రూ. 12,999కే "Moto G57" 5G.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 8gb ర్యామ్ !!
ఇండియన్ మార్కెట్లో మోటారోలా మొబైల్స్ కి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఫోన్స్ టెక్ టెక్ ప్రియులను బాగా ఆకర్షించాయి. బడ్జెట్ రేంజ్ నుంచి ఫ్లాగ్ షిప్ రేంజ్ వరకు పలు ఫోన్‌లతో మంచిగా సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి తమ వినియోగదారుల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 'జీ సిరీస్'లో భాగంగా లేటెస్ట్ గా "Moto G57 పవర్ 5G" ఫోన్ లాంఛ్ చేసింది.
ఈ కొత్త హ్యాండ్ సెట్ 7,000mAh భారీ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 120Hz డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరా, 8 జీబీ ర్యామ్ వంటి అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తుంది. ముఖ్యంగా ఇది Snapdragon 6s Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించిన ప్రపంచంలో మొదటి ఫోన్‌గా నిలిచింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 3న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, Motorola.in సహా దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో అందుబాటులో రానుంది. ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

Moto G57 Power ధర..
Moto G57 పవర్ 5G 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధరను కంపెనీ ₹14,999గా నిర్ణయించింది. అయితే ప్రారంభ ఆఫర్‌లో బ్యాంక్ డిస్కౌంట్‌లు, లాంచ్ ఆఫర్‌లతో వినియోగదారులు దీన్ని ₹12,999కే కొనుగోలు చేయవచ్చు.
Moto G57 Power 5G ఫీచర్స్..
కలర్స్..
ఈ ఫోన్ మూడు ప్యాంటోన్ క్యూరేటెడ్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
- రెగాట్టా
- ఫ్లూయిడిటీ
- కార్సైర్
ఇవి వేగాన్ లెదర్ ఫినిషింగ్‌తో లభిస్తాయి.
డిస్‌ప్లే..
- Moto G57 పవర్‌లో 6.72-అంగుళాల Full HD+ LCD డిస్‌ప్లేను అందించారు.
- 120Hz రిఫ్రెష్ రేట్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్
- స్మార్ట్ వాటర్ టచ్ 2.0, SGS ఐ ప్రొటెక్షన్
- హై బ్రైట్‌నెస్ మోడ్ (HBM)
- డిస్‌ప్లే కలర్ బూస్ట్ టెక్నాలజీ
ఈ డిస్‌ప్లే గేమింగ్, స్ట్రీమింగ్, డైలీ యూజ్ ఇలా అన్నింటికీ అత్యుత్తమ అనుభవాన్ని అందిస్తుంది.
డిజైన్..
ఫోన్ MIL-810H స్టాండర్డ్‌కు అనుగుణంగా నిర్మించబడింది. ప్యాంటోన్ క్యూరేటెడ్ వేగాన్ లెదర్ ఫినిష్‌తో ఇది బడ్జెట్ ఫోన్ అనే మాటే గుర్తు రానిలా ప్రీమియం ఫీలింగ్‌ను ఇస్తుంది. మూడు డిజైన్ ఆప్షన్లు-Regatta, Fluidity, Corsair-విషువల్‌గా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
ప్రాసెసర్ & పనితీరు..
ఈ ఫోన్‌లో ఉపయోగించిన Snapdragon 6s Gen 4 చిప్‌సెట్ ప్రపంచంలోనే మొదటిసారి Moto G57 పవర్ ద్వారానే ఆవిష్కరించబడింది. ప్రొసెసర్ 4nm టెక్నాలజీ ఆధారంగా రూపొందించబడింది, దాంతో పవర్ ఎఫిషియెన్సీ, వేగం రెండూ మెరుగ్గా ఉంటాయి.
RAM & స్టోరేజ్..
8GB LPDDR4X RAM
RAM బూస్ట్ 4.0 ద్వారా మొత్తం 16GB వరకు వర్చువల్ RAM
మొత్తం 24GB వరకు RAM అనుభవం
128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్
రోజువారీ మల్టీటాస్కింగ్‌నైనా, హేవీ అప్లికేషన్‌లనైనా సులభంగా హ్యాండిల్ చేయగల శక్తి దీనిలో ఉంది.
కెమెరా..
Moto G57 పవర్ 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను అందించారు.
బ్యాక్ కెమెరా : 50MP సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్
8MP అల్ట్రావైడ్ కెమెరా - 119.5 డిగ్రీల FOV
2-ఇన్-1 లైట్/అంబియంట్ సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 8MP సెల్ఫీ కెమెరా ( క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ, ఫోటో బూత్ మోడ్ )
AI ఆధారిత ప్రత్యేక ఫీచర్లు: షాట్ ఆప్టిమైజేషన్, ఆటో స్మైల్ క్యాప్చర్, ఆటో నైట్ విజన్, పోర్ట్రెయిట్ బ్లర్, పోర్ట్రెయిట్ లైట్, స్కై రీప్లేస్‌మెంట్, కలర్ పాప్, సినిమాటిక్ ఫోటో
Google Photos AI టూల్స్: Magic Eraser, Photo Unblur, Magic Editor
వీడియో రికార్డింగ్:
అన్ని కెమెరాల నుంచీ 2K 60fps వీడియో రికార్డింగ్
బ్యాటరీ..
ఈ ఫోన్‌లో ఉన్న 7000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ దీని ప్రధాన ఆకర్షణ.
33W ఫాస్ట్ ఛార్జింగ్
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 గంటల వరకు రన్‌టైమ్
Battery Care 2.0 - ఛార్జింగ్ ప్యాటర్న్‌ను అర్థం చేసుకుని బ్యాటరీ లైఫ్ పెంచుతుంది
సాఫ్ట్‌వేర్..
ఫోన్ Android 16తో వస్తుంది. మోటరోలా Android 17 అప్డేట్, ఇంకా 3 సంవత్సరాల సెక్యూరిటీ మెయింటెనెన్స్ రిలీజ్‌లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
సెక్యూరిటీ..
Moto Secure
ThinkShield
Family Space - పిల్లల కోసం సురక్షిత వాడకం
Moto Unplugged - డిజిటల్ డిటాక్స్ టూల్స్
అదనంగా, Smart Connect 2.0, Swap to Share, Swap to Stream వంటి ఫీచర్లు పరికరాల మధ్య కనెక్టివిటీని మరింత సులభతరం చేస్తాయి.
కనెక్టివిటీ & ఆడియో..
Moto G57 పవర్ 11 5G బ్యాండ్లు, Wi-Fi 6 సపోర్ట్‌ను అందిస్తుంది.
డ్యూయల్ స్టీరియో స్పీకర్లు Dolby Atmos ట్యూనింగ్‌తో వస్తాయి












Click it and Unblock the Notifications