గూగుల్ Pixel 10 ఫోన్ లో క్రేజీ ఫీచర్.. ధర ఎంతంటే ..?
టెక్ దిగ్గజం గూగుల్ ఒక చరిత్రాత్మక అడుగు వేసింది. వాట్సాప్ కాల్స్, వీడియో చాట్స్ చేయాలంటే ఇప్పటివరకు మొబైల్ నెట్‌వర్క్ లేదా Wi-Fi తప్పనిసరి. కానీ ఇప్పుడు తాజాగా విడుదలైన Pixel 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఇకపై శాటిలైట్ ఆధారిత వాట్సాప్ వాయిస్, వీడియో కాలింగ్‌కు మద్దతు ఇవ్వనున్నాయి. ఈ ఫీచర్ 2025 ఆగస్టు 28 నుంచి యాక్టివ్ అవుతుంది.
శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా వాట్సాప్ కాలింగ్
ఇకపై Pixel 10, Pixel 10 Pro, Pixel 10 Pro XL, Pixel 10 Pro Fold యూజర్లు మొబైల్ నెట్‌వర్క్ లేకున్నా, Wi-Fi లేకున్నా కూడా వాట్సాప్ కాల్స్ చేయగలరు. కాల్ శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా కనెక్ట్ అవుతుంటే, ఫోన్ స్టేటస్ బార్‌లో ప్రత్యేక శాటిలైట్ ఐకాన్ కనిపిస్తుంది. ఇది యూజర్‌కి కాల్ కనెక్టివిటీ గురించి స్పష్టత ఇస్తుంది.

అయితే ఈ సౌకర్యం పూర్తిగా ఉచితం కాదని గూగుల్ ప్రకటించింది. ప్రారంభంలో ఎంపిక చేసిన క్యారియర్ నెట్‌వర్క్‌లలో మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. వినియోగదారులు అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఈ సదుపాయం ఓపెన్ స్కై ప్రదేశాలలో (అడవులు, పర్వతాలు, ఎడారులు, సముద్ర తీరాలు) మాత్రమే సరిగ్గా పనిచేస్తుందని వెల్లడించింది.
కేవలం కాల్స్ మాత్రమే కాదు, Pixel 10 సిరీస్ యూజర్లు శాటిలైట్ టెక్నాలజీ ద్వారా తమ లొకేషన్‌ను గూగుల్ మ్యాప్స్ లేదా ఫైండ్ హబ్‌కు పంపించవచ్చు. ఇది అత్యవసర పరిస్థితుల్లో సహాయానికి పిలిచేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ట్రెక్కింగ్, అడ్వెంచర్ ట్రిప్స్ చేసే వారు, లేదా సుదూర ప్రదేశాల్లో ప్రయాణించే వారు ఈ ఫీచర్‌తో నెట్‌వర్క్ లేకున్నా కనెక్ట్ అవగలరు.
Pixel 10 స్పెసిఫికేషన్స్..
డిస్‌ప్లే..
6.3 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్..
గూగుల్ టెన్సర్ G5
ఆపరేటింగ్ సిస్టమ్..
Android 16
RAM & స్టోరేజ్..
12GB LPDDR5X RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్
ఫ్రంట్ కెమెరా..
42MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ..
4970mAh బ్యాటరీ, 29W ఫాస్ట్ ఛార్జింగ్
#Pixel10 has you covered on and off the grid 📍 Pixel devices will be the first to offer voice and video calls on @WhatsApp over a satellite network starting 8/28¹ 🌍 pic.twitter.com/6yDSDMskkK
— Made by Google (@madebygoogle) August 22, 2025
Pixel 10 Pro & Pro XL - హై ఎండ్ ఫీచర్లతో..
Pixel 10 Pro, Pro XL వేరియంట్‌లు కెమెరా, ఇతర ఫీచర్ల పరంగా ఒకే విధంగా ఉండే అవకాశముంది. కానీ డిస్‌ప్లే పరిమాణం, బ్యాటరీ సామర్థ్యంలో మాత్రమే మార్పులు ఉంటాయి.
కెమెరా సెటప్ (రియర్):
50MP ప్రైమరీ కెమెరా
48MP టెలిఫోటో లెన్స్
48MP అల్ట్రా-వైడ్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 42MP
RAM & స్టోరేజ్..
12GB RAM, బహుశా 128GB/256GB వేరియంట్లు
బ్యాటరీ..
Pixel 10 Pro: 4870mAh
Pixel 10 Pro XL: 5200mAh
చార్జింగ్..
29W లేదా అంతకంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్
Pixel 10 Pro Fold..
ఈ మోడల్ ప్రత్యేకత ఫోల్డబుల్ డిజైన్. డ్యూయల్ డిస్‌ప్లే, అధునాతన కెమెరా సెటప్‌తో ఇది అత్యాధునిక వేరియంట్‌గా నిలవనుంది.
డిస్‌ప్లే..
6.4 అంగుళాల మినీ డిస్‌ప్లే (120Hz OLED ప్యానెల్)
రియర్ కెమెరా సెటప్..
48MP ప్రైమరీ కెమెరా
10.8MP టెలిఫోటో
10.5MP అల్ట్రా వైడ్ యాంగిల్
ఫ్రంట్ కెమెరాలు..
రెండు 10MP సెల్ఫీ కెమెరాలు (ఇనర్ & కవర్ డిస్‌ప్లే కోసం)
బ్యాటరీ..
5000mAh - పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ కంటే మెరుగైనది
ప్రాసెసర్ & OS..
టెన్సర్ G5, Android 16
ఇతర ముఖ్య విశేషాలు
డిజైన్ : పిక్సెల్ 10 సిరీస్ పాత మోడళ్లను పోలి ఉండేలా ఉన్నా, మూడవ వెనుక సెన్సార్, స్లిమ్ ఫ్రేమ్‌తో స్టైలిష్ లుక్‌ను కలిగి ఉంటుంది.
సెక్యూరిటీ : ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు
సాఫ్ట్‌వేర్ సపోర్ట్ : కనీసం 5 ఏళ్ల వరకు Android & సెక్యూరిటీ అప్‌డేట్స్
AI ఫీచర్లు : Google Gemini ఆధారిత ఇంటెలిజెంట్ ఫోటో ఎడిటింగ్, లైవ్ ట్రాన్స్క్రిప్ట్, మెరుగైన వాయిస్ టైపింగ్ వంటివి ఉన్నాయి.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications