చంద్రునిపై రాత్రిని తట్టుకుని జపాన్ 'స్లిమ్' చేసిన అద్భుతం!!

చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తున్న జపాన్ వ్యోమ నౌక స్లిమ్ ఇప్పటికే చంద్రుడికి సంబంధించిన కీలక సమాచారాన్ని పంపిన విషయం తెలిసిందే. జపాన్ శాస్త్రవేత్తలు ఊహించిన దాని కంటే మరింత మెరుగ్గా పనిచేస్తున్న స్లిమ్ అక్కడ ఉన్న పది శిలలను విశ్లేషించి పంపిందని తెలిపారు. ఇక ఆ డేటా సహాయంతో చంద్రుడి ఆవిర్భావానికి సంబంధించిన కీలక వివరాలను తెలుసుకోవచ్చని జపాన్ అంతరిక్ష సంస్థ ఇటీవల వెల్లడించింది.

ఇక ఇది మాత్రమే కాదు తాజాగా జపాన్ వ్యోమనౌక స్లిమ్ మరో అద్భుతాన్ని చేసింది. ఇది చంద్రుడిపై పరిశోధనలలో మరో మైలురాయిని చేరుకుంది. చంద్రుడిపై రాత్రిపూట అత్యంత శీతల వాతావరణం ఉంటుంది. చంద్రుడిపై రాత్రి వేళలో ఉండే మైనస్ 170 డిగ్రీల సెల్సియస్ శీతల వాతావరణాన్ని తట్టుకునేలా దీనిని రూపొందించనప్పటికీ జపాన్ వ్యోమ నౌక స్లిమ్ చంద్రుడిపై రాత్రిని తట్టుకుని నిలబడింది.

Japan spaceship slim survives the night on the moon and response to Japan Space Station!!

భూ కేంద్రం నుంచి పంపిన సంకేతాలకు స్లిమ్ స్పందించింది. ఇక ఇదే విషయాన్ని జపాన్ అంతరిక్ష సంస్థ వెల్లడించింది. మైనస్ 170 డిగ్రీల సెల్సియస్ శీతల వాతావరణంలో కూడా స్లిమ్ పనిచేసినట్టు, అది రాత్రి వేళ కూడా తన కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని కాపాడుకున్నట్టు జపాన్ అంతరిక్ష సంస్థ వెల్లడించింది.

స్లిమ్ ల్యాండర్ దిగిన ప్రాంతంలో ప్రస్తుతం మధ్యాహ్నం సమయం ఉందని , వ్యోమ నౌకలో ఉన్న పరికరాలు 100 డిగ్రీల సెల్సియస్ కు వేడెక్కాయి అని, ఈ కారణంగా తాజా కమ్యూనికేషన్ ను కొద్దిసేపు మాత్రమే సాగించాము అని పేర్కొంది. చంద్రుడిపై ఒక రోజు రాత్రి అంటే భూమిపై 14 రోజుల కాలం.. ఆ సమయంలో ఎండ ఉండకపోవడంతో సౌర ఫలకాలు నిరుపయోగంగా మారి బ్యాటరీలు పనిచేయవు.

అయితే చంద్రుడిపై ఒక రోజు రాత్రి సమయాన్ని స్లిమ్ తట్టుకుంటుంది అని శాస్త్రవేత్తలు భావించలేదు. కానీ స్లిమ్ రాత్రిపూట మైనస్ 170 సెల్సియస్ అతి శీతల వాతావరణాన్ని తట్టుకుని జపాన్ అంతరిక్ష సంస్థ పంపిన కమాండ్ కు స్పందించింది. ఇదిలా ఉంటే చంద్రుడిపై పరిశోధనలు చేస్తున్న ఐదో దేశంలో జపాన్ గుర్తింపు పొందింది.

మొదట చంద్రుడిపైకి స్లిమ్ ను పంపిన సమయంలో అది తలకిందులుగా ల్యాండ్ అయింది. అయితే దాని సౌర ఫలకాల పై ఎండ పడకపోవడంతో స్లిమ్ పనిచేయలేదు. ఆ తర్వాత సూర్యుడి గమనం మారడంతో వాటిపై వెలుగు పడింది. అప్పుడు స్లిమ్ పనిచేయడం ప్రారంభించింది.

ఇప్పటికే స్లిమ్ చంద్రుడిపై అనేక శిలలను శోధించి వాటి ఫోటోలను తీసి భూమికి పంపించింది. మళ్లీ చంద్రుడిపై రాత్రి కావడంతో నిద్రాణ స్థితికి చేరుకుంది. అయినప్పటికీ ఊహించని విధంగా రాత్రి వేళలో కూడా స్లిమ్ స్పందించడం జపాన్ శాస్త్రవేత్తలకు పట్టరాని సంతోషాన్ని కలిగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+