బడ్జెట్ లోనే అదిరిపోయే ఫీచర్లతో " మోటో G96 5G ".. లాంచ్ ఎప్పుడంటే ?

ఇండియన్ మార్కెట్ లో మోటారోలా మొబైల్స్ కి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు అనడంలో సందేహం లేదు. ఇప్పటికే Edge 60, Edge 60 Stylus వంటి ఫోన్‌లతో మంచిగా సక్సెస్ అయ్యింది మోటోరోలా. ఈ క్రమంలోనే ఇప్పుడు

మోటరోలా తన G-సిరీస్‌లో మరో శక్తివంతమైన ఫోన్‌ను తీసుకువస్తోంది. Moto G96 5G అనే పేరుతో వచ్చే ఈ స్మార్ట్‌ఫోన్‌ను జూలై 9, 2025న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో విడుదల చేయనుంది. ఇది ఫ్లిప్‌కార్ట్ మరియు మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా విక్రయించబడుతుందని స్పష్టం చేశారు. కాగా ఈ ఫోన్ రూ. 19,990 నుంచి రూ.22,990 వరకు ధర ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోన్ ఫీచర్లను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం..

motorola-g96-5g-smart-phone-price-and-specifications-details

MOTOROLA G96 5G ఫీచర్స్..

డిస్‌ ప్లే..

6.67 అంగుళాల 3D కర్వ్డ్ pOLED డిస్‌ప్లే

144Hz రిఫ్రెష్ రేట్

1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్

10-bit కలర్ సపోర్ట్

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్

SGS ఐ ప్రొటెక్షన్, వాటర్ టచ్ 2.0 సపోర్ట్

ప్రాసెసర్..

Qualcomm Snapdragon 7s Gen 2 చిప్‌సెట్

4nm ఫ్యాబ్రికేషన్

ఆక్టా-కోర్ CPU

RAM & స్టోరేజ్..

12GB LPDDR4X RAM (వర్చువల్ ర్యామ్‌తో కలిపి 20GB వరకు విస్తరణ)

256GB UFS ఇంటర్నల్ స్టోరేజ్

హైబ్రిడ్ సిమ్ స్లాట్ ద్వారా 1TB వరకు మెమరీ కార్డ్ సపోర్ట్

కెమెరా సెటప్..

రియర్ కెమెరాలు:

50MP Sony LYT-700C ప్రైమరీ సెన్సార్ (OIS సపోర్ట్‌తో)

8MP సెకండరీ కెమెరా (అల్ట్రావైడ్/మాక్రో విజన్)

ఫ్రంట్ కెమెరా:

32MP సెల్ఫీ కెమెరా (పంచ్ హోల్ డిజైన్)

కెమెరా ఫీచర్లు: Ultra Res, HDR, Night Vision, Portrait Mode, Dual Capture, Google Lens ఇంటిగ్రేషన్

బ్యాటరీ..

5,500mAh భారీ బ్యాటరీ

68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ (50% ఛార్జ్ కేవలం కొన్ని నిమిషాల్లో)

సాఫ్ట్‌వేర్..

Android 15

Motorola Hello UI (క్లీన్, బ్లోట్‌వేర్ లేని అనుభవం)

2-3 సంవత్సరాల ప్రధాన OS అప్‌డేట్స్, 3-4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్

డిజైన్ & నిర్మాణం..

Premium Vegan Leather Finish ప్యానెల్

IP68 రేటింగ్ (ధూళి, నీటి నిరోధకత)

రంగులు..

Ashley Blue, Dresden Blue, Cattleya Orchid (Lavender), Greener Pastures (Green), Premium Pink

ఆడియో & బిల్ట్ ఫీచర్లు..

స్టీరియో స్పీకర్లు

Dolby Atmos సపోర్ట్ (అనధికారిక)

సెక్యూరిటీ..

In-Display Fingerprint Sensor

Face Unlock

కనెక్టివిటీ..

డ్యూయల్ 5G, VoLTE

Wi-Fi, Bluetooth 5.4

NFC, USB Type-C పోర్ట్

Moto G96 5G ఫోన్ లో భారీ బ్యాటరీ, మంచి కెమెరా, మెరుగైన డిస్‌ప్లేతో ఫీచర్లు ఉండడంతో కస్టమర్లు సైతం ఈ ఫోన్ కొనుగోలు చేసేందుకు టెక్ ప్రియులు సైతం ఆసక్తి చూపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+