దీపావళి ఆఫర్: కేవలం రూ.21కే లావా ఇయర్‌ బడ్స్..!

దీపావళి పండుగను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కంపెనీలు వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి కొత్త ఆఫర్‌లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా (Lava) కూడా అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. 'ముహూర్త్ సేల్' పేరుతో కంపెనీ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా లావా ఇయర్‌బడ్స్‌ను కేవలం రూ.21కే అందిస్తోంది.

రూ. 21కే ప్రోబడ్స్ ఆఫర్..

సాధారణంగా రూ. 999 విలువ చేసే Lava Probuds 911 మోడల్ ఇప్పుడు కేవలం రూ. 21కే లభిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం 100 మంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సేల్ అక్టోబర్ 21న మధ్యాహ్నం 1:15 గంటలకు లావా అధికారిక ఈ-స్టోర్‌లో ప్రారంభం కానుంది. ఈ సమయంలో లాగిన్ అయ్యి మొదట కొనుగోలు చేసే వారు మాత్రమే ఈ అదృష్టాన్ని పొందగలరు.

lava-pro-buds-only-for-21-rupees-due-to-diwali-offer

ఒక్క ఛార్జ్‌తో 35 గంటల వినియోగం..

లావా ప్రోబడ్స్ ఆరియా 911 మోడల్ బ్యాటరీ పరంగా వినియోగదారులకు పెద్ద సర్ప్రైజ్ ఇస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 35 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ లభిస్తుంది. అంతేకాకుండా కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 150 నిమిషాల వరకూ పనిచేస్తుంది. దీంతో రోజువారీ వినియోగంలో బ్యాటరీ సమస్యలు లేకుండా మ్యూజిక్ లేదా కాల్ అనుభవం పొందవచ్చు.

మోడ్రన్ డిజైన్..

ఈ ఇయర్‌బడ్స్ డ్యూయల్-టోన్ స్టైలిష్ డిజైన్లో వస్తాయి. లావా ప్రోబడ్స్ ఆరియా 911కు IPX4 రేటింగ్ ఉంది. అలానే ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) టెక్నాలజీ ద్వారా బ్యాక్‌గ్రౌండ్ శబ్దాన్ని తగ్గించి, స్పష్టమైన కాల్ క్వాలిటీని అందిస్తుంది.

కనెక్టివిటీ & స్మార్ట్ కంట్రోల్స్..

లావా ప్రోబడ్స్ బ్లూటూత్ v5.3 కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తాయి. దాంతో వేగవంతమైన కనెక్షన్, స్థిరమైన ఆడియో లింక్ లభిస్తుంది. అలాగే టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ఉన్నందున ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. టచ్ కంట్రోల్స్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

కంపెనీ ప్రకారం, ఈ ప్రత్యేక ఆఫర్ పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కనుక, తక్కువ ధరకు ప్రీమియం క్వాలిటీ ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయాలనుకునే వారు అక్టోబర్ 21 మధ్యాహ్నం 1:15కు లావా ఈ-స్టోర్‌లో లాగిన్ అయి సిద్ధంగా ఉండాలని సూచిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+