జాక్‌పాట్ కొట్టిన ఎలాన్ మస్క్: నాసా నుంచి బిగ్ ప్రాజెక్ట్

NASA's Dragonfly mission: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా చేపట్టిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ మిషన్ డ్రాగన్‌ఫ్లై. శని గ్రహం చంద్రుడు టైటాన్‌పై ప్రయోగాలు చేపట్టడానికి ఉద్దేశించిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. వచ్చే ఏడాది ఇది కార్యరూపం దాల్చబోతోంది. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేస్తోంది నాసా.

డ్రాగన్‌ఫ్లై లాంచింగ్‌, దీనికి అవసరమైన రోటర్‌క్రాఫ్ట్ ల్యాండర్‌‌ను అభివృద్ధి చేయడానికి స్పేస్‌ఎక్స్‌ను ఎంపిక చేసింది నాసా. ఇందులో భాగంగా ఈ మిషన్‌కు అవసరమైన పూర్తి మెటీరియల్‌లను నాసాకు సరఫరా చేస్తుందీ సంస్థ. డ్రాగన్‌ఫ్లై డిజైన్‌ను రూపొందించడం, దీన్ని ప్రయోగించడానికి అవసరమైన రాకెట్‌ను సమకూర్చుతుంది.

NASA has selected SpaceX for the Dragonfly mission to explore Saturn s moon Titan

ఈ మేరకు స్పేస్ ఎక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నాసా ప్రకటించింది. ఈ ఒప్పందాల విలువ- 256.6 మిలియన్ డాలర్లు. 2028 జులై 5 నుంచి 25వ తేదీ లోపల డ్రాగన్‌ఫ్లై మిషన్‌ను టైటాన్‌పై ప్రయోగించాలని నిర్ణయించుకుంది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌ లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి దీన్ని అంతరిక్షంలోకి పంపుతుంది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్‌ను దీనికోసం వినియోగించనుంది.

మనకు ఉన్నది ఒకే ఒక్క చంద్రుడు. శని గ్రహానికి మాత్రం ఏకంగా 146 చందమామలు ఉన్నాయి. అందులో అతి పెద్దది టైటాన్. దీని పరిణామం ఏ స్థాయిలో ఉంటుందంటే బుధ గ్రహం (మెర్క్యురి) కంటే ఇది పెద్దది. మెర్క్యురి వైశాల్యం 4,878 కిలోమీటర్లు కాగా.. టైటాన్‌ది 5,150 కిలోమీటర్లు.

ఇక్కడి ఉష్ణోగ్రత మైనస్ 179 డిగ్రీల సెల్సియస్. పూర్తిగా ఆరెంజ్ పొగమంచుతో కూడుకుని ఉంటుందీ చందమామ. టైటాన్ ఉపరితలం నుంచి సుమారు 600 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఇది వ్యాప్తించి ఉంటుంది. భూ వాతావరణంతో పోల్చుకుంటే ఇది చాలా అధికం.

టైటాన్‌పై ఉన్న వాతావరణ పరిస్థితులపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సంకల్పించింది నాసా. నివాసం ఉండటానికి అనువైన వాతావరణం ఉందని నమ్ముతోంది. అక్కడి పరిస్థితులు దాదాపుగా భూమికి సమానంగా ఉంటుందని, కొన్ని రకాల సూక్ష్మజీవులు సైతం అక్కడ ఉండొచ్చని విశ్వసిస్తోంది.

దీని అంతు తేల్చాలనే ఉద్దేశంతోనే మిషన్ డ్రాగన్‌ఫ్లైని చేపట్టింది. దీనితో పాటు పంపించే పేలోడ్స్ అన్నీ కూడా టైటాన్ పర్యావరణంపై అధ్యయనం చేస్తాయి. ప్రీబయోటిక్ కెమిస్ట్రీ గురించి ఆరా తీస్తాయి. ఇందులో పేలోడ్స్‌గా రోటర్‌క్రాఫ్ట్, అటానమస్ ఫ్లైట్‌ను పంపిస్తారు నాసా సైంటిస్టులు. మేరీల్యాండ్‌ లారెల్‌లోని జాన్ హాప్‌కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీలో వాటిని అభివృద్ధి చేస్తోన్నారు.

స్పేస్ ఎక్స్ సంస్థ.. అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందినది. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం అవిశ్రాంతంగా పని చేశారాయన. భారీ మెజారిటీతో గెలవడంలో కీలకంగా వ్యవహరించారు. ఇలాంటి పరిస్థితుల్లో స్పేస్ ఎక్స్‌కు 256 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+