NISAR Satellite: భూమి రహస్యాలు చేధించేందుకు ఒక్కటైన నాసా - ఇస్రో..!!
NISAR Satellite:యూఎస్ - భారత్ సంయుక్తంగా ప్రయోగించబోతున్న NISAR ప్రతిష్టాత్మకంగా మారనుంది. గతంలో భూమిని ఏ మిషన్ పరిశీలించని విధంగా నూతన రీతిలో అధ్యయనం చేసేందుకు సిద్దమయ్యింది. ఎప్పటికప్పుడు మారుతున్న భూమి ఉపరితలం గురించి వివరాలను అందించనుంది. మరి ముఖ్యంగా డ్యూయల్-బ్యాండ్ రాడార్ తో వస్తున్న ఈ ఉపగ్రహం.. భూకంపాలు, కొండచరియలు, అగ్నిపర్వతాల నుంచి భూమి వైకల్యాన్ని కొలవనుంది. వీటితో పాటే సైన్స్, డిజాస్టర్స్, ప్రకృతి వనరులపై విశ్లేషణ చేయనుంది.
NISAR రెండు రకాల రాడార్‌లతో భూమిని పరిశీలించే మొదటి ఉపగ్రహంగా నిలవనుండగా.. అందులో 10-అంగుళాల L-బ్యాండ్ సిస్టమ్.. 4-అంగుళాల S-బ్యాండ్ సిస్టమ్ పొందుపరిచారు. గ్రహం యొక్క ఉపరితలాలు నిత్య మారుతూనే ఉంటాయి. NISAR సాకారంతో ప్రతి వారం ఆ మార్పును కొలవనున్నట్టు తెలుస్తోంది. మైక్రోవేవ్‌లు ఒక వస్తువును ప్రతిబింబిస్తాయా లేదా చొచ్చుకుపోతాయా అనేది వాటి తరంగదైర్ఘ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగానే NISAR యొక్క రెండు రాడార్ సిగ్నల్స్ భూమి యొక్క ఉపరితలంపై కొన్ని లక్షణాలకు భిన్నంగా ప్రతిస్పందిస్తాయని అంచనా వేస్తున్నారు.

NISAR సేకరించే ప్రతి పిక్సెల్ టెన్నిస్ కోర్ట్‌లో సగం పరిమాణాన్ని సంగ్రహిస్తుందని ప్రాజెక్ట్ శాస్త్రవేత్త పాల్ రోసెన్ వెల్లడించారు. చాలా చిన్న స్థాయిలో భూమి, మంచు ఉపరితలాల చిత్రాలను తీయడం జరుగుతుందని తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలోని NASA జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో పాల్ రోసెన్ విశేష సేవలు అందించారు. ఇటీవల జరిగిన మీటింగ్ లో NISAR ప్రత్యేకత గురించి వివరించారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2007లో డెకాడల్ సర్వే చేపట్టింది. ఆ సమయంలో ఇస్రో ఎస్-బ్యాండ్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ప్రయత్నాలు చేపడుతోంది. దాంతో రెండు సైన్స్ బృందాలు డ్యూయల్-బ్యాండ్ మిషన్‌ను ప్రతిపాదించాయి. ఈ క్రమంలోనే 2014లో NISAR ప్రయోగానికి NASA, ISRO భాగస్వామిగా ఉండటానికి అంగీకరించాయని వెల్లడించారు. ఉపగ్రహాన్ని పూర్తి చేయడానికి భారతదేశంలో అసెంబుల్ చేయడానికి ముందు హార్డ్‌వేర్ వివిధ ఖండాల్లో నిర్మించబడిందని తెలిపారు.
భూమిని పరిశీలించే మిషన్ కోసం హార్డ్‌వేర్ డెవలప్‌మెంట్‌పై రెండు ఏజెన్సీలు సహకరించడం ఇదే మొదటిసారి కావడం ఈ ప్రయోగాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. మిషన్ L-బ్యాండ్ SARని అందిస్తోంది. NASA రాడార్ రిఫ్లెక్టర్ యాంటెన్నా, డిప్లోయబుల్ బూమ్ సహా పలు విషయాల్లో సాకారం అందించింది. ఇస్రో మిషన్ S-బ్యాండ్ SAR పరికరాన్ని అందిస్తోంది. స్పేస్‌క్రాఫ్ట్ బస్సును బెంగళూరులోని యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ అందిస్తోంది. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగ వాహనం.. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ద్వారా ప్రయోగ సేవలు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ S-బ్యాండ్ డేటా రిసెప్షన్ బాధ్యతలను తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ప్రయోగంపై హాట్ డిస్కషన్ నడుస్తోంది.












Click it and Unblock the Notifications