E10 Motorway: ఈ రోడ్డెక్కితే చాలు మీ వాహనాలు ఆటోమేటిక్ గా ఛార్జ్ అవుతాయి
ప్రపంచం శరవేగంగా దూసుకుపోతుంది. ఏ పనికైనా ఒక్క క్షణం కూడా వేచి చూడాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఏఐ రాకతో అంతా మారిపోయింది. సాధారణంగా మనం మన వాహనాల్లో ఆయిల్ అయిపోతే పెట్రోల్ బంక్ కు వెళ్లి ఆయిల్ కొట్టించుకుంటాం. అదే ఎలక్ట్రికల్ వాహనమైతే ఛార్జింగ్ పాయింట్ వద్ద ఓ గంట వెయిట్ చేసి ఛార్జ్ చేసుకుంటాం. ఇవ్వన్నీ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. వీటికంటే కొంచం అడ్వాన్స్‌డ్ గా ఆలోచించింది ఓ దేశం. తమ దేశంలో ప్రజల టైం వేస్ట్ కాకుండా రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడే వారి వాహనాలు ఛార్జ్ అయ్యేలా ఆలోచన చేయడమే కాదు.. ఆచరణలో పెట్టి చూపించి.. మంచి ఫీడ్ బ్యాక్ కూడా అందుకుంది.
ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు అతిపెద్ద అడ్డంకిగా మారిన అంశం ఛార్జింగ్ సమస్య. బ్యాటరీ ఖాళీ అవుతుందన్న భయం, ఛార్జింగ్ కేంద్రాల కొరత, ఎక్కువ సమయం తీసుకునే రీచార్జింగ్ ప్రక్రియ ఇవి చాలామందిని ఇంకా ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేయకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితికి పూర్తిగా భిన్నమైన పరిష్కారాన్ని ఫ్రాన్స్ దేశం ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఫ్రాన్స్ లో ఇప్పుడు అధికంగా విద్యుత్ వాహనాలే. ఆయిల్ తో నడిచే వాహనాలకు ఆదేశం స్వస్తి పలికింది. కాలుష్య నియంత్రణలో భాగంగా తీసుకుంటున్న అనేక విప్లవాత్మక నిర్ణయాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం కూడా ఒకటి. ప్రజలు ఈవీ వాడుతున్నారు సరే.. మరి వాటి ఛార్జింగ్ కోసం ప్రభుత్వం రీఛార్జ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయాలి కదా. అందుకే ఫ్రాన్స్ ఇంకా వినూత్నంగా ఆలోచించింది. వాహనదారులు ఛార్జింగ్ పాయింట్స్ వద్ద వెయిట్ చేయకుండా ఉండేందుకు.. ఛార్జింగ్ రోడ్డునే నిర్మించింది. దీంతో ఈ రోడ్డుపైకి మీ వాహనం ఎక్కితే చాలు.. ఆటోమెటిక్ గా బండి ఛార్జ్ అయిపోతుంది.
ఫ్రాన్స్‌లోని ఈ10 మోటార్‌వే రహదారి ఇప్పుడు "నడుస్తూనే ఛార్జింగ్ అయ్యే రహదారి"గా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రహదారిని ప్రత్యేకంగా రూపొందించింది ఫ్రాన్స్. ఈ రోడ్డు కింద రాగి కాయిల్స్‌ను అమర్చారు. వాహనాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రిసీవర్లు) ఈ కాయిల్స్‌తో అనుసంధానమై, విద్యుత్ శక్తిని వాహనానికి చేరవేస్తాయి. ఫలితంగా వాహనం రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడే బ్యాటరీకి ఛార్జింగ్ జరుగుతుంది. ఇది పూర్తిగా తీగలు లేని విద్యుత్ పంపిణీ విధానం. మొబైల్ ఫోన్‌లను వైర్‌లెస్ ఛార్జర్‌పై పెట్టినప్పుడు ఎలా ఛార్జ్ అవుతాయో, అదే సూత్రంపై ఈ సాంకేతికత పనిచేస్తోంది.
కార్లకు ఎంతో ఉపయోగకరం..
ఈ ఛార్జింగ్ రహదారి ముఖ్యంగా ప్రజా రవాణా వాహనాలు, భారీ సరుకు వాహనాలు, దీర్ఘదూర ప్రయాణాలు చేసే కార్లకు ఎంతో ఉపయోగకరంగా మారింది. బస్సులు, ట్రక్కులు పెద్ద బ్యాటరీలను మోసుకెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. దాంతో వాహన బరువు తగ్గి, విద్యుత్ వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే తయారీ ఖర్చులు తగ్గే అవకాశం కూడా ఉంది. బ్యాటరీలపై ఆధారపడటం తగ్గడం వల్ల అరుదైన లోహాల వినియోగం కూడా నియంత్రణలోకి వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

ప్రకృతిలో మార్పులు వస్తే..
ఈ రహదారి మరో విశేషం ఏమిటంటే వాతావరణ మార్పులకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడం. భారీ వర్షాలు, వరదలు, మంచు పడే పరిస్థితుల్లో కూడా ఈ ఛార్జింగ్ వ్యవస్థ సజావుగా పనిచేస్తుందని ఫ్రాన్స్ అధికారులు చెబుతున్నారు. రహదారి ఉపరితలం లోపలే సాంకేతిక ఏర్పాట్లు ఉండటంతో బయట వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపడం తక్కువగా ఉంటుంది.
అంత సింపుల్ టాస్క్ కాదు..
అయితే ఈ విధానానికి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. మొదటిగా రహదారుల నిర్మాణ వ్యయం సాధారణ రోడ్ల కంటే ఎక్కువ. అలాగే వాహనాల్లో ప్రత్యేక రిసీవర్స్ అమర్చాల్సి ఉంటుంది. అంటే ఇప్పటికే ఉన్న అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు ఈ రోడ్లపై నడిచినా వెంటనే ఛార్జ్ అవ్వవు. ఈ సాంకేతికతకు అనుగుణంగా వాహనాల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా అన్ని రహదారులను ఇలా మార్చడం ఒకేసారి సాధ్యం కాదన్న వాస్తవం కూడా ఉంది.
ఈ సవాళ్లను దృష్టిలో పెట్టుకునే ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ రహదారులను దశలవారీగా విస్తరించాలని భావిస్తోంది. మొదట ముఖ్యమైన మోటార్‌వేలు, సరుకు రవాణా మార్గాలు, ప్రజా రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ఈ ఛార్జింగ్ రోడ్లను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో మరిన్ని రహదారులను ఇలాగే అభివృద్ధి చేస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
రోడ్డే ఇంధనం..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ తరహా రహదారులు విస్తృతంగా అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ఛార్జింగ్ కోసం వాహనాన్ని గంటలు గంటలు ఆపాల్సిన అవసరం లేకపోవడం వల్ల ప్రయాణ సమయం తగ్గుతుంది. ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా ఎలక్ట్రిక్ వైపు మళ్లేందుకు ఇది కీలక మలుపుగా మారవచ్చని విశ్లేషకులు అంటున్నారు. రోడ్డునే విద్యుత్ ఇంధనంగా మారుస్తున్న ఈ టెక్నాలజీ, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల రంగాన్ని కొత్త దిశలో నడిపించే శక్తిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications