రూ.15,999 కే అదిరిపోయే ఫీచర్లతో Infinix Note 50s 5G..
ప్రస్తుతం 5జీ టెక్నాలజీ దూసుకుపోతున్న తరుణంలో మార్కెట్లో 5G ఫోన్ల డిమాండ్ గట్టిగానే ఉంది. కస్టమర్లను పెంచుకోవడానికి ప్రముఖ కంపెనీలు కూడా తక్కువ బడ్జెట్ లో సైతం అదిరిపోయే ఫీచరను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే టెక్ ప్రపంచాన్ని ఆకట్టుకునేందుకు Infinix తాజాగా "Note 50s 5G" మోడల్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మిడిల్-రేంజ్ ధరలో ప్రీమియం ఫీచర్లను ఈ ఫోన్ లో అందిస్తుండడంతో ఈ ఫోన్ పై మార్కెట్లో మంచి బాజ్ ఏర్పడింది. ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటో ఓసారి చూసేద్దాం..
Infinix Note 50s 5G+ ఫీచర్లు...
డిస్‌ప్లే..
Note 50s 5G+ మోడల్ 6.78 అంగుళాల FHD+ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వస్తోంది. 144Hz రిఫ్రెష్ రేట్, 100% DCI-P3 కలర్ గామట్, 10-బిట్ కలర్ డెప్త్ వంటి ఫీచర్లతో లభిస్తుంది. Gorilla Glass 5 ఫోన్ స్క్రీన్‌ను సెక్యూర్ గా ఉంచడమే కాకుండా గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటి యాక్టివిటీలకు మంచి అనుభూతిని ఇస్తుంది.

ప్రాసెసర్..
MediaTek Dimensity 7300 Ultimate ప్రాసెసర్, Mali-G615 GPUను ఉపయోగించారు. గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన MediaTek HyperEngine టెక్నాలజీ తో ఈ స్మార్ట్ ఫోన్ రాబోతుంది.
AI అసిస్టెంట్..
ఈ ఫోన్ Android 15 ఆధారంగా తయారైన XOS 15 UI పై నడుస్తోంది. Folax Voice Assistant సాయంతో వాయిస్ రూపొందించారు. AI Wallpaper Generator ద్వారా ప్రతి రోజు ఫోన్‌కు నూతన లుక్ ఇవ్వొచ్చు. AI Writing Assistant ద్వారా నోట్స్ కూడా రాయొచ్చు.
కెమెరా..
infinix Note 50s 5G+ లో 64MP Sony IMX682 మెయిన్ కెమెరా ఉండగా, 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. 4K వీడియో రికార్డింగ్, 10x డిజిటల్ జూమ్, AI Eraser, AIGC మోడ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
స్టోరేజ్..
8GB RAM + 128GB, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది.
బ్యాటరీ..
5500mAh భారీ బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. బైపాస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
కలర్స్..
Marine Drift Blue, Titanium Grey, Burgundy Red రంగులలో అందుబాటులో ఉంది.
ధరలు..
8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర ₹15,999
8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర ₹17,999
బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి Infinix Note 50s 5G మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు!












Click it and Unblock the Notifications