"హానర్" నుంచి స్లిమ్మెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ " MAGIC V5 " లాంఛ్..!

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రోజుకో కొత్త ఫోన్ రిలీజ్ అవుతోంది. ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు కస్టమర్లను ఆకర్షించేందుకు దిగ్గజ కంపెనీలు సైతం పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సంస్థ "హానర్" సైతం కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లను రిలీజ్ చేస్తోంది. ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్ల విభాగంలోకి కూడా సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. "Magic V5" పేరుతో స్లిమ్మెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ను లాంఛ్ చేసింది.

ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త మైలురాయి..

ఇప్పటికే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు ప్రీమియమ్ కేటగిరీలోకి అడుగుపెట్టి, హై-ఎండ్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. బుక్-స్టైల్ డిజైన్‌లో వచ్చిన Honor Magic V5.. కేవలం పనితీరు విషయంలో మాత్రమే కాకుండా డిజైన్, తక్కువ బరువుతో ప్రత్యేకంగా నిలుస్తోంది. కేవలం 8.8మి.మీ మందం మాత్రమే ఉండటం వలన దీన్ని ప్రపంచంలోనే అత్యంత సన్నని, తేలికైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

honor-launches-slimmest-foldable-phone-magic-v5-and-specifications

Honor Magic V5 ఫీచర్లు..

డిజైన్..

  • Honor Magic V5 కేవలం సన్నని ఫోన్ మాత్రమే కాదు, మన్నికపరంగా కూడా బలంగా రూపొందించారు. ఈ ఫోల్డబుల్ ఫోన్‌కు IP58 + IP59 రేటింగ్ ఉండటంతో నీరు, దుమ్ము నుండి రక్షణ లభిస్తుంది.

డిస్‌ప్లే..

  • Honor Magic V5 ఫోన్ రెండు డిస్‌ప్లేలను కలిగి ఉంది.
  • బాహ్య స్క్రీన్: 6.43 అంగుళాల LTPO OLED డిస్‌ప్లే
  • అంతర్గత స్క్రీన్: 7.95 అంగుళాల 2K LTPO డిస్‌ప్లే
  • రెండు డిస్‌ప్లేలు కూడా 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించడం వలన స్క్రోలింగ్ అనుభవం, కలర్ విజువల్స్ అద్భుతంగా ఉంటాయని చెబుతున్నారు.

ప్రాసెసర్ & పర్ఫామెన్స్..

  • ఈ ఫోన్‌లో Qualcomm యొక్క yapdragon 8 Elite చిప్‌సెట్ తో పాటు Adreno 830 GPUను అందించారు. ఇది హై-ఎండ్ గేమింగ్, మల్టీటాస్కింగ్, వేగవంతమైన ప్రాసెసింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.

స్టోరేజ్ & ర్యామ్..

  • 16GB వరకు RAM
  • 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్
  • పెద్ద స్టోరేజ్ కాంబినేషన్ వలన హై-రిజల్యూషన్ వీడియోలు, భారీ ఫైల్స్, గేమ్స్ సులభంగా నిల్వ చేయవచ్చు.

కెమెరా..

  • 50MP ప్రైమరీ కెమెరా (f/1.6 ఎపర్చర్‌తో)
  • 50MP అల్ట్రా-వైడ్ లెన్స్
  • 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్‌తో)
  • సెల్ఫీల కోసం ప్రత్యేకంగా రెండు 20MP ఫ్రంట్ కెమెరాలు ఇచ్చారు.
  • ఇది వీడియో కాల్స్, ఫోటోలు, వ్లాగింగ్‌కు అదనపు ప్రయోజనం.
honor-launches-slimmest-foldable-phone-magic-v5-and-specifications

బ్యాటరీ..

  • ఫోన్‌లో 5,820mAh భారీ బ్యాటరీని అందించారు.
  • 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్
  • 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
  • పెద్ద బ్యాటరీతో పాటు వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ వలన ఎక్కువసేపు ఉపయోగించుకోవచ్చు.

ధర..

  • UKలో Honor Magic V5 ఒక్క వేరియంట్‌లో (16GB RAM + 512GB స్టోరేజ్) లాంచ్ అయింది.
  • ధర: GBP 1,699 (సుమారు రూ. 2,01,000)

కలర్స్..

  • బ్లాక్
  • డాన్ గోల్డ్
  • ఐవరీ వైట్

అయితే గత నెలలో చైనాలో మొదటిసారి ఈ ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో లాంచ్ కాగా, ధర CNY 8,999 (సుమారు రూ. 1,07,500)గా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+