రూ. 16కే స్మార్ట్ వాచ్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన " లావా "
మారుతున్న కాలానుగుణంగా రోజుకో కొత్త గాడ్జెట్ మార్కెట్లో రిలీజ్ అవుతోంది. కేవలం సమయం కోసం మాత్రమే కాకుండా.. ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, ఫిట్‌నెస్, కాల్స్, మెసేజ్‌లకు స్పందించడం వంటి అనేక పనుల్లో ఉపయోగపడుతున్నాయి. హార్ట్‌రేట్, SpO2, స్లీప్, స్టెప్ కౌంట్ వంటి హెల్త్ ఫీచర్లతో పాటు, బ్లూటూత్ కాలింగ్, నోటిఫికేషన్ అలర్ట్‌లు వంటి సౌకర్యాలు స్మార్ట్‌వాచ్‌లలో అందుబాటులో ఉంటాయి.
అయితే ఇప్పుడు తాజాగా లావా కంపెనీ తన కొత్త స్మార్ట్‌వాచ్ 'ProWatch Xtreme' పై అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం రూ.16కే ఈ వాచ్‌ను పొందవచ్చని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.43 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. స్క్రీన్ రక్షణ కోసం Corning Gorilla Glass 3 ఉండటం ప్రత్యేకత. ఇది IP68 రేటింగ్ కలిగి ఉంది, అంటే నీరు, ధూళి సమస్య ఉండదు. అల్యూమినియం మెటల్ అల్లాయ్‌తో తయారైన శరీరం స్టైలిష్ లుక్ ఇస్తుంది. 300mAh బ్యాటరీ ద్వారా 7 రోజుల వరకు బ్యాకప్ అందిస్తుంది. ఇన్ని ఫీచర్స్ ఉండడంతో టెక్ ప్రియులు ఈ స్మార్ట్ వాచ్ కోసం పోటీ పడుతున్నారు.

రూ.16 కే ఎలా పొందాలంటే.. ?
లావా అనౌన్స్ మెంట్ ప్రకారం.. జూన్ 16న మధ్యాహ్నం 12 గంటలకు Amazon లో ProWatch Xtreme స్మార్ట్‌వాచ్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కానీ ఇది ఒక ప్రమోషనల్ ఆఫర్ కాబట్టి, కేవలం మొదటి 50 మంది కస్టమర్లు మాత్రమే ఈ వాచ్‌ను రూ.16కే పొందగలరు. వారు XTREME16 అనే కూపన్ కోడ్ ఉపయోగించాలని స్పష్టం చేశారు.
మూడు వేరియంట్లు..
ఇక ఈ వాచ్ సిలికాన్, నైలాన్, మెటల్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.
సిలికాన్ వేరియంట్ అసలు ధర రూ.4,499 కాగా, లాంచ్ రోజు ఆఫర్ ధర రూ.3,999
నైలాన్ వేరియంట్ రూ.4,699కి లాంచ్ అవుతుంది కానీ ఆఫర్ ధర రూ.4,199.
మెటల్ వేరియంట్ రూ.4,999 కాగా, ఆఫర్‌లో రూ.4,499కు లభిస్తుంది.
అన్ని వేరియంట్లపై రూ.1000 వరకు బ్యాంక్ డిస్కౌంట్లు కూడా వర్తిస్తాయి.
ఇతర స్పెసిఫికేషన్స్..
ఈ వాచ్‌లో Bluetooth 5.3 ఉంది. దీని ద్వారా Bluetooth Calling సపోర్ట్ చేస్తుంది. వాచ్ నుంచే కాల్స్ చేసుకోవచ్చు, పొందవచ్చు. అలాగే Quick Message Reply ఫీచర్ ఉంది. Always-On Display, మల్టిపుల్ వాచ్ ఫేసెస్ వంటి అధునాతన ఫీచర్లూ ఉన్నాయి.
అలానే హార్ట్ రేట్ మానిటర్, SpO2 ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్, స్ట్రెస్ లెవెల్ మాపింగ్, బ్రెతింగ్ మోడ్ ఉన్నాయి. ఫిట్‌నెస్ కోసం 100+ స్పోర్ట్స్ మోడ్‌లు, GPS, స్టెప్ కౌంటర్, కాలరీ ట్రాకర్ వంటి ఫీచర్లు ఉన్నవి. ఇది iOS మరియు Android రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా మ్యూజిక్, కెమెరా కంట్రోల్, మెన్స్ట్రుయల్ ట్రాకింగ్, అలార్మ్స్, నోటిఫికేషన్ అలెర్ట్స్ వంటి అదనపు ఉపయోగకరమైన ఫీచర్లను పొందొచ్చు. Meditation Mode కూడా ఉంది.
స్మార్ట్‌వాచ్ కొనాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్న వారు ఈ ఆఫర్‌ను మిస్ చేసుకోకండి. జూన్ 16న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌కి లాగిన్ అయి, XTREME16 కోడ్‌తో ట్రై చేసి వాచ్ ను దక్కించుకోండి.












Click it and Unblock the Notifications