ఇస్రో మరో మైలురాయి
ISRO Proba 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో చారిత్రాత్మక మిషన్‌కు సన్నద్ధమైంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాలను ప్రయోగించనుంది. ఈ సాయంత్రం సరిగ్గా 4:08 నిమిషాలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం లాంచ్ ప్యాడ్ 1 వీటిని నింగిలోకి పంపించనుంది.
సూర్యుడిపై అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన మిషన్ ఇది. ఇస్రో సహకారంతో సూర్యుడి బాహ్య వలయం కొరొనా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అక్కడి వాతావరణం, ప్లాస్మా, అయానైజ్డ్ గ్యాస్.. వంటి అంశాలపై అధ్యయనం చేయనుంది ఈఎస్ఏ.

ఈ శాటిలైట్లను పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ) సీ59 రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లనున్నాయి. దీనితో పాటు కొరొనొగ్రఫీ స్పేస్‌క్రాఫ్ట్, అక్యుల్టర్ స్పేస్‌క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్తాయి. పీఎస్ఎల్‌వీ సీ 59 పొడవు 44.5 మీటర్లు. మొత్తంగా 320 టన్నుల బరువును లిఫ్ట్ చేయనుంది.
మొత్తం నాలుగు దశల్లో ఈ రాకెట్ విడివడుతుంది. చివరిదశ లాగ్రాంజ్ పాయింట్ 2.5. ఈ పాయింట్ వద్ద ఎక్స్‌రే పొలారిమీటర్ శాటిలైట్ చేరుకుంటుంది. అక్కడి నుంచి సూర్యుడి కొరొనాపై అధ్యయనం సాగిస్తుంది. ఎల్ 2.5 పాయింట్ వద్ద ఉండే అత్యంత ప్రతికూల వాతావరణానికి తట్టుకునేలా ఈ శాటిలైట్లను డిజైన్ చేసింది ఇస్రో.
సౌర తుఫానుల తీవ్రత, వాటివల్ల సంభవించబోయే పరిణామాలు, శాటిలైట్లు, కమ్యూనికేషన్ల వ్యవస్థ, భూమిపై ఉండే పవర్ గ్రిడ్లపై దాని దుష్ప్రభావం వంటి అంశాలపై కొరొనొగ్రఫీ స్పేస్‌క్రాఫ్ట్, అక్యుల్టర్ స్పేస్‌క్రాఫ్ట్ అధ్యయనం చేస్తాయి. దీనికోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.. మన ఇస్రో సహకారాన్ని తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications