Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

iPhone 17 Pro Max ఆదేశం వెళ్లి కొనొచ్చినా ఇంకా డబ్బులు మిగులుతాయి..!!

iPhone 17 Pro Max:ఏటా కొత్త ఐఫోన్‌లు విడుదల కాగానే వాటి ధరలపై ఒక చర్చ మొదలవుతుంది.ఈసారి కూడా అదే జరిగింది. 'ఐఫోన్ 17' సిరీస్ విడుదల కాగానే, దాని ధరలపై చర్చలు, జోకులు,సోషల్ మీడియాలో మీమ్‌లు మొదలయ్యాయి. ముఖ్యంగా భారత్‌లో ఐఫోన్‌ల ధరలు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉండటం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.

భారత్‌లో ఐఫోన్ 17 సిరీస్ కొనడంకంటే.. ఆ డబ్బులతో దుబాయ్‌కి వెళ్లి అక్కడ ఐఫోన్ కొని మిగిలిన డబ్బులతో విమాన ఛార్జీలు పెట్టుకుని భారత్‌కు తిరిగి రావొచ్చు. ఇలా వచ్చినా కూడా ఇంకా మన దగ్గర డబ్బులు మిగులుతుంది. ఇది ఆశ్చర్యానికి గురి చేసే విషయం. కానీ లెక్క చూస్తే ఇది నిజమే కదా అనిపిస్తుంది.

iphone-17-price-sensation-the-delhi-dubai-trip-that-actually-saves-you-money

ఎందుకు ఇంత తేడా?
భారతదేశంలో 'ఐఫోన్ 17' ధర రూ. 82,900 నుంచి మొదలవుతుంది. మొదటిసారి వచ్చిన 'ఐఫోన్ ఎయిర్' ధర రూ. 1,19,000, 'ఐఫోన్ 17 ప్రో' ధర రూ. 1,34,900. ఇక 'ఐఫోన్ 17 ప్రో మాక్స్' ధర రూ. 1,49,900గా ఉంది.

దుబాయ్, అమెరికా వంటి దేశాల్లో ఐఫోన్ల ధరలు తక్కువగా ఉంటాయన్నది తెలిసిందే. ఈసారి కూడా అదే కొనసాగింది. ఇప్పుడు ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లి 'ఐఫోన్ 17 ప్రో మాక్స్' ఎలా కొనుగోలు చేస్తే డబ్బులు ఆదా అవుతాయో చూద్దాం.

దుబాయ్‌లో ఐఫోన్ కొనడం ఎలా చవక?
రెండు వైపులా విమాన టికెట్ ఖర్చును కూడా కలుపుకుని ఈ లెక్క వేసుకున్నా, దుబాయ్‌లో ఐఫోన్ కొనడం చౌకగానే తేలింది.

  • దుబాయ్ (యూఏఈ)లో 'ఐఫోన్ 17 ప్రో మాక్స్' ధర 5,099 AED. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 1,22,500.
  • భారతదేశంలో దీని ధరతో పోలిస్తే, ఏకంగా రూ. 27,400 తక్కువ!

విమాన ప్రయాణంతో ఖర్చు ఎంత?

  • స్కైస్కానర్ వెబ్‌సైట్ ప్రకారం, ఢిల్లీ నుంచి దుబాయ్‌కు రౌండ్-ట్రిప్ విమాన టికెట్ ధర సుమారు రూ. 22,619.
  • ఈ విమానం సెప్టెంబర్ 19న (అంటే ఐఫోన్ అమ్మకాలు మొదలైన రోజు) బయలుదేరి, మరుసటి రోజు తిరిగి వస్తుంది.
  • విమాన టికెట్ ఖర్చు (రూ. 22,619) మరియు ఫోన్ ధర (రూ. 1,22,500) రెండూ కలిపితే మొత్తం రూ. 1,45,119 అవుతుంది.
  • అంటే, ఢిల్లీలో రూ. 1,49,900 పెట్టి అదే ఫోన్‌ను కొనడం కంటే, దుబాయ్ వెళ్లి కొంటే రూ. 4,781 ఆదా అవుతుంది.

ఈ లెక్క కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఐఫోన్ కొనడానికి మరొక దేశానికి వెళ్లాలని సూచించడం లేదు. కానీ మనదేశంలో ఐఫోన్‌ల ధరలు ఎంత ఎక్కువగా ఉన్నాయో తెలియజేస్తుంది.పన్నులు,కస్టమ్స్ సుంకాలు వంటి అనేక అంశాలు ఆయా దేశాల్లో ఐఫోన్‌ల ధరలను ప్రభావితం చేస్తాయి.ఈ లెక్కలో భోజనం, వసతి,ప్రయాణ ఖర్చులు వంటివి కలపలేదు.

ఈ ధరల వ్యత్యాసం దుబాయ్‌తోనే కాదు,జపాన్, థాయ్‌లాండ్,వియత్నాం వంటి దేశాలతో పోల్చినా కనిపిస్తుంది.ఉదాహరణకు,హాంకాంగ్‌లో ఐఫోన్ 17 ప్రో మాక్స్ భారత్‌లో కంటే సుమారు రూ.34,300 తక్కువగా ఉంది.అయితే అమెరికాలో కొనేటప్పుడు,అక్కడ ఉండే అమ్మకపు పన్ను (5-10 శాతం)కూడా ధరలో కలుస్తుందని గుర్తుంచుకోవాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+