Instagram Update: అదిరిపోయే ఈ ఫీచర్. ఇక నుంచి టీవీలో రీల్స్.
ఇన్‌స్టాగ్రామ్‌ను ఓపెన్ చేస్తే వ్యూస్ పెంచే హ్యాష్‌ట్యాగ్‌లే రాజ్యమేలుతున్న రోజులు ఇక ముగియబోతున్నాయా? కంటెంట్ నాణ్యతే అసలైన ప్రమాణమని చెప్పేలా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టిందా?. హ్యాష్‌ట్యాగ్‌లపై లిమిట్స్ పెట్టడంతో ఆగకుండా.. అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ను టీవీకి లింక్ చేయబోతుందా? యూజర్ల అనుభవాన్ని కొత్త దశకు తీసుకెళ్లే ఫీచర్లు ఇప్పుడు మీ కోసం
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ యూజర్లను మరింత ఎక్సైజ్ మెంట్ కు ఫీల్ అయ్యేలా మరోసారి కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. కంటెంట్ క్వాలిటీపై మరింత దృష్టి సారిస్తున్న ఇన్‌స్టాగ్రామ్, తాజాగా హ్యాష్‌ట్యాగ్‌లపై పరిమితి విధించింది. దీంతో ఇకపై రీల్స్, పోస్టులకు గరిష్ఠంగా ఐదు హ్యాష్‌ట్యాగ్‌లను మాత్రమే ఇవ్వగలం.
ఇప్పటివరకు కంటెంట్‌కు సంబంధం లేకుండా పెద్ద సంఖ్యలో హ్యాష్‌ట్యాగ్‌లు వాడుతూ వచ్చాం. వ్యూస్ కోసం విపరీతంగా చేసిన ఈ ప్రయత్నాలకు చెక్ పెట్టేసింది. ఫలితంగా ఒరిజినల్ కంటెంట్‌కు ప్రాధాన్యం పెరగనుందని ఇన్‌స్టాగ్రామ్ భావిస్తుంది. యూజర్లకు అవసరమైన సమాచారం, సృజనాత్మకత ఉన్న పోస్టులకే ఇకపై ఎక్కువ రీచ్ వచ్చే అవకాశముందని ఇన్‌స్టాగ్రామ్ స్పష్టం చేస్తోంది.

టీవీల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్..
ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు, డెస్క్‌టాప్‌లకే పరిమితమైన ఇన్‌స్టాగ్రామ్ వినియోగం... ఇకపై టీవీలకూ విస్తరించనుంది. ఇందుకోసం ఇన్‌స్టాగ్రామ్, అమెజాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అమెరికాలోని కొన్ని ఎంపిక చేసిన అమెజాన్ ఫైర్ టీవీల్లో 'Instagram for TV' యాప్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.
ఈ యాప్‌ను అమెజాన్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని లాగిన్ కావచ్చు. ఒకే డివైస్‌లో గరిష్ఠంగా ఐదు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను లాగిన్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే టీవీల్లో ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించేటప్పుడు రీల్స్ వీక్షణకు మాత్రమే అవకాశం ఉండగా, పోస్టులు చేయడం లేదా మెసేజ్‌లు పంపే ఫీచర్లు అందుబాటులో ఉండవు.
నో డిలీట్.. ఓన్లీ ఆర్చివ్..
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఉన్న ఓ ఉపయోగకరమైన ఫీచర్ గురించి చాలా మందికి పూర్తిగా అవగాహన లేదు. అదే Archive ఫీచర్. ఈ సదుపాయం ద్వారా యూజర్లు తమ పాత పోస్టులను డిలీట్ చేయకుండానే ఫాలోవర్స్‌కు కనిపించకుండా దాచుకోవచ్చు. దీని వల్ల పోస్టులు అకౌంట్ నుంచి తొలగిపోకుండా, పూర్తిగా ప్రైవేట్‌గా సేవ్ అవుతాయి.
Archive ఫీచర్ ఎలా ఉపయోగించాలి?
ఈ ఫీచర్‌ను వినియోగించుకోవడం చాలా సులభం. ముందుగా ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి, మీరు దాచాలనుకుంటున్న పోస్ట్ వద్దకు వెళ్లాలి. ఆ పోస్ట్ పైభాగంలో కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేసి 'Archive' ఆప్షన్‌ను ఎంచుకుంటే, ఆ పోస్ట్ వెంటనే హైడ్ అవుతుంది. ఇది డిలీట్ కాకుండా, మీ అకౌంట్‌లో ప్రైవేట్‌గా సేవ్ అవుతుంది. Archive చేసిన పోస్టులను తిరిగి చూడాలంటే Settings & Activity → Archive అనే ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ మీకు దాచిన అన్ని పోస్టులు కనిపిస్తాయి. అవసరమైతే మళ్లీ ఆ పోస్టును పబ్లిక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.
పాత పోస్టులు కనిపించకూడదని భావించే వారికి, ముఖ్యంగా మహిళలకు ప్రైవసీ పరంగా ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా మారనుంది. గతంలో షేర్ చేసిన కంటెంట్‌ను పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేకుండా, అవసరమైనప్పుడు మాత్రమే చూపించే స్వేచ్ఛను ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్ ద్వారా కల్పిస్తోంది.
-
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications