రూ.364 EMIతో iQOO Z10x 5G స్మార్ట్‌ఫోన్.. భారీ డిస్కౌంట్ !!
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ iQOO ఎదుగుతోంది. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు నూతన సిరీస్ లతో మార్కెట్ ను పెంచుకుంటూనే ఉంటుంది. దీంతో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బడ్జెట్-ఫ్రెండ్లీ సెగ్మెంట్‌లో మరో బలమైన పోటీదారుగా మారుతోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా తమ కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z10x 5G ఎంట్రీ ఇచ్చింది. అమెజాన్ ప్రస్తుతం ఈ ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించడంతో టెక్ ప్రియులు దృష్టి మొత్తం ఈ డివైస్‌పైనే పడింది. 6500mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 4K వీడియో సపోర్ట్, 120Hz డిస్‌ప్లే వంటి ఫీచర్లతో ఇది మంచి ఛాయిస్ గా మారింది.
అమెజాన్‌లో భారీ ఆఫర్..
కాగా iQOO Z10x 5G స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.17,499. అయితే ప్రస్తుత ఆఫర్‌లో దాదాపు 20% డిస్కౌంట్తో కేవలం రూ.13,998కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ ఫోన్‌ను రూ.364 EMIతో కొనుగోలు చేయవచ్చు. ఇది No-Cost EMI కాబట్టి అదనపు వడ్డీ ఖర్చు ఉండదు. ICICI & HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు రూ.1,049 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్‌తో iQOO Z10x ఈ బడ్జెట్ తో ఒక బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది.

iQOO Z10x 5G ఫీచర్లు..
డిజైన్ & డిస్‌ప్లే..
Z10x 5G స్మార్ట్‌ఫోన్ 6.72-అంగుళాల Full HD+ IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్తో గేమింగ్, స్క్రోలింగ్ సమయంలో అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. డిస్‌ప్లే 1050 నిట్స్ వరకు చేరుతుంది. అలానే IP64 డస్ట్ & వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ కలిగి ఉంది. MIL-STD-810H సర్టిఫికేషన్తో షాక్ ప్రూఫ్ టెస్టులను కూడా క్లియర్ చేసింది. డిజైన్ పరంగా మెటాలిక్ ఫ్రేమ్, స్లిమ్ ప్రొఫైల్‌తో ఈ ఫోన్ ప్రీమియం లుక్ ఇస్తుంది.
ప్రాసెసర్ & పనితీరు..
iQOO Z10x 5G ఫోన్‌లో MediaTek Dimensity 7300 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది 4nm ఆధారంగా తయారైన అధునాతన ప్రాసెసర్. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్ రెండింటికీ సూపర్ ఫాస్ట్ అనుభవాన్ని ఇస్తుంది. ఫోన్ 728K+ AnTuTu స్కోర్ సాధించింది. ఇది ఈ రేంజ్‌లో ఉన్న ఫోన్లలో అత్యధికం.
స్టోరేజ్..
6GB, 8GB RAM వేరియంట్లతో పాటు 8GB వర్చువల్ RAM సపోర్ట్ కూడా ఉంది.
128GB / 256GB UFS 3.1 స్టోరేజ్‌తో వేగవంతమైన రీడ్-రైట్ స్పీడ్ అందిస్తుంది.
ఇది గేమింగ్‌కి కూడా బెటర్ గా ఉంటుంది.
BGMI, Free Fire, Call of Duty లాంటి గేమ్స్‌లో ల్యాగ్ లేకుండా ఆడవచ్చు.
బ్యాటరీ..
ఈ ఫోన్‌లో 6500mAh భారీ బ్యాటరీ ఉంది. సాధారణ వినియోగంలో 2 రోజులు సులభంగా లైఫ్ ఇస్తుంది. ఇది 44W Flash Charge టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది - 1% నుంచి 50% వరకూ కేవలం 40 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. ఇందులో AI Battery Management సిస్టమ్ ఉంది, ఇది ఛార్జ్ వేడెక్కకుండా కంట్రోల్ చేస్తుంది.
కెమెరా సెటప్..
iQOO Z10x 5G వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది:
50MP ప్రైమరీ సెన్సార్ (OISతో)
2MP బోకె సెన్సార్
సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP కెమెరాను అందించారు.
ఫోన్ 4K రికార్డింగ్ (30fps) సపోర్ట్ చేస్తుంది.
సూపర్ నైట్ మోడ్, పోర్ట్రెయిట్, పానోరమా, ప్రో మోడ్, AI సీన్ డిటెక్షన్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. HDR ఆప్టిమైజేషన్, AI స్టెబిలైజేషన్ కూడా ఉన్నాయి, వీటివల్ల వీడియోలు స్థిరంగా కనిపిస్తాయి.
సాఫ్ట్‌వేర్..
ఈ ఫోన్ Android 15 ఆధారంగా Funtouch OS 15పై నడుస్తుంది.
బ్రాండ్ 2 సంవత్సరాల OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచెస్ హామీ ఇస్తోంది.
సెక్యూరిటీ..
సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, AI Face Unlock, మరియు App Lock వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, Privacy Dashboard, Secure Folder వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
గేమింగ్ & మల్టీమీడియా అనుభవం..
Z10x 5Gలో Ultra Game Mode 3.0 ఉంది. ఇది CPU/GPU పనితీరును పెంచి, ల్యాగ్ ఫ్రీ అనుభవాన్ని ఇస్తుంది. స్టీరియో స్పీకర్లు, హై-రెజ్ ఆడియో సపోర్ట్‌తో సినిమాలు, గేమ్స్, సంగీతం వినడంలో స్పష్టమైన సౌండ్ అనుభవం లభిస్తుంది. ఇందులో 5G డ్యూయల్ సిమ్ సపోర్ట్, Wi-Fi 6, Bluetooth 5.3, NFC వంటి ఆధునాతన కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications