Starlink ఇంటర్నెట్- అంతెక్కడ కడతాం- మన వల్ల కాదులెండి
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ స్టార్‌లింక్.. భారత్ లో అడుగు పెట్టింది. దేశీయ మార్కెట్ కోసం తమ ప్లాన్‌లను అధికారికంగా వెల్లడింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే విస్తృతంగా ప్రాచుర్యం పొందిన స్టార్‌లింక్ సేవలు భారత్ లో ప్రారంభం కావడంపై ఇప్పటివరకు నెలకొన్న అనిశ్చితికి తెరదించినట్టయింది దీంతో.
స్టార్ లింక్ బ్రాండ్ బాండ్/ఇంటర్నెట్ సేవలు చౌకగా లభించవచ్చని ఆశించినప్పటికీ-అది వాస్తవరూపం దాల్చలేదు. అత్యంత ఖరీదైనవి. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ ప్రొవైడర్లతో పోల్చుకుంటే దీని రేటే అధికంగా కనిపిస్తోంది. స్టార్‌లింక్ ఇండియా వెబ్‌సైట్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం చూసుకుంటే- ఈ ప్లాన్‌లు నెలకు 8,600 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. ఇది బేసిక్ ప్లాన్.

వినియోగదారులు నెలవారీ ప్లాన్‌కు అదనంగా ఇంటర్నెట్ హార్డ్‌వేర్ కిట్ కోసం 34,000 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ కిట్‌ను కొనుగోలు చేసిన తర్వాత, కస్టమర్లు తామే సొంతంగా, సులభంగానే దీన్ని సెటప్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాలేషన్ పూర్తయిన వెంటనే ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. హార్డ్ వేర్ కిట్ యాక్టివేట్ అవుతుంది. 99.9 శాతం అప్‌టైమ్‌తో ఇంటర్నెట్/బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తాయని స్టార్‌లింక్ తెలిపింది. ఇంటర్నెట్ అంతరాయాలకు ఎటువంటి ఆస్కారం లేదని ధీమా వ్యక్తం చేసింది.
ఉపగ్రహాలపై ఆధారపడిన ఇంటర్నెట్ సర్వీస్ కావడం వల్ల ఎటువంటి అంతరాయం ఉండబోదని స్టార్ లింక్ చెబుతోంది. నేరుగా శాటిలైట్ నుండే ఈ సేవలను అందుతాయని, దేశంలోని ఏ మారుమూల ప్రాంతం నుండి అయినా దీన్ని వినియోగించుకోవచ్చని వివరించింది. ప్రస్తుతం ఈ సేవలు కొన్ని పరిమిత ప్రదేశాలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 30 రోజుల ట్రయల్ వ్యవధిలో కస్టమర్లకు అపరిమిత డేటా లభిస్తుందిది.
వినియోగదారులు స్టార్‌లింక్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ప్లాన్‌లు, ఆఫర్‌లు, లభ్యతను తెలుసుకోవచ్చు. పిన్ కోడ్ ఆధారంగా వేర్వేరు ప్లాన్‌లు, ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ప్రకటించిన ఈ ప్లాన్‌లన్నీ కూడా గృహావసర వినియోగదారుల కోసం మాత్రమే ఉద్దేశించినవి. వాణిజ్య అవసరాలకు అవి ఉపయోగపడవు. దీనికి సంబంధించిన మరో ప్యాకేజీని త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది స్టార్‌లింక్.
ఈ రోమింగ్ ప్లాన్ కింద వినియోగదారులు యాంటెన్నా కిట్‌ను తమతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. కారుపైన కూడా సులభంగా అమర్చవచ్చు. భారత్ లో కంపెనీ ఏయే నిర్దిష్ట సేవలను అందిస్తుందనే దానిపై పూర్తి స్పష్టత ఇంకా రాలేదు. సేవలు అందుబాటులోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా సమాచారం అందించడానికి వినియోగదారులు తమ ఈమెయిల్ ఐడీని స్టార్‌లింక్ ఇండియా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కంపెనీ సూచించింది.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications