అత్యంత సమీపానికి గురు గ్రహం: రాత్రంతా చూస్తూ గడపొచ్చు..!!

గురు గ్రహం ఆకాశంలో అద్భుతంగా దర్శనం ఇవ్వనుంది. భూమికి పూర్తి వ్యతిరేక దిశలో రానుంది. రాత్రి నుంచి తెల్లవారు జామున వరకు తూర్పు దిక్కున మిథున రాశి కూటమిలో అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. గురు గ్రహాన్ని వీక్షించడానికి ఇదే సరైన సమయం. గ్రహాలు కనబడటం వాటి కక్ష్య స్థానాలపై ఆధారపడి ఉంటుంది. భూమి కన్నా సూర్యుడికి దూరంగా తిరిగే 'సుపీరియర్ ప్లానెట్స్'.. భూమికి పూర్తిగా వ్యతిరేక దిశలోకి వచ్చినప్పుడు మరింత స్పష్టంగా వీక్షించవచ్చు.

ఈ స్థితిలో- భూమి సరిగ్గా సూర్యుడు, గురు గ్రహం మధ్యలో ఉంటుంది. వ్యతిరేక దిశలో ఉన్న సమయంలో గురుగ్రహం భూమికి అత్యంత సమీపంలోకి వస్తుంది. దీని ఆర్బిటల్ పొజీషన్ 45.6 ఆర్క్‌సెకండ్లు కాగా, భూమికి దూరంగా ఉన్నప్పుడు 31.3 ఆర్క్‌సెకండ్లు మాత్రమే. ఫలితంగా సాధారణం కంటే మరింత ప్రకాశవంతంగా, పెద్దదిగా కనిపిస్తుంది. టెలిస్కోప్ ద్వారా మరింత స్పష్టంగా గురుగ్రహాన్ని వీక్షించవచ్చు.

Gas Giant Jupiter Reaches Opposition The Best Brightness Tonight

ఈ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు దిక్కున చూస్తే మిథున రాశి కూటమిలో బృహస్పతి మెరుస్తూ కనిపిస్తుంది. దాని కుడివైపున ఓరియన్ నక్షత్రరాశి, పైన ప్రకాశవంతమైన కాపెల్లా నక్షత్రం ఉంటాయి. ఈ భారీ వాయు గ్రహం రాత్రిపూట ఆకాశంలో గరిష్ట స్థాయి ఎత్తుకు కదిలుతుంది. 11వ తేదీన సూర్యోదయానికి ముందు పశ్చిమ దిక్కున దిగువకు చేరుకుంటుంది. ఎటువంటి పరికరాలు లేకుండా నేరుగా చూసినా అద్భుతంగా కనిపిస్తుందీ గ్రహం.

152 మిల్లీ మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ అపెర్చర్ ఉన్న టెలిస్కోప్ ద్వారా వీక్షించడం ఉత్తమం. దీనివల్ల గ్రహం ఉపరితలంపై ఉండే రంగురంగుల వాతావరణ మేఘాల పొరలు మరింత స్పష్టంగా, ఆకట్టుకునేలా కనిపిస్తాయి. ఈ రాత్రికి గురు గ్రహానికి ఇరువైపులా ఒకే సరళ రేఖలో నాలుగు పెద్ద గెలీలియన్ ఉపగ్రహాలు- ఐఓ, యూరోపా, గెనిమీడ్, కాల్లిస్టో కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ అద్భుత దృశ్యాన్ని రాత్రంతా వీక్షించవచ్చు. ఆకాశంలో చంద్రుడు, శుక్రుడితో పాటు అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది గురుగ్రహం.

దీంతో పాటు ఈ నెల 23న చంద్రుడు- శని గ్రహాల కంజంక్షన్ ఏర్పడనుంది. అంటే ఆకాశంలో ఈ రెండూ దగ్గరగా ఉన్నట్లు కనిపించడాన్ని కంజంక్షన్ అంటారు. 23వ తేదీన సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం ఈ దృశ్యాన్ని పశ్చిమ దిక్కున చూడొచ్చు. చంద్రుడికి దిగువన మెరిసిపోతూ శని గ్రహం కనిపిస్తుంది. ఈ నెల పొడవునా 'బీహైవ్ క్లస్టర్' రాత్రి ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తుంది. దీనినే అధికారికంగా మెస్సియర్ 44 (M44) అని పిలుస్తారు. నక్షత్రాలతో కూడిన ఓపెన్ స్టార్ క్లస్టర్ ను మెస్సియర్ అని పిలుస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+