భూమి బద్ధలయ్యే టైమ్ వచ్చింది..? దూసుకొస్తున్న 10 అంతస్తుల పొడవున్న భారీ గ్రహ శకలం..

అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(NASA) సంచలన వార్నింగ్ ఇచ్చింది. భూమి వైపు 10 అంతస్తుల పొడనున్న భారీ గ్రహ శకలం దూసుకొస్తున్నట్లు పేర్కొంది. గంటకు దాదాపు 22,500 కిలోమీటర్ల వేగంతో భూ గ్రహం వైపునకు దూసుకొస్తోందని నాసా అంచనా వేసింది. 2022 YS5 పేరు కలిగిన ఈ గ్రహ శకలం భూమికి అతి దగ్గర నుంచి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది. గతి తప్పి భూమి వైపు దూసుకురావచ్చన్న అంచనాల నేపథ్యంలో నాసా ఈ విషయాన్ని వెల్లడించింది.

దాదాపు 10 అంతస్తుల పొడవు ఉన్న భారీ గ్రహ శకలం భూమికి అతి సమీపం నుంచి ప్రయాణించనుందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(NASA) పేర్కొంది.గంటకు దాదాపు 22,500 కిలోమీటర్ల వేగంతో భూ గ్రహం వైపునకు దూసుకొస్తోందని నాసా అంచనా వేసింది. జులై 17 వ తేదీ గురువారం ఈ భారీ గ్రహశకలం భూమిని దాటి వెళ్లనున్నట్లు తెలిపింది. భూ గ్రహానికి ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించింది.

2022 YS5 అనే పేరు కలిగిన భారీ గ్రహశకలం జులై 17 న భూమి సమీపం నుంచి ప్రయాణించనున్నట్లు నాసా పేర్కొంది. దాదాపు 10 అంతస్తుల పొడవు ఉన్న భారీ గ్రహ శకలం భూమికి కొన్ని మిలియన్ కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తోందని ఈ మేరకు భూ గ్రహానికి ముప్పు లేదని తెలిపింది. ఈ గ్రహశకలం దాదాపు 120 అడుగులు.. 36.5 మీటర్లు ఉంటుందని నాసా పేర్కొంది.అటు ఇస్రో సైతం ఈ ఆస్టరాయిడ్ ప్రయాణాన్ని నిశితంగా పరిశీలిస్తోంది.

NASA Warns 10-Story Asteroid Fragment Racing Toward Earth at 22 500 km h

భూమికి ఎలాంటి ముప్పు లేదని ఇస్రో సైతం వెల్లడించింది. అయితే గ్రావిటేషనల్ పుల్, సోలార్ రేడియేషన్ కారణంగా ఏమైనా జరగొచ్చని తెలిపాయి. మరోవైపు Apophis 2029 అనే మరో భారీ గ్రహ శకలం సైతం భూమి వైపు దూసుకొస్తోందని నాసా, ఇస్రో సంయుక్తంగా పేర్కొన్నాయి. ఈ గ్రహ శకలాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+