ఇస్రో.. అనూహ్య పరిణామం..!!
ISRO Proba 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న మిషన్‌లో ఊహించని పరిణామం. ఈ సాయంత్రం 4:08 నిమిషాలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం లాంచ్ ప్యాడ్ 1 నుంచి నింగిలోకి దూసుకెళ్లాల్సిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాలను ప్రయోగం వాయిదా పడింది.
సూర్యుడిపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన మిషన్ ఇది. ఇస్రో సహకారంతో సూర్యుడి బాహ్య వలయం కొరొనా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అక్కడి వాతావరణం, ప్లాస్మా, అయానైజ్డ్ గ్యాస్.. వంటి అంశాలపై అధ్యయనం చేయనుంది.

ఈ శాటిలైట్లను పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ) సీ59 రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లాల్సి ఉండగా.. అది అనూహ్యంగా వాయిదా పడింది. గురువారం సాయంత్రం 4:12 నిమిషాలకు రీషెడ్యూల్ చేసింది. పీఎస్ఎల్వీ సీ59లో అసాధారణ స్థితిని గుర్తించామని, ఫలితంగా వాయిదా వేయాల్సి వచ్చిందని ఇస్రో తెలిపింది. అంతకుమించిన కారణాలను వెల్లడించలేదు.
ఈ పీఎస్ఎల్వీ ద్వారానే ఇస్రో కొరొనొగ్రఫీ స్పేస్‌క్రాఫ్ట్, అక్యుల్టర్ స్పేస్‌క్రాఫ్ట్‌ను నింగిలోకి పంపించాల్సి ఉంది. దీని పొడవు 44.5 మీటర్లు. మొత్తంగా 320 టన్నుల బరువును లిఫ్ట్ చేయనుంది. మొత్తం నాలుగు దశల్లో ఈ రాకెట్ విడివడుతుంది. చివరిదశ లాగ్రాంజ్ పాయింట్ 2.5. ఈ పాయింట్ వద్ద ఎక్స్‌రే పొలారిమీటర్ శాటిలైట్ చేరుకుంటుంది.
అక్కడి నుంచి సూర్యుడి కొరొనాపై అధ్యయనం సాగిస్తుంది. ఎల్ 2.5 పాయింట్ వద్ద ఉండే అత్యంత ప్రతికూల వాతావరణానికి తట్టుకునేలా ఈ శాటిలైట్లను డిజైన్ చేసింది ఇస్రో. సౌర తుఫానుల తీవ్రత, వాటివల్ల సంభవించబోయే పరిణామాలు, శాటిలైట్లు, కమ్యూనికేషన్ల వ్యవస్థ, భూమిపై ఉండే పవర్ గ్రిడ్లపై దాని దుష్ప్రభావం వంటి అంశాలపై కొరొనొగ్రఫీ స్పేస్‌క్రాఫ్ట్, అక్యుల్టర్ స్పేస్‌క్రాఫ్ట్ అధ్యయనం చేస్తాయి.












Click it and Unblock the Notifications