iPhone 16 Pro బంపర్ ఆఫర్స్: దీపావళి సందర్భంగా బెస్ట్ డీల్స్..!!
మరో వారం రోజుల్లో దీపావళి పండగ రాబోతోంది. ఇప్పటికే మార్కెట్లు ఆఫర్లతో వినియోగదారులను కట్టిపడేస్తున్నాయి.దీపావళి సందర్భంగా ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటివి ఆఫర్లతో ఊదరగొట్టేస్తున్నాయి. ఫీచర్ ఫోన్ నుంచి ఐఫోన్ వరకు బంపర్ ఆఫర్స్ ప్రకటించాయి. తాజాగా స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో ఈ - కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో ఆపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ 16 ప్రోపై బంపర్ ఆఫర్ ప్రకటించాయి.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయినప్పటికీ స్మార్ట్ ఫోన్ లవర్స్ మాత్రం ఐఫోన్ 16 ప్రో వైపే మొగ్గు చూపుతున్నారు. దీనికి ఇంకా పోటీ తగ్గలేదు సరికదా.. డిమాండ్ పెరిగిపోతోంది.6.3 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ల్పే ఉన్న ఐఫోన్ 16 ప్రో... ప్రో మోషన్ టెక్నాలజీ ద్వారా 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేటుతో విజువల్స్‌ను అందిస్తోంది. ఇక మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడి వాడి విసుగెత్తిపోయి ఆపిల్ ఐఫోన్‌ను ట్రై చేయాలంటే ఈ పండగ సీజన్ మీకు సరైన సమయం అని చెప్పాలి. ఐఫోన్లపై బెస్ట్ డిస్కౌంట్స్ ఇచ్చే ఐదు ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు ఇవే..!

1. ఫ్లిప్‌కార్ట్ (Flipkart)
- ధర: ₹1,19,900 నుండి తగ్గింపు ధర ₹1,04,999.
- బ్యాంక్ ఆఫర్: Flipkart Axis క్రెడిట్ కార్డుపై అదనంగా ₹4,000 తగ్గింపు.
- ఎక్స్ఛేంజ్ ఆఫర్: పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే ₹61,900 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది.
2. బిగ్‌బాస్కెట్ (BigBasket)
- వేరియంట్ & ధర: 128GB వేరియంట్ ₹99,990 ధరకే లభిస్తోంది.
- ప్రత్యేకత: ఈ లిస్ట్‌లో ఉన్న అత్యంత బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ ఇదే.
3. క్రోమా (Croma)
- ధర: 256GB వేరియంట్ ధర ₹1,13,490.
- ముఖ్యాంశం: నమ్మకమైన రిటైల్ అనుభవం కోసం చూసేవారికి ఇది మంచి ఎంపిక.
4. విజయ్ సేల్స్ (Vijay Sales)
- ధర: 256GB మోడల్ ధర ₹1,14,900.
- బ్యాంక్ ఆఫర్: EMI రహిత ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు చెల్లింపులపై తక్షణమే ₹5,000 డిస్కౌంట్ లభిస్తుంది.
5. రిలయన్స్ డిజిటల్ (Reliance Digital)
- ధర: 256GB వేరియంట్ ధర ₹1,19,900.
గమనిక: ప్రస్తుతం డిస్కౌంట్ లేనప్పటికీ, అదనపు బ్యాంక్ ఆఫర్‌ల కోసం మీరు చెక్ చేయవచ్చు.












Click it and Unblock the Notifications