Apple News: ఆపిల్ లవర్స్‌కు మోస్ట్ అవైటెడ్ అప్‌డేట్.. మొదటిసారి పలు కొత్త ఫీచర్స్ పరిచయం

Apple new features: మొబైల్ యూజర్లకు ఆపిల్ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న OS అప్‌డేట్‌పై క్లారిటీ ఇచ్చింది. IOS 18.1 ని అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ అప్‌డేట్‌తో పలు కీలక ఫీచర్లను వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటిసారిగా AI సాంకేతికతను ఆపిల్ ఫోన్లలో ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

ఐఫోన్ వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాల్‌ రికార్డింగ్ ఫీచర్‌ను కొత్త OS అప్‌డేట్‌ ద్వారా ఆపిల్ అందుబాటులోకి తెచ్చింది. సెట్టింగ్స్ లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్ అప్డేట్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ ఐఫోన్‌లో తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీంతో మీరు కాల్‌లో ఉన్నప్పుడు స్క్రీన్‌లో ఎడమ వైపున ఒక రికార్డ్ బటన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ కాల్ రికార్డింగ్ ప్రారంభించవచ్చు. అండ్రాయిడ్‌ మొబైల్స్‌లో మాదిరిగానే రికార్డింగ్ ప్రారంభమైనట్లు తెలియజేసేందుకు కాల్‌లోని వారందరికీ వినిపించే విధంగా ఒక నోటిఫికేషన్ ప్లే అవుతుంది.

Most awaiting update released for apple mobile users

ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు మద్దతు ఇచ్చే పరికరాల ద్వారా సంభాషణ రియల్-టైమ్ ట్రాన్స్క్రిప్షన్ స్క్రీన్‌పై ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇది ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, మాండరిన్, కాంటోనీస్ మరియు పోర్చుగీస్ వంటి అనేక భాషలకు మద్దతు ఇస్తుంది. ఇక కాల్ ముగిసిన తర్వాత రికార్డింగ్స్ వాయిస్ నోట్స్ యాప్‌లో సేవ్ అవుతాయి. వీటినుంచి ఆపిల్ ఇంటెలిజెన్స్ ముఖ్యమైన అంశాల సారాంశాన్ని కూడా క్రియేట్ చేస్తుది. తద్వారా మొత్తం రికార్డింగ్‌ను రీప్లే చేయకుండా అవసరమైన భాగాన్ని తేలికగా రివ్యూ చేయవచ్చు.

కేవలం కాల్ రికార్డింగ్ మాత్రమే కాకుండా ఐఓఎస్ 18.1లో ఆపిల్ ఇంటెలిజెన్స్ శక్తివంతమైన AI పరికరాలను అందిస్తుంది. మెయిల్, మెసేజెస్ మరియు నోట్స్ వంటి యాప్స్‌లో వినియోగదారుల రచనలను మెరుగుపరచడంలో రైటింగ్ అసిస్టెంట్ సాయపడుతుంది. మళ్లీ రాస్తున్నా, తిరిగి రివ్యూ చేస్తున్నా టోన్ సర్దుబాటు చేయడానికి ఆప్షన్స్‌ను అందిస్తుంది. వ్యక్తిగతంగా మరియు ప్రొఫెషనల్ గా తిరిగి రాయడానికి మద్ధతిస్తుంది. వినియోగదారులు ఉద్దేశాలు, రచనా శైలినికి అనుగుణంగా సందేశాలను సర్దుబాటు చేస్తుంది.

మొబైల్స్‌ లోని ఐకానిక్ 'సిరి'కి ఆపిల్ మరింత మెరుగైన ఫంక్షనాలిటీ కల్పించింది. దీంతో సిరి సంభాషణ ఇప్పుడు మరింత సహజంగా ఉంటుంది. ఫాలో-అప్ ప్రశ్నలను కూడా చక్కగా నిర్వహించగలదు. గత ఆదేశాలను గుర్తుంచుకోవడంతో పాటు వాయిస్ మరియు టెక్స్ట్ ఇన్‌పుట్స్‌కు ఈజీగా మారిపోగలదు. అన్ని ఆపిల్ పరికరాల్లో కార్ ప్లే సహా ఈ కొత్త అప్‌డేట్స్ హ్యాండ్స్ ఫ్రీ, మల్టీ టాస్కింగ్ యాక్సెస్ అందిస్తుంది. తరచుగా ప్రయాణాలు చేసే వినియోగదారుల కోసం ఆప్ట్ చేయడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+