మోటోరోలా నుంచి "సిగ్నేచర్‌" స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్.. ఫీచర్స్ ఇవే !

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరలోనే ఫోన్లను అందించేందుకు కంపెనీలు సైతం పోటీ పడుతున్నాయి. ఇండియన్ మార్కెట్లో ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటారోలా మొబైల్స్ కి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఫోన్స్ టెక్ టెక్ ప్రియులను బాగా ఆకర్షించాయి. బడ్జెట్ రేంజ్ నుంచి ఫ్లాగ్ షిప్ రేంజ్ వరకు పలు ఫోన్‌లతో మంచిగా సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలోనే మోటోరోలా మరో కొత్త ప్రీమియం ఫోన్‌ను భారతీయ మార్కెట్‌లో విడుదల చేయనుంది.

లేటెస్ట్ గా మరో ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్న 'మోటోరోలా సిగ్నేచర్‌' స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. లాంచ్‌కు ముందే లీకుల ద్వారా ఆసక్తి రేపిన ఈ ఫోన్.. ఇప్పుడు పూర్తి స్పెసిఫికేషన్లు, ధరలు, విక్రయ వివరాలతో వినియోగదారుల ముందుకు వచ్చింది. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

motorola-launched-new-smart-phone-signature-with-amazing-features-and-in-reasonable-prices

( motorola ) మోటోరోలా సిగ్నేచర్‌ ఫీచర్స్..

సాఫ్ట్‌వేర్ & పనితీరు..

మోటోరోలా సిగ్నేచర్‌ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత మోటోరోలా హెలో UIతో పనిచేస్తుంది. క్లీన్గా, బ్లోట్‌వేర్ లేకుండా ఉండే యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడమే లక్ష్యంగా ఈ UIని రూపొందించారు. ఫోన్‌కు శక్తినిచ్చేది తాజా ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, ఇది హైఎండ్ గేమింగ్‌, మల్టీటాస్కింగ్‌, ఏఐ ఆధారిత ఫీచర్లకు అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

డిస్‌ప్లే హైలైట్స్..

ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల సూపర్ హెచ్‌డీ LTPO ఎక్స్‌ట్రీమ్ AMOLED డిస్‌ప్లేను అందించారు.
165Hz రిఫ్రెష్ రేటు వల్ల స్మూత్ స్క్రోలింగ్, గేమింగ్ అనుభూతి లభిస్తుంది. అంతేకాకుండా 6200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్తో అవుట్‌డోర్‌లోనూ అద్భుతమైన విజిబిలిటీ అందిస్తుంది.

డిజైన్ & డ్యూరబిలిటీ..

  • డిజైన్ పరంగా మోటోరోలా సిగ్నేచర్‌ ప్రీమియం ఫీల్ ఇస్తుంది.
  • అల్యూమినియం ఫ్రేమ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో పాటు
  • IP68 & IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్లు కలిగి ఉంది.
  • ఇది మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ టెస్టులను కూడా పూర్తి చేసిన ఫోన్ కావడం విశేషం.

కెమెరా సెటప్..

ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం ఇందులో పవర్‌ఫుల్ ట్రిపుల్ 50MP రియర్ కెమెరా సెటప్ అందించారు.
• 50MP OIS ప్రైమరీ సెన్సర్
• 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్
• 50MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సర్

పెరిస్కోప్ కెమెరా 3x ఆప్టికల్ జూమ్, 100x హైబ్రిడ్ జూమ్ను సపోర్ట్ చేస్తుంది.
ముందు వైపు 50MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ ఫోన్‌తో 8K @30fps వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

బ్యాటరీ & ఛార్జింగ్..

  • మోటోరోలా సిగ్నేచర్‌లో 5,200mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ అమర్చారు.
  • ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.
  • ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 41 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ పేర్కొంది.
  • పవర్ యూజర్లకు ఇది పెద్ద ప్లస్ పాయింట్.

కనెక్టివిటీ & ఇతర ఫీచర్లు..

ఈ ఫోన్‌లో లేటెస్ట్ కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
• 5G సపోర్ట్
• Wi-Fi 7
• Bluetooth 6.0
• USB Type-C పోర్ట్
• స్టీరియో స్పీకర్లు (డాల్బీ అట్మాస్ సపోర్ట్)
• ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్

ధరలు & ఆఫర్లు..

మోటోరోలా సిగ్నేచర్‌ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది.
• 12GB RAM + 256GB - ₹59,999
• 16GB RAM + 512GB - ₹64,999
• 16GB RAM + 1TB - ₹69,999

హెచ్‌డీఎఫ్‌సీ లేదా యాక్సిస్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.5,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.

ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ జనవరి 30 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలకు అందుబాటులోకి రానుంది. హైఎండ్ ఫీచర్లు, పవర్‌ఫుల్ కెమెరా, స్ట్రాంగ్ బ్యాటరీతో మోటోరోలా సిగ్నేచర్ ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+