Microsoft AI Chief: పాడ్ కాస్ట్ స్టార్ట్ చేసినంత సింపుల్ గా ఏఐ
టెక్ ప్రపంచంలో మళ్లీ కలకలం రేపే వ్యాఖ్య చేశారు ముస్తఫా సులేమాన్ (Mustafa Suleyman). ప్రస్తుతం Microsoft సంస్థలో AI విభాగానికి నాయకత్వం వహిస్తున్న ఆయన, వచ్చే 18 నెలల్లోనే కంప్యూటర్ ముందు కూర్చుని చేసే చాలా ఉద్యోగాలు ఆటోమేషన్ బారిన పడొచ్చని హెచ్చరించారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కంపెనీ "ప్రొఫెషనల్-గ్రేడ్ AGI" లక్ష్యాన్ని వేగంగా సాధించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. అంటే, మనిషిలా ఆలోచించి పని చేసే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI)ని వ్యాపార రంగంలో ఉపయోగించాలన్నదే లక్ష్యం. ఇది కేవలం పనిని సులభం చేయడం మాత్రమే కాదు, ఉద్యోగాల నిర్మాణాన్నే మార్చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

రిస్క్ లో వైట్ కాలర్ జాబ్స్..
సులేమాన్ మాటల్లో చెప్పాలంటే, "వైట్ కాలర్" ఉద్యోగాలు.. డెస్క్ జాబ్స్ చాలా వరకు AI చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. న్యాయవాదులు, అకౌంటెంట్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, మార్కెటింగ్ నిపుణులు... ఇలా డాక్యుమెంట్లు తయారు చేయడం, డేటా విశ్లేషణ, క్లయింట్లతో కమ్యూనికేషన్ వంటి పనుల్లో యంత్రాల పాత్ర భారీగా పెరగొచ్చు. ఈ వ్యాఖ్యలు కేవలం ఊహాగానాలు కాదనే ఉదాహరణలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల అమెరికాకు చెందిన క్లౌడ్ సేవల సంస్థ సేల్స్ ఫోర్స్, AI వైపు దృష్టి మళ్లించడంతో సుమారు 1,000 ఉద్యోగాలను తగ్గించినట్లు వార్తలు వచ్చాయి. పెద్ద టెక్ కంపెనీలు, లాజిస్టిక్స్ సంస్థల్లో కూడా ఉద్యోగ కోతలు నమోదవుతున్నాయి.
అవసరాలకు తగ్గట్టు AIని..
సులేమాన్ చెప్పిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. భవిష్యత్తులో AI మోడల్ తయారు చేయడం కూడా పాడ్‌కాస్ట్ ప్రారంభించడం, బ్లాగ్ రాయడం లాంటిదే అవుతుందట. అంటే, పెద్ద టెక్ కంపెనీలకే పరిమితం కాకుండా, సాధారణ సంస్థలు కూడా తమ అవసరాలకు తగ్గట్టు AIని రూపొందించుకోగల స్థాయికి టెక్నాలజీ చేరుకుంటుందని ఆయన అంచనా. ఇంకా రెండు నుంచి మూడు సంవత్సరాల్లో AI ఏజెంట్లు పెద్ద కంపెనీల్లో సంక్లిష్ట పనులను స్వయంగా నిర్వహించే స్థాయికి చేరుకుంటాయని కూడా చెప్పారు. ఇది కార్పొరేట్ ప్రపంచంలో పెద్ద మార్పులకు దారితీసే అవకాశం ఉంది.
స్వయం సమృద్ధి దిశగా అడుగు
ఇక వ్యూహాత్మకంగా కూడా మైక్రోసాఫ్ట్ మార్పులు చేస్తోంది. ఇప్పటివరకు OpenAI పై ఎక్కువగా ఆధారపడిన కంపెనీ, ఇప్పుడు తన సొంత AI మోడళ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. రెండు సంస్థల మధ్య ఒప్పందాల తర్వాత, "ఇదే నిజమైన AI స్వయం సమృద్ధి దిశగా అడుగు" అని సులేమాన్ వ్యాఖ్యానించారు. కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఇన్-హౌస్ AI మోడళ్లు 2026 నాటికి మార్కెట్లోకి రావచ్చని ఆయన తెలిపారు. అంటే, రాబోయే రెండు సంవత్సరాలు AI రంగంలోనే కాకుండా ఉద్యోగ మార్కెట్‌లో కూడా కీలక మార్పులకు వేదిక కావొచ్చు.
మొత్తానికి, సులేమాన్ హెచ్చరిక ఒక క్లియర్ మెసేజ్ ఇస్తోంది.. AI కేవలం టూల్ కాదు, ఇది ఉద్యోగ ప్రపంచాన్ని పూర్తిగా మార్చే శక్తిగా మారుతోంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే... మనం ఆ మార్పుకు సిద్ధంగా ఉన్నామా?
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications