200 ఎంపీ కెమెరాతో HONOR MAGIC V8.. లాంఛ్ ఎప్పుడంటే ??

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు కస్టమర్లను ఆకర్షించేందుకు దిగ్గజ కంపెనీలు సైతం పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు లేటెస్ట్ గా కొత్త సెన్సేషన్ రాబోతోంది. హానర్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ సిరీస్ హానర్ మ్యాజిక్ 8ను 2025 నాలుగో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ఆవిష్కరించనుంది. ఈ విషయాన్ని సంస్థ సిఎంఓ గువో రుయ్ అధికారికంగా ధృవీకరించారు. ఆయన మాట్లాడుతూ.. "రాబోయే HonorMagic8 AI నేటివ్ స్మార్ట్‌ఫోన్ Q4లో అత్యంత ముఖ్యమైన ఫ్లాగ్‌షిప్ అవుతుంది" అని పేర్కొన్నారు.

హానర్ మ్యాజిక్ 8 సిరీస్ AI-నేటివ్ స్మార్ట్‌ఫోన్ అనుభవం, 200MP కెమెరా.. అధునాతన సెన్సార్లతో టెక్నాలజీ మార్కెట్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించబోతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాగ్‌షిప్ లెవెల్ స్పెక్స్‌తో పాటు, AI లోతైన ఇంటిగ్రేషన్ ఈ సిరీస్‌ను ప్రత్యేకంగా నిలిపే అంశం కానుంది. మరీ ముఖ్యంగా 200MP కెమెరా అంశం స్మార్ట్ ఫోన్ ప్రియులను బాగా ఆకర్షిస్తోందని భావిస్తున్నారు.

honor-magic-v8-series-smart-phone-price-and-specifications-details

HONOR MAGIC V8 ఫీచర్లు..

AI బటన్..

మ్యాజిక్ 8 సిరీస్‌లో AI-నేటివ్ అనుభవం ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. కొత్తగా ఒక AI బటన్ను అందిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి, అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఫోన్ లో AI టెక్నాలజీని లోతుగా ఇంటిగ్రేట్ చేశారు. ఇది డివైస్‌లో అనేక పనులను ఆటోమేట్ చేస్తూ, వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. అదే విధంగా అధునాతన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) కూడా మ్యాజిక్ 8లో భాగం కానుంది. ఇది డివైస్‌ను స్మార్ట్ అసిస్టెంట్ స్థాయికి తీసుకువెళ్తుందని హానర్ ఆశిస్తోంది.

మోడల్స్..

మొదట మ్యాజిక్ 8, మ్యాజిక్ 8 ప్రో వేరియంట్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే, మ్యాజిక్ 8 అల్ట్రా, మ్యాజిక్ 8 మినీ 2026 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా.

రిలీజ్ డేట్..

ప్రస్తుతం అధికారిక రిలీజ్ డేట్ ప్రకటించలేదు. కానీ, టెక్ వర్గాల సమాచారం ప్రకారం, అక్టోబర్ మధ్యలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత ఏడాది మ్యాజిక్ 7 సిరీస్ అక్టోబర్ 2024 చివర్లో విడుదలైంది. కాబట్టి, మ్యాజిక్ 8 సిరీస్ కొద్దిగా ముందుగానే రావచ్చు.

కెమెరా..

హానర్ మ్యాజిక్ 8 సిరీస్ కెమెరా విభాగంలో భారీ మార్పులు తీసుకువస్తోంది. తాజా లీకుల ప్రకారం, ఈ సిరీస్‌లో 200MP ప్రైమరీ కెమెరా మరియు 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండే అవకాశముంది. ప్రత్యేకంగా, హానర్ మ్యాజిక్ 8 అల్ట్రాలో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ అమర్చబడనుందని తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒమ్నివిజన్ సెన్సార్ వాడుతున్నారని టిప్‌స్టర్లు చెబుతున్నారు. ఈ సెన్సార్ సైజ్ కూడా పెద్దదిగా ఉండే అవకాశం ఉంది.

మ్యాజిక్ V8 సిరీస్ & ఫోల్డబుల్స్..

హానర్ తన మ్యాజిక్ V8 సిరీస్ మరియు మ్యాజిక్ V6 ఫోల్డబుల్ ఫోన్ల్లో కూడా అదే స్థాయి కెమెరా అప్‌గ్రేడ్‌లు అందించబోతోంది. మ్యాజిక్ V8 సిరీస్లో 200MP ప్రైమరీ కెమెరా, అలాగే 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ అందించే అవకాశముంది.

మ్యాజిక్ V6 ఫోల్డబుల్ ఫోన్ కూడా 200MP ప్రధాన కెమెరాతో మార్కెట్లోకి రానుంది. ఇది ఇటీవల విడుదలైన మ్యాజిక్ V5కి అప్‌డేట్‌గా వస్తోంది. కాగా మ్యాజిక్ V5లో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్.. 64MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండేవి. ఇప్పుడు ఈ అప్‌గ్రేడ్‌లు ఫోటోగ్రఫీ అనుభవాన్ని గణనీయంగా మెరుగుపరచనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+