అదిరిపోయే అప్డేట్ తీసుకొచ్చిన "Gmail".. అడ్రస్ ఛేంజ్ !!

ప్రస్తుత కాలంలో అందరికీ ఈమెయిల్ గురించి తెలిసిందే. యాహూ, ఔట్‌లుక్ సహా పలు మెయిల్ ఫ్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నా.. జీమెయిల్‌ బాగా ప్రాచుర్యం పొందింది. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది జీమెయిల్ అనేది వాడుతూ ఉంటారు. విద్యార్ధులు, ఉద్యోగులు సహా స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారందరికీ మెయిల్ బాగా ఉపయోగపడుతుంది. గూగుల్‌కు చెందిన జీమెయిల్యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ఏదోక ఫీచర్‌ను తీసుకొస్తూనే ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా మరో అదిరిపోయే ఆప్షన్ తీసుకొచ్చింది.

Google నుంచి కొత్త అప్‌డేట్..

ఇటీవల Google తన అధికారిక సపోర్ట్ డాక్యుమెంటేషన్‌ను అప్‌డేట్ చేసింది. దీని ప్రకారం, యూజర్‌లు తమ Gmail యూజర్‌నేమ్‌ను మార్చుకునే అవకాశం క్రమంగా అందుబాటులోకి వస్తోంది. ఇది ఇంకా అన్ని అకౌంట్స్‌కు యాక్టివ్ కాలేకపోయినా, కొన్ని ఖాతాల్లో ఇప్పటికే ఈ ఫీచర్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ మార్పులు ఒకేసారి కాకుండా దశలవారీగా (gradual rollout) అమలు చేస్తున్నట్లు Google స్పష్టం చేసింది.

google-gmail-brings-new-update-about-address-change

అయితే ఈరోజుల్లో Gmail అడ్రస్ అనేది కేవలం మెసేజ్‌లు పంపుకునే సాధనం కాదు. అది మీ డిజిటల్ గుర్తింపు. ఉద్యోగ దరఖాస్తులు, బిజినెస్ మెయిల్స్, అధికారిక కమ్యూనికేషన్ సహా అన్నింటికీ వాడుతున్నారు. మెయిల్ క్రియేట్ చేసుకున్న మొదటిసారి ఎంచుకున్న యూజర్‌నేమ్‌ని ప్రతిసారి టైప్ చేయాల్సి రావడం చాలామందికి అసౌకర్యంగా ఉంటుంది. ఇప్పటివరకు మార్పు కష్టం అనిపించినా, ఇప్పుడు పరిస్థితి మారుతోంది.

ఇంతకుముందు Gmail అడ్రస్ మార్చాలంటే కొత్త అకౌంట్ తీసుకోవాల్సిందే. అప్పుడు ఈమెయిల్స్ ఎక్స్‌పోర్ట్ చేసి మళ్లీ ఇంపోర్ట్ చేయాల్సి వచ్చేది. అందువల్ల కొన్ని మెయిల్స్ లేదా అటాచ్‌మెంట్‌లు మిస్ అవ్వే ప్రమాదం కూడా ఉంది. ప్రతి సర్వీస్‌లో కొత్త అడ్రస్ అప్‌డేట్ చేయాల్సిన తలనొప్పి ఉండేది. ఈ కారణాల వల్ల చాలామంది మార్పును వాయిదా వేసేవారు. ఇప్పుడు ఈ కొత్త అప్‌డేట్‌తో మీరు మీ పాత Gmail అకౌంట్‌ను వదలాల్సిన అవసరం లేదు. మారేది కేవలం యూజర్‌నేమ్ భాగం మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు.

మీ ఖాతా, డేటా, మెయిల్స్ అన్నీ అలాగే ఉంటాయి. కొత్త యూజర్‌నేమ్ మీ ప్రధాన Gmail అడ్రస్ అవుతుంది. అంటే, ఇంటి లోపల ఉన్నదంతా అలాగే ఉంచి, బయట నేమ్‌ప్లేట్ మార్చినట్లే. ఈ ఆప్షన్ మీ అకౌంట్‌కు అందుబాటులోకి వచ్చిన తర్వాత, మార్పు Gmail యాప్‌లో కాదు - Google Account Settings లో జరుగుతుంది. అక్కడ..

ఈమెయిల్ అడ్రస్ ఫీల్డ్ ఎడిట్ చేయవచ్చు

అందుబాటులో ఉన్న కొత్త యూజర్‌నేమ్‌ను ఎంచుకోవచ్చు

ధృవీకరణ పూర్తయిన తర్వాత కొత్త అడ్రస్ యాక్టివ్ అవుతుంది

అలానే మీ ఇన్‌బాక్స్, ఫైల్స్, ఫోటోలు గురించి కూడా ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+