చందమామపై మహా సముద్రాలు

Jupiter's moon Europa: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. జుపిటర్‌ చందమామ యూరోపాపై జీవించడానికి అనుకూల వాతావరణం ఉందని గుర్తించింది. దీనిపై ప్రయోగాలకు పూనుకుంది. దీనికోసం యూరోపా క్లిప్పర్ స్పేస్ క్రాఫ్ట్‌ను పంపించింది.

యూరోపాపై పరిశోధనలు చేపట్టడానికి నాసా చేపట్టిన తొలి మిషన్ ఇదే. యూరోపా క్లిప్పర్ స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రయోగించడానికి ఎలాన్ మస్క్‌ సహకారాన్ని తీసుకుంది నాసా. ఆయనకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన ఫాల్కన్ హెవీ వెయిట్ రాకెట్‌ను వినియోగించింది.

Jupiter s moon Europa has conditions suitable for life

సోమవారం దీన్ని మోసుకుంటూ అంతరిక్షంలోకి దూసుకెళ్లిందీ రాకెట్. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు నాసా, స్పేస్ ఎక్స్ ప్రకటించాయి. తమ లక్ష్యం త్వరలోనే నెరవేరబోతోందనీ వెల్లడించాయి.

యూరోపా.. జుపిటర్‌కు ఉన్న 95 చందమామల్లో ఇదీ ఒకటి. ఇందులో నాలుగో అతిపెద్ద చందమామ ఇదే. భూమికి ఒక్క చందమామే ఉంటే జుపిటర్‌కు ఉన్న చంద్రుల సంఖ్య 95. దీని ఈక్వటోరియల్ డయామీటర్ 3,100 కిలోమీటర్లు. మన చంద్రుడి సైజుతో దాదాపు సమానంగా ఉంటుంది. రెట్టింపు వెలుగునిస్తుంది.

దీని ఉపరితలం అంతా మంచుతో నిండివుండటం వల్ల అది రిఫ్లెక్ట్ అయి చంద్రుడి కంటే 5.5 రెట్ల వెలుగునిస్తుంది. జుపిటర్ నుంచి 6,71,000 కిలోమీటర్ల దూరంలో ఇది పరిభ్రమిస్తోన్న చందమామ ఇది. సూర్యుడు- యూరోపా మధ్య దూరం 780 మిలియన్ కిలోమీటర్లు.

అంతరిక్ష శాస్త్రవేత్తల పరిభాషలో చెప్పాలంటే ఈ దూరాన్ని 5.2 ఆస్ట్రనామికల్ యూనిట్స్‌గా పిలుస్తారు. భూమి- సూర్యుడి మధ్య ఉన్న దూరం ఒక ఆస్ట్రనామికల్ యూనిట్‌. అలా 5.2 ఆస్ట్రనామికల్ యూనిట్స్ దూరంలో ఉంది ఈ యూరోపా చందమామ. సూర్య కిరణాలు దీనిపై పడటానికి పట్టే కాలం 45 నిమిషాలు.

యూరోపా ప్రతి 3.5 రోజులకు జుపిటర్ చుట్టూ పరిభ్రమిస్తుంటుంది. జుపిటర్‌పై నిల్చుని చూస్తే మన చంద్రుడి తరహాలోనే యూరోపా కూడా ఎప్పుడూ ఒక వైపు భాగం మాత్రమే కనిపిస్తుంటుంది. ఇక జుపిటర్ సూర్యుడి చుట్టూ తిరగడానికి దాదాపు 4,333 రోజులు పడుతుంది. దాదాపు 12 సంవత్సరాలు అన్నమాట. దీన్ని ఒక జోవియన్ సంవత్సరంగా పిలుస్తారు.

అలాంటి యూరోపాపై సమృద్ధిగా నీళ్లు ఉన్నట్లు నాసా గుర్తించింది. దీనిపై సమగ్ర పరిశోధనలను నిర్వహించడానికి యూరోపా క్లిప్పర్‌ను పంపించింది. ఇక్కడ జీవం ఉంటుందని బలంగా నమ్ముతోంది నాసా. ఉపరితలం కింద కొన్ని కిలోమీటర్ల దిగువన ఘనీభవించిన స్థితిలో మహా సముద్రాలు ఉన్నట్లు చెబుతోంది. భూమిపై కంటే అక్కడ ఉన్న నీటి శాతం అధికమని అంచనావేసింది.

2013లో హబుల్ స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగించి యూరోపా నీటి ఆనవాళ్లను తొలిసారిగా గుర్తించింది నాసా. 2019 నవంబర్‌లో అక్కడి ఉపరితలంపై నీటి ఆవిరి ఉన్నట్లు నిర్ధారించింది. దీనితో అక్కడి వాతావరణ స్థితిగతులపై సమగ్రంగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ అయిదేళ్ల కాలంలో యూరోపా క్లిప్పర్‌కు ప్రాణం పోసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+