రూ. 6,499 కే Lava Yuva 2 Star..
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు లావా నుంచి శుభవార్త. భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లతో ఫోన్‌ను లాంఛ్ చేసింది. తాజాగా మార్కెట్లోకి Lava Yuva 2 Star ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర కేవలం రూ. 6,499 కాగా, బ్లోట్‌వేర్ లేని అనుభవం, Android 14 Go వంటి లైట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్, పెద్ద RAM, శక్తివంతమైన బ్యాటరీతో ఇది ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే Xiaomi, Realme, Infinix వంటి బ్రాండ్‌లు తక్కువ ధరలకు స్మార్ట్‌ఫోన్లను అందించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే లావా యువ స్టార్ 2 ఆకర్షణీయ ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ చేయడంతో పోటీ మరింత పెరిగింది. ఈ ఫోన్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, లావా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. సమ్మర్ సేల్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఉండే ఛాన్సుంది.

Lava Yuva 2 Star ఫీచర్లు...
డిస్ ప్లే..
ఈ ఫోన్ ఒక సాధారణ HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది సినిమాలు, వీడియోలు, గేమింగ్ కోసం మంచి వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది.
కెమెరా..
కెమెరా విషయంలో ఇది రోజువారీ ఫోటోగ్రఫీ కోసం ఒక రియర్, ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.
స్టోరేజ్..
ఈ ధరకే 8GB RAM అందించడం మంచి విషయం.
బ్యాటరీ..
లావా యువ స్టార్ 2 శక్తివంతమైన 5,000mAh బ్యాటరీతో వస్తుంది.
ప్రాసెసర్..
ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ UNISOC ప్రాసెసర్‌తో లభిస్తుంది. ఇది మీ రోజువారీ పనులైన కాల్స్, మెసేజింగ్, సోషల్ మీడియా, గేమింగ్‌కు సరిపోయే పనితీరును అందిస్తుంది.
Android 14 Go ఆపరేటింగ్ సిస్టమ్
ఈ ఫోన్ Android 14 Go ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. స్మూత్ పనితీరు, తక్కువ బ్యాటరీ వినియోగం, సులభమైన వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. అంతే కాకుండా లావా యువ స్టార్ 2 లో ప్రీ ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు లేకపోవడం ఒక స్పెషల్ ఫీచర్ అని చెప్పొచ్చు.
ధర..
లావా యువ స్టార్ 2 ధర రూ. 6,499












Click it and Unblock the Notifications