Gmail ఐడీ నచ్చలేదా? ఈ సింపుల్ ట్రిక్ తో వెంటనే యూజర్ నేమ్ ఛేంజ్

చాలా ఏళ్ల క్రితం సరదాగానో లేదా అవగాహన లేకనో పెట్టుకున్న జీ మెయిల్ యూజర్ నేమ్‌లు ఇప్పుడు మీ ప్రొఫెషనల్ లైఫ్‌కు అడ్డంకిగా మారాయా? ఆ పాత ఈ మెయిల్ ఐడీని ఎవరికైనా చెప్పాలంటే ఇబ్బందిగా అనిపిస్తోందా? అయితే మీ కోసం గూగుల్ ఒక అద్భుతమైన వార్తను మోసుకొచ్చింది. ఇప్పటి వరకు మార్చుకోవడానికి వీలులేని జీ మెయిల్ యూజర్ నేమ్‌ను ఇకపై సులభంగా మార్చుకునే సదుపాయాన్ని గూగుల్ అందుబాటులోకి తెచ్చింది.

గత ఏడాది నుంచే ఈ ప్రక్రియపై కసరత్తు చేసిన గూగుల్, ప్రస్తుతం అమెరికాలోని వినియోగదారులకు ఈ ఫీచర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర వినియోగదారులకు కూడా విస్తరించే అవకాశం ఉంది.

How to Change Your Gmail Username Without Losing Data Google Introduces New Email Identity Feature 2026

డేటా భద్రతపై ఆందోళన వద్దు,

సాధారణంగా ఈ మెయిల్ ఐడీ మారిస్తే పాత మెయిల్స్, కాంటాక్ట్స్ లేదా గూగుల్ డ్రైవ్‌లోని డేటా పోతుందేమోనన్న భయం వినియోగదారుల్లో ఉంటుంది. కానీ, ఈ అప్‌డేట్ విషయంలో గూగుల్ స్పష్టమైన హామీ ఇస్తోంది. మీ యూజర్ నేమ్ మారినప్పటికీ, మీ డేటా మొత్తం సురక్షితంగా ఉంటుంది. గూగుల్ ఫోటోలు, మెసేజ్‌లు, డ్రైవ్ ఫైల్స్ అన్నీ యథాతథంగా కొనసాగుతాయి.

విశేషమేమిటంటే, మీరు కొత్త ఐడీకి మారిన తర్వాత కూడా పాత ఈ మెయిల్ అడ్రస్ 'ఆల్టర్నేట్ ఈ మెయిల్'గా పని చేస్తుంది. అంటే, ఎవరైనా మీ పాత ఐడీకి మెయిల్ పంపినా, అది మీ కొత్త ఇన్‌బాక్స్‌కే చేరుతుంది. లాగిన్ అవ్వడానికి కూడా మీరు రెండు ఐడీలను ఉపయోగించుకోవచ్చు.

యూజర్ నేమ్ మార్చుకోవడం ఎలా?

మీరు ఈ మార్పుకు అర్హులైతే, ఈ క్రింది దశల ద్వారా మీ జీ మెయిల్ ఐడీని మార్చుకోవచ్చు:

  • ముందుగా మీ ఫోన్ లేదా కంప్యూటర్ లో myaccount.google.com/google-account-email లింక్‌ను ఓపెన్ చేయండి.
  • అందులో 'పర్సనల్ ఇన్ఫో' (Personal Info) సెక్షన్‌కు వెళ్లి, 'ఈ మెయిల్' ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • అక్కడ 'గూగుల్ అకౌంట్ ఈ మెయిల్' పై క్లిక్ చేయండి. మీకు మార్చుకునే అవకాశం ఉంటే, పక్కనే ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది.
  • మీకు నచ్చిన కొత్త యూజర్ నేమ్‌ను ఎంచుకుని, గూగుల్ సూచనలను అనుసరిస్తూ మార్పును ఖరారు చేయండి.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు:

  • పరిమితులు: ఒకసారి కొత్త ఐడీని సృష్టించుకున్నాక లేదా ఉన్నదాన్ని తొలగించినా.. మళ్ళీ కొత్తది మార్చుకోవడానికి 12 నెలల సమయం పడుతుంది.
  • బ్యాకప్: క్రోమ్‌బుక్ లేదా థర్డ్ పార్టీ యాప్స్ వాడే వారు మార్పుకు ముందు ఒకసారి డేటా బ్యాకప్ తీసుకోవడం మంచిదని గూగుల్ సూచిస్తోంది.
  • లభ్యత: ప్రస్తుతానికి అమెరికాలోని ఎంపిక చేసిన ఖాతాదారులకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది.

పాత, ఇబ్బందికరమైన ఈమెయిల్ ఐడీల నుండి విముక్తి పొంది, ప్రొఫెషనల్ ఐడీలతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+