-50% వరకు డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా...

flipkart-vs-amazon-that-top-10-smartphone-deals-in-sale-offers

టాప్ 10 హైలైట్ డీల్స్...

1. ఐఫోన్ 16 ప్రో - ఫ్లిప్‌కార్ట్

అసలు ధర: రూ. 1,40,000

ఆఫర్ ధర: రూ. 69,999

దాదాపు 50% తగ్గింపు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభవం కోరుకునే వారికి మిస్ అవ్వకూడని ఆఫర్. అయితే ఈ ఫోన్ ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయని యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు.

2. ఐఫోన్ 15 - అమెజాన్

ధర: రూ. 43,749. పాత మోడల్ అయినా ఇంకా పవర్‌ఫుల్‌గా ఉండే ఐఫోన్ 15 ఇప్పుడు బడ్జెట్ ప్రియమైన ధరకు.

3. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 - ఫ్లిప్‌కార్ట్

ఆఫర్ ధర: రూ. 40,000

మిడ్‌రేంజ్ ఫోన్‌గా అద్భుతమైన డీల్. కెమెరా, పనితీరు రెండింటికీ సరైన కాంబినేషన్.

4. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా - అమెజాన్

ఆఫర్ ధర: రూ. 71,999

మార్కెట్‌లోని అత్యంత పవర్‌ఫుల్ ఫోన్‌లలో ఒకటి. ప్రొఫెషనల్ స్థాయి కెమెరా పనితీరు.

5. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా - ఫ్లిప్‌కార్ట్

ఆఫర్ ధర: రూ. 80,000 లోపు

అమెజాన్ కంటే కొంచెం ఎక్కువ ధర అయినా, బ్యాంక్ ఆఫర్లతో పోల్చితే మంచి డీల్ కావచ్చు.

6. వన్‌ప్లస్ 13ఆర్ - అమెజాన్

ఆఫర్ ధర: రూ. 43,749

వన్‌ప్లస్ అభిమానులకు గుడ్ న్యూస్. పవర్‌ఫుల్ పనితీరు + ఫాస్ట్ చార్జింగ్.

7. వన్‌ప్లస్ 12 - ఫ్లిప్‌కార్ట్

అసలు ధర: రూ. 65,000

ఆఫర్ ధర: రూ. 52,000

ప్రీమియం ఫీచర్లు తక్కువ ధరకే కావాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఎంపిక.

8. గూగుల్ పిక్సెల్ 9 - అమెజాన్

ఆఫర్ ధర: రూ. 55,999

గూగుల్ AI ఆధారిత కెమెరా ఫీచర్లు, స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవం కోరుకునే వారికి పర్ఫెక్ట్ ఫోన్.

9. రియల్‌మీ జీటీ 7 ప్రో - ఫ్లిప్‌కార్ట్

ఆఫర్ ధర: రూ. 28,999

గేమర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన పవర్‌ఫుల్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్.

10. ఐకూ 13 - అమెజాన్

ఆఫర్ ధర: రూ. 29,999

గేమింగ్, పెర్ఫార్మెన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన బడ్జెట్-ఫ్రెండ్లీ ఫ్లాగ్‌షిప్ కిల్లర్.

అదనపు ఆఫర్లు..

బ్యాంక్ ఆఫర్లు & ఎక్స్ఛేంజ్ డీల్స్..

  • HDFC, ICICI, SBI వంటి ప్రముఖ బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులతో అదనంగా 10% వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్.
  • పాత స్మార్ట్‌ఫోన్ ఇచ్చి ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మరో రూ. 10,000-15,000 వరకు సేవ్ చేసుకునే అవకాశం.
  • EMI ఆప్షన్‌లు, నో-కాస్ట్ EMI స్కీములు కూడా అందుబాటులో ఉన్నాయి.

కస్టమర్లకు సూచనలు..

  • సేల్ ప్రారంభమైన వెంటనే ఫ్లాష్ సేల్ డీల్‌లు ముగిసిపోతాయి. కాబట్టి ముందుగానే విష్‌లిస్ట్ సెట్ చేసుకోవడం మంచిది.
  • ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ధరలను పోల్చి చూసి ఉత్తమ ఆఫర్ ఎంచుకోవాలి.
  • కూపన్ కోడ్‌లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు కూడా వాడితే మరింత డిస్కౌంట్ లభిస్తుంది.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+