8300mAh బ్యాటరీ, దిమ్మతిరిగే ఫీచర్లతో HONOR X70..!
నేటి ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఒక వ్యసనం లాగా మారిపోయింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరలోనే ఫోన్లను అందించేందుకు కంపెనీలు సైతం పోటీ పడుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా హానర్ కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ HONOR X70ను చైనా మార్కెట్లో అధికారికంగా ప్రకటించింది.
8300mAh బ్యాటరీ సామర్థ్యం, IP69K రేటింగ్, గ్లోవ్ టచ్, బుల్లెట్‌ప్రూఫ్ డిజైన్ వంటి రేర్ ఫీచర్లతో HONOR X70 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భిన్నంగా నిలుస్తోంది. ఇది లాంగ్ లాస్టింగ్ పెర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్లకు బెస్ట్ చాయిస్ అయ్యే అవకాశముంది. దీని ప్రత్యేకతలు, ధరలు, లభ్యత సహా అన్ని వివరాలు ఓసారి చూద్దాం...

HONOR X70 స్పెసిఫికేషన్స్..
డిస్‌ప్లే..
6.79 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే (2640×1200 pixels)
120Hz రిఫ్రెష్ రేట్తో స్క్రోల్ చేసినప్పుడు నెమ్మదిగా కాకుండా స్మూత్‌గా కనిపిస్తుంది
3840Hz PWM డిమ్మింగ్ ఫ్లికర్ తగ్గించి కన్నులపై ఒత్తిడి తగ్గిస్తుంది
6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ - ఈ ఫీచర్ ధాటిగా ఎండలో కూడా ఫోన్ క్లియర్‌గా కనిపిస్తుంది
ప్రాసెసర్..
ఫోన్ Qualcomm Snapdragon 6 Gen 4 (4nm) చిప్‌సెట్‌తో పనిచేస్తోంది
మిడ్‌రేంజ్‌లో అద్భుతమైన పనితీరు, బ్యాటరీ ఎఫిషియెన్సీని అందిస్తుంది
బ్యాటరీ & ఛార్జింగ్..
8300mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ - ఇది ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ
6 సంవత్సరాల వరకు బ్యాటరీ పనితీరు నిలబడుతుంది
80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
టాప్ వేరియంట్‌లో 80W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది
RAM & స్టోరేజ్ ఆప్షన్లు..
8GB / 12GB RAM
128GB, 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లుగా లభిస్తుంది
UFS స్టోరేజ్ టెక్నాలజీ వాడటంతో డేటా రీడ్/రైట్ వేగంగా జరుగుతుంది
కెమెరాలు..
50MP ప్రైమరీ కెమెరా - OIS సపోర్ట్‌తో షేక్ లేకుండా ఫోటోలు వస్తాయి
8MP సెల్ఫీ కెమెరా - సరైన లైట్‌లో మంచి సెల్ఫీలను అందిస్తుంది
4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ - హైక్వాలిటీ వీడియోలు తీయవచ్చు
AI & స్పెషల్ ఫీచర్లు..
AI రెయిన్‌టచ్
గ్లోవ్ టచ్ - చేతిలో గ్లోవ్స్ ఉన్నా టచ్ స్క్రీన్ పని చేస్తుంది
బుల్లెట్‌ప్రూఫ్ వెస్ట్ స్ట్రక్చర్
2.5 మీటర్ల డ్రాప్ రెసిస్టెన్స్: యాక్సిడెంటల్ డ్రాప్స్ నుంచి రక్షణ
IP రేటింగ్..
ప్రపంచంలోనే మొదటిసారిగా IP69K రేటింగ్ ఉన్న ఫోన్
బాయిలింగ్ వాటర్, హై ప్రెషర్ వాటర్ స్ప్రేలను కూడా తట్టుకోగలదు
సెక్యూరిటీ & ఆడియో..
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
స్టీరియో స్పీకర్లు
USB Type-C ఆడియో సపోర్ట్
ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ కూడా ఉంది
కనెక్టివిటీ ఫీచర్లు..
5G సపోర్ట్
Wi-Fi 6
Bluetooth 5.3
Dual Frequency GPS (L1+L5)
NFC సపోర్ట్ - కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్‌కు ఉపయోగపడుతుంది
రంగులు..
బార్ రెడ్, బాంబో గ్రీన్, మూన్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ రంగులలో లభ్యం
డిజైన్..
ఫోన్ వెయిట్ కేవలం 199 గ్రాములు
మందం 8mm కంటే తక్కువ - బ్యాటరీ పెద్దదైనా స్లిమ్ డిజైన్‌ను అందించింది
ధర & లభ్యత (చైనా మార్కెట్)..
8GB + 128GB - ¥1399 (సుమారు రూ.16,760)
8GB + 256GB - ¥1599 (సుమారు రూ.19,155)
12GB + 256GB - ¥1799 (సుమారు రూ.21,550)
12GB + 512GB - ¥1999 (సుమారు రూ.23,950)
అమ్మకాలు జూలై 18 నుంచి చైనాలో ప్రారంభం












Click it and Unblock the Notifications