భారీ బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో iQOO Neo 10..!
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ iQOO కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు నూతన సిరీస్ లతో మార్కెట్ ను పెంచుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా తమ కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Neo 10 ని విడుదల చేసింది. Neo 10 సిరీస్‌లో భాగంగా రిలీజ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ Neo 7 తర్వాత మళ్లీ వచ్చిన వనిల్లా మోడల్ గా ప్రత్యేకంగా నిలుస్తుంది.
ఈ ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్, 7,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్‌తో ధూళి, నీటి నిరోధకత, 7,000mm² వేపర్ కూలింగ్ చాంబర్ వంటి అద్భుత ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 8.09mm, బరువు 206 గ్రాములు మాత్రమే ఉండడంతో టెక్ ప్రియులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ప్రత్యేకించి హై-ఎండ్ యూజర్లను లక్ష్యంగా చేసుకున్న మార్కెట్ లోకి వచ్చిన ఈ ఫోన్.. టార్గెట్ ని రీచ్ అయ్యిందనే టాక్ నడుస్తోంది.

iQOO Neo 10 ఫీచర్లు..
డిస్‌ప్లే..
6.78 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్,
144Hz రిఫ్రెష్ రేట్,
360Hz టచ్ శాంప్లింగ్ రేట్,
5,500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్,
4,320Hz PWM డిమ్మింగ్
ప్రాసెసర్..
కొత్తగా విడుదలైన Snapdragon 8s Gen 4 చిప్‌సెట్
RAM, స్టోరేజ్..
8GB / 12GB / 16GB - LPDDR5X RAM
128GB నుంచి 512GB వరకు UFS 4.1 స్టోరేజ్
ఆపరేటింగ్ సిస్టమ్..
Android 15 ఆధారిత Funtouch OS 15
బ్యాటరీ..
భారీ 7,000mAh బ్యాటరీ
120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
కూలింగ్ టెక్నాలజీ..
7,000mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీ
కెమెరా..
50MP సోనీ సెన్సార్ (OIS సపోర్ట్‌తో) మెయిన్ కెమెరా
8MP అల్ట్రా వైడ్ లెన్స్
32MP సెల్ఫీ కెమెరా
ఇతర ఫీచర్లు..
Q1 గేమింగ్ చిప్
144fps గేమింగ్ సపోర్ట్
బైపాస్ ఛార్జింగ్ (గేమింగ్ సమయంలో వేడి తగ్గించేందుకు)
3,000Hz టచ్ శాంప్లింగ్ రేట్
నైట్ విజన్ మోడ్ (చీకటి ప్రాంతాల్లో క్లారిటీ కోసం)
In-display Fingerprint Sensor
5G, Wi-Fi 7, Bluetooth 5.4
USB Type-C, GPS, NFC
IP65 రేటింగ్
రంగులు..
ఇన్‌ఫెర్నో రెడ్
టైటానియం క్రోమ్
ధర..
8GB + 128GB - రూ. 31,999
8GB + 256GB - రూ. 33,999
12GB + 256GB - రూ. 35,999
16GB + 512GB - రూ.40,999
అయితే ప్రారంభ సేల్ ఆఫర్ కింద ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ. 2,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఇప్పటికే ప్రీ-బుకింగ్ సేల్ ప్రారంభం అవ్వగా.. అమ్మకాలు జూన్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. Amazon, iQOO India స్టోర్ లతో పాటు రిటైల్ మొబైల్ షాప్స్ లో సైతం అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ప్రీ-బుకింగ్ చేసినవారికి iQOO TWS 1e ఇయర్‌బడ్స్ ఉచితంగా అందిస్తున్నారు. వేగవంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ, కూలింగ్ టెక్నాలజీతో అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ప్రతి టెక్ లవర్‌ను ఆకర్షించేలా ఉంది.












Click it and Unblock the Notifications