Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గేమింగ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. పిచ్చెక్కించే ఫీచర్స్‌తో iQOO 15 !!

గేమింగ్ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న iQOO 15 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కి రెడీ అవుతోంది. వచ్చే నెల అక్టోబర్‌లో చైనా మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. ఆ తర్వాత డిసెంబర్ 2025లో భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. iQOO 13 విడుదలైన దాదాపు సంవత్సరం తర్వాత ఈ కొత్త మోడల్ రానుండటం టెక్‌ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దాంతో ఈ స్మార్ట్ ఫోన్ కోసం లాంచ్‌కు ముందే ఫోన్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

కొత్త డిజైన్, కలర్ చేంజింగ్ ప్యానెల్, RGB లైటింగ్, పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 2K OLED డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్, 7,000mAh బ్యాటరీ వంటి అప్‌గ్రేడ్స్‌తో iQOO 15 టెక్‌ప్రియులను ఆకట్టుకునే అవకాశముంది. iQOO 15, iQOO ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను మరో లెవల్‌కి తీసుకెళ్తుందని నిపుణులు భావిస్తున్నారు.

iqoo-15-gaming-smart-phone-price-and-specificatons-details

iQOO 15 ఫీచర్స్..

డిస్‌ప్లే..

iQOO ప్రొడక్ట్ మేనేజర్ గాలాంట్ V వెల్లడించిన ప్రకారం.. iQOO 15లో 6.85-అంగుళాల 2K శామ్‌సంగ్ ఎవరెస్ట్ AMOLED డిస్‌ప్లే (NB Plus ప్యానెల్)ను ఉపయోగించారు. ఇది మరింత స్పష్టత, కచ్చితమైన రంగులు, అధిక కాంట్రాస్ట్‌తో పాటు ప్రతిబింబాలను తగ్గిస్తుంది. ఫోన్ 6,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించనుంది. Apple iPhone 17 Pro Max తరహా యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా కలిగి ఉండనుంది.

డిజైన్..

iQOO 15 డిజైన్ గత మోడల్స్‌తో పోలిస్తే పూర్తిగా కొత్తగా ఉండనుంది. లీక్ అయిన చిత్రాల ప్రకారం, వెనుక భాగంలో పెద్ద సర్క్యులర్ కెమెరా ఐలాండ్ కనిపిస్తోంది. ఇందులో అమర్చిన సెన్సార్ల చుట్టూ RGB లైటింగ్ రింగ్ కూడా ఉంటుందని.. ఇది ఫోన్‌కి అదనపు స్టైలిష్ లుక్ ఇస్తుంది. బ్యాక్ ప్యానెల్‌ స్పేస్‌షిప్ తరహాలో డిజైన్ చేయబడింది. మరోవైపు, కలర్ చేంజింగ్ ప్యానెల్ కూడా ఉంటుంది. యాంగిల్ ఆధారంగా ఇది గ్రే నుండి పింక్‌కి మారే షేడ్ ఇస్తుంది.

కెమెరా..

ఈ ఫోన్‌లో ట్రిపుల్ 50MP రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 3X ఆప్టికల్ జూమ్‌ కలిగిన అప్‌గ్రేడ్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కెమెరా మాడ్యూల్ మందంగా కనిపించడం కూడా ఈ కొత్త లెన్స్ కారణంగానే అని టిప్‌స్టర్స్ చెబుతున్నారు.

పనితీరు..

iQOO 15, తాజా Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ పై నడుస్తుంది. దీన్ని 12GB ర్యామ్ మరియు Android 15 OS తో టెస్ట్ చేసినట్టు Geekbench డేటా తెలిపింది. సింగిల్-కోర్‌లో 2,360 పాయింట్లు, మల్టీ-కోర్‌లో 7,285 పాయింట్లు నమోదు చేసింది. ఇవి iQOO 13తో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ, ఫైనల్ వెర్షన్‌లో మరింత ఆప్టిమైజేషన్ వచ్చే అవకాశముంది.

భారీ బ్యాటరీ & కూలింగ్ సిస్టమ్..

ఈ ఫోన్‌కు 7,000mAh బ్యాటరీ మద్దతు ఇస్తుంది. దీని వల్ల దీర్ఘకాలం బ్యాకప్ లభిస్తుంది. అంతేకాకుండా, మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 8K వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ను కూడా ఇందులో పరిచయం చేస్తున్నారు.

భారత మార్కెట్లో ధర అంచనా..

సాధారణంగా iQOO లాంచ్ సైకిల్ ప్రకారం, iQOO 15 అక్టోబర్‌లో చైనాలో, ఆపై డిసెంబర్‌లో భారత్‌లో రానుంది. ధర విషయానికి వస్తే రూ.59,999 లోపు ఉండే అవకాశముంది. గతంలో iQOO 13 బేస్ మోడల్ (12GB RAM + 256GB స్టోరేజ్) రూ.54,999కి లాంచ్ అయిన సంగతి తెలిసిందే. దాంతో పోలిస్తే iQOO 15 కూడా పోటీ ధరలోనే రానుందని అంచనా.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+