స్పేస్ వర్క్ హార్స్: ముహూర్తం ఫిక్స్ చేసిన ఇస్రో: షార్ సెంటర్ నుండి ప్రత్యక్షంగా చూసే ఛాన్స్
భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ.. ఇస్రో ఈ ఏడాది తొలి మిషన్ ప్రారంభించబోతోంది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ సీ62 ప్రయోగానికి ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 12వ తేదీన ఉదయం 10:17 నిమిషాలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. స్పేస్ వర్క్‌హార్స్ గా పేరుగాంచిన పీఎస్ఎల్ వీ సిరీస్‌లో ఇది 64వ ప్రయోగం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ మిషన్ ప్రధాన పేలోడ్ ఈఓఎస్- ఎన్1. పర్యావరణ పర్యవేక్షణకు ఉద్దేశించిన అత్యాధునిక హైపర్‌స్పెక్ట్రల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇది. హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ ద్వారా విస్తృత తరంగదైర్ఘ్యాలలో డేటాను సేకరిస్తుంది. వృక్షసంపద, నీటి నాణ్యత, భూ వాతావరణం- ఉపరితల మార్పులను ఎప్పటికప్పుడు సేకరిస్తుంది. ఈ డేటాను విశ్లేషిస్తుంది. దేశ వైపరీత్యాల నిర్వహణ, వ్యవసాయం, వనరుల మ్యాపింగ్‌కు గణనీయమైన ఊతం ఇస్తుందీ మిషన్.

ఈఓఎస్- ఎన్1 తో పాటు వివిధ అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థలకు చెందిన 18 చిన్న ఉపగ్రహాలు కూడా ఈ పీఎస్ఎల్వీ మిషన్ ద్వారా నింగిలోకి వెళ్లనున్నాయి. భారత అంతరిక్ష పరిశోధనలపై ఆయా దేశాలు పెట్టుకున్న విశ్వసనీయతకు ఇది అద్దం పట్టినట్టయింది. 63 ప్రయోగాలలో 90 శాతానికి పైగా సక్సెస్ రేట్ ను సాధించింది పీఎస్ఎల్వీ. అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
పీఎస్ఎల్వీ-సీ62 కోర్-అలోన్ కాన్ఫిగరేషన్‌లో ప్రయాణిస్తుంది. ఉపగ్రహాలను తక్కువ భూ కక్ష్యలోకి (low Earth orbit) విజయవంతంగా ప్రవేశపెట్టేలా దీన్నిఆప్టిమైజ్ చేశారు. భూ ఉపరితలం నుంచి సుమారు 650 కిలో మీటర్ల ఎత్తులో సన్ సింక్రనైజ్డ్ ఆర్బిట్ లో ఇది పనిచేస్తుంది. ఈ అద్భుత ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడటానికి ఇస్రో అవకాశం కల్పించింది. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని లాంచ్ వ్యూ గ్యాలరీ నుండి వీక్షించడానికి రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఆసక్తి గల వారు ఆన్‌లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. దీనికోసం ఆధార్ లేదా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, మొబైల్ నంబర్, ఇమెయిల్ తప్పనిసరి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications