ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ ఫీచర్లతో Honor Magic 8 Pro Air..
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు కస్టమర్లను ఆకర్షించేందుకు దిగ్గజ కంపెనీలు సైతం పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు లేటెస్ట్ గా కొత్త సెన్సేషన్ రాబోతోంది. హానర్ సంస్థ చైనా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన హానర్ మ్యాజిక్ 8 ప్రో ఎయిర్ మరియు హానర్ మ్యాజిక్ 8 RSR పోర్షే డిజైన్ మోడళ్లను త్వరలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.
అధికారిక లాంచ్‌కు ముందే, కంపెనీ టీజర్‌ల రూపంలో ఈ ఫోన్‌లకు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు, డిజైన్ హైలైట్స్‌ను క్రమంగా బయటపెడుతోంది. దీంతో టెక్ ప్రియుల్లో ఈ డివైజ్‌లపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఫోన్స్ అధునాతన సెన్సార్లతో టెక్నాలజీ మార్కెట్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించబోతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొబైల్స్ ఫీచర్స్ మీకోసం ప్రత్యేకంగా..

హానర్ మ్యాజిక్ 8 ప్రో ఎయిర్ ఫీచర్స్..
తాజా టీజర్ల ప్రకారం, మ్యాజిక్ 8 ప్రో ఎయిర్ లో హానర్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన 5,500mAh 'క్వింగ్‌హై లేక్' బ్యాటరీ ఇవ్వనుంది. ఇది స్లిమ్ ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో పెద్ద బ్యాటరీగా భావిస్తున్నారు. తక్కువ మందంతో ఉన్నప్పటికీ ఎక్కువ బ్యాటరీ బ్యాక్‌అప్ అందించడమే దీని ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
కెమెరా విభాగంలో ఈ ఫోన్ మరింత బలంగా కనిపిస్తోంది. ఇందులో 1/1.3 అంగుళాల మెయిన్ కెమెరా సెన్సార్, 64MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండనున్నట్లు హానర్ ధ్రువీకరించింది. దీని ద్వారా మెరుగైన నైట్ ఫోటోగ్రఫీ, లాంగ్-రేంజ్ జూమ్ సామర్థ్యాలు లభిస్తాయని అంచనా.
హానర్ మ్యాజిక్ 8 RSR పోర్షే డిజైన్ స్పెసిఫికేషన్లు..
డిజైన్ హైలైట్స్..
హానర్ మ్యాజిక్ 8 RSR పోర్షే డిజైన్ మోడల్ పూర్తిగా ప్రీమియం యూజర్లను టార్గెట్ చేస్తోంది. పోర్షే డిజైన్ బ్రాండింగ్‌తో వచ్చే ఈ ఫోన్ లగ్జరీ లుక్‌తో పాటు అత్యాధునిక టెక్నాలజీని అందించనుంది. కేవలం 6.1mm మందం, 155 గ్రాముల బరువుతో ఇది అత్యంత స్లిమ్, లైట్‌వెయిట్ ఫ్లాగ్‌షిప్‌గా నిలవనుంది.
వేరియంట్స్..
మ్యాజిక్ 8 ప్రో ఎయిర్ నాలుగు ర్యామ్-స్టోరేజ్ వేరియంట్లలో విడుదల కానుంది.
ప్రాసెసర్..
ఇందులో MediaTek Dimensity 9500 ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది.
కలర్స్..
రంగుల విషయంలో కూడా హానర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ ఫోన్ ఫెయిరీ పర్పుల్, లైట్ ఆరెంజ్, ఫీథర్ వైట్, షాడో బ్లాక్ వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి రానుంది.
కెమెరా..
ఈ మోడల్‌తో ప్రత్యేకంగా ఫోటోగ్రఫీ కిట్ కూడా ఇవ్వనున్నారు. ఇందులో అడాన్ టెలిఫోటో ఎక్స్‌టెండర్, ప్రొఫెషనల్ కెమెరా గ్రిప్ వంటి యాక్సెసరీలు ఉంటాయి. ఇది 2.35x టెలికన్వర్టర్ సపోర్ట్ చేయడమే కాకుండా, పరిశ్రమలోనే అత్యుత్తమంగా చెప్పుకునే CIPA 6.5-లెవెల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ను అందిస్తుందని హానర్ వెల్లడించింది. దీని వల్ల ప్రొఫెషనల్ స్థాయి ఫోటోలు, వీడియోలు తీయడం మరింత సులభమవుతుంది.
టాప్-ఎండ్ హార్డ్‌వేర్.. ప్రీమియం ఫీచర్లు
మూన్‌స్టోన్, స్లేట్ రంగుల్లో వచ్చే ఈ పోర్షే డిజైన్ మోడల్ గరిష్ఠంగా 24GB RAM వరకు సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఇది హై-ఎండ్ గేమింగ్, హెవీ మల్టీటాస్కింగ్‌కు అనువైన డివైజ్‌గా మారనుంది.
లాంచ్‌పై అంచనాలు
ప్రస్తుతం ఈ రెండు ఫోన్లు చైనా మార్కెట్‌కే పరిమితమయ్యే అవకాశమున్నప్పటికీ, గ్లోబల్ లాంచ్‌పై కూడా త్వరలో స్పష్టత రావచ్చని భావిస్తున్నారు. స్లిమ్ ఫ్లాగ్‌షిప్‌గా మ్యాజిక్ 8 ప్రో ఎయిర్, లగ్జరీ టెక్ ఫోన్‌గా మ్యాజిక్ 8 RSR పోర్షే డిజైన్ - ఈ రెండు మోడళ్లతో హానర్ ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయాలని చూస్తోంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications