Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇస్రో రెండవ అంతరిక్ష కేంద్రం సిద్ధం:ఇకపై అక్కడి నుంచి కూడా రాకెట్ ప్రయోగాలు..!

దేశంలో రెండో రాకెట్ ప్రయోగ వేదికగా తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా, కులశేఖరపట్నం సిద్ధమవుతోంది. ఇస్రో ఛైర్మన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కొత్త లాంచ్ కాంప్లెక్స్ నిర్మాణం డిసెంబర్ 2026 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ప్రయోగ కేంద్రం నుంచి ఏడాదికి సుమారు 20 నుంచి 25 రాకెట్లను ప్రయోగించవచ్చని ఆయన తెలిపారు.

కులశేఖరపట్నంలో ఏర్పాటు చేస్తున్న ఈ రెండో లాంచ్ కాంప్లెక్స్ గురించి ఇస్రో ఛైర్మన్ మాట్లాడుతూ,ఇక్కడి నుంచి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను ప్రయోగిస్తామని చెప్పారు.ఈ SSLVలు 500 కిలోల బరువు గల ఉపగ్రహాలను 400 కిలోమీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్లగలవు.

India s Second Spaceport Unveiled Kulasekarapattinam to Launch 25 Rockets Annually

2,300 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. దేశంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఒక రాకెట్ ప్రయోగ కేంద్రం ఉన్న సంగతి తెలిసిందే. శ్రీహరికోట నుంచి భారీ రాకెట్లు అయిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV),జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV)లను ప్రయోగిస్తారు. ఇవి లోతైన అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలకు ఉపయోగిస్తారు.

ఈ లాంచ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి సీనియర్ అధికారులు, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఏ. రాజరాజన్,ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.కులశేఖరపట్నం ఒకప్పుడు పాండ్య రాజుల కాలంలో వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి పొందిన ఒక తీరప్రాంత గ్రామం.

తమిళనాడు ప్రభుత్వం నుంచి స్పేస్ ఇండస్ట్రియల్ పార్క్

ఇదే సమయంలో, తమిళనాడు ప్రభుత్వం కులశేఖరపట్నం సమీపంలో స్పేస్ ఇండస్ట్రియల్ అండ్ ప్రొపెలెంట్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేస్తోంది.తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TIDCO) ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది.అంతరిక్ష రంగం, ప్రొపెలెంట్ అభివృద్ధికి సంబంధించిన పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ పార్క్ లక్ష్యం.

2,000 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ పార్క్,ఇస్రో యొక్క రెండో రాకెట్ ప్రయోగ కేంద్రానికి అనుబంధంగా ఉంటుంది. ఇది అంతరిక్ష సాంకేతిక రంగంలోని ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించనుంది. తమిళనాడు స్పేస్ ఇండస్ట్రియల్ పాలసీ 2025కి అనుగుణంగా, అంతరిక్ష సాంకేతికతకు ఒక ముఖ్య కేంద్రంగా ఎదగాలనే తమిళనాడు ప్రభుత్వ లక్ష్యంలో ఇది ఒక భాగం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+