"నథింగ్ ఫోన్ 3 "పై భారీ డిస్కౌంట్.. రూ.35 వేలు తగ్గింపు !

టెక్‌ మార్కెట్లో కొత్తగా అడుగుపెట్టినప్పటి నుంచి "నథింగ్‌" సంస్థ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. స్పెషల్ డిజైన్‌ తో కస్టమర్లను ఆకర్షిస్తున్న ఈ ఫోన్ ఇప్పటికే సపరేట్ ఫ్యాన్‌ బేస్‌ ఏర్పరుచుకుంది. "నథింగ్ ఫోన్ 1, ఫోన్ 2"లతో మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఒక బలమైన ఇంపాక్ట్ సృష్టించింది. ఇక ప్రీమియం సెగ్మెంట్‌లో సైతం " నథింగ్ ఫోన్ 3 " తో అడుగుపెట్టింది.

2025 జూలైలో భారతదేశంలో విడుదలైన నథింగ్ ఫోన్ 3.. ఫ్లాగ్‌షిప్‌ రేంజ్ లో మంచి సేల్స్ రాబట్టింది. రూ. 84,999 ధరతో లాంఛ్ అయిన ఈ ఫోన్.. యాపిల్‌ ఐఫోన్ 16, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25, గూగుల్ పిక్సెల్ 10 వంటి టాప్ బ్రాండ్‌లకు పోటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. దాదాపు రూ.35 వేలు భారీ తగ్గింపు ఇవ్వడంతో మరోసారి టెక్ ప్రియులు ఈ ఫోన్ మీద ఫోకస్ పెట్టారు.

huge-discount-on-nothing-phone-3-at-amazon-and-news-got-viral

భారీ డిస్కౌంట్ ఆఫర్..

కాగా లాంచ్ అయ్యి కొన్ని నెలలు గడవకముందే.. ఇప్పుడు ఈ ఫోన్ ఆన్‌లైన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం అమెజాన్‌లో దాదాపు రూ. 44,900కి ఉంచారు. అంటే లాంచ్ ప్రైస్‌తో పోలిస్తే దాదాపు రూ. 35,000 తక్కువ. అయితే ఈ డీల్ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. వినియోగదారులు సేఫ్టీ కోసం అధికారిక విక్రేత లేదా నథింగ్ వెబ్‌సైట్ ద్వారానే కొనుగోలు చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.

నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్స్..

డిస్‌ప్లే..

6.7 అంగుళాల OLED డిస్‌ప్లే

120Hz రిఫ్రెష్ రేట్ - గేమింగ్‌, స్క్రోలింగ్‌, వీడియో అనుభవం స్మూత్‌గా ఉంటుంది.

ప్రాసెసర్..

తాజా Qualcomm Snapdragon 8s Gen 4 చిప్‌సెట్

హై-పర్ఫార్మెన్స్ & పవర్ ఎఫిషియన్సీ రెండింటినీ అందిస్తుంది.

మెమరీ & స్టోరేజ్..

12GB / 16GB RAM

256GB / 512GB స్టోరేజ్ ఆప్షన్లు

కెమెరా..

ట్రిపుల్ రియర్ కెమెరా సెట్‌ప్

50MP వైడ్ సెన్సార్

50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్

50MP అల్ట్రా వైడ్ లెన్స్

32MP ఫ్రంట్ కెమెరా - సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం.

బ్యాటరీ & ఛార్జింగ్..

5500mAh బ్యాటరీ

65W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్

బాక్స్‌లో చార్జర్ ఇవ్వలేదు (ఇండస్ట్రీలో పెరుగుతున్న ట్రెండ్‌ను అనుసరించారు).

డిజైన్ & గ్లిఫ్ ఇంటర్‌ఫేస్..

నథింగ్ ప్రత్యేకత అయిన గ్లిఫ్ లైట్ సిస్టమ్ ఈసారి మరింత అప్‌గ్రేడ్ అయ్యి గ్లిఫ్ మ్యాట్రిక్స్ రూపంలో వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+